For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ పేటీఎమ్ వాటా అలీబాబా చేతికి

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ , పేటీఎమ్‌లో త‌న‌కు ఉన్న 1 శాతం వాటాను 275 కోట్ల రూపాయ‌ల‌కు అలీబాబా గ్రూప్‌కు అమ్మేసింది. మొద‌ట్లో పేటీఎమ్‌లో 10 కోట్ల‌ను పెట్టుబుడుల రూపంలో ఉంచ‌డం ద్వారా రిల‌య‌న్స్ బాగానే లాభ‌ప

|

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ , పేటీఎమ్‌లో త‌న‌కు ఉన్న 1 శాతం వాటాను 275 కోట్ల రూపాయ‌ల‌కు అలీబాబా గ్రూప్‌కు అమ్మేసింది. మొద‌ట్లో పేటీఎమ్‌లో 10 కోట్ల‌ను పెట్టుబుడుల రూపంలో ఉంచ‌డం ద్వారా రిల‌య‌న్స్ బాగానే లాభ‌ప‌డింది. దాదాపు పేటీఎమ్ వాల్యూయేష‌న్ వెయ్యి రెట్లు పెర‌గ‌డంతో దాంట్లో ఇన్వెస్ట్ చేసిన అన్ని సంస్థ‌ల‌కు బంప‌ర్ బొనాంజా ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో పేటీఎమ్ పెట్టుబ‌డులు గురించి మ‌రిన్ని అంశాలు తెలుసుకుందాం.

 పేటీఎమ్ మాతృ సంస్థ వ‌న్‌97

పేటీఎమ్ మాతృ సంస్థ వ‌న్‌97

మ‌నంద‌రికీ పేటీఎమ్‌గా చేరువైన ఆ కంపెనీ పేరు అది కాదు. ఈ-కామ‌ర్స్ సంస్థ వ‌న్‌97 దానికి మాతృ సంస్థ‌. వ‌న్‌97 వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌. నోయిడా కేంద్రంగా పేటీఎమ్‌ను 2010లో స్థాపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌నే దాని సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 విలువ వెయ్యి రెట్లు పెరిగిందా?

విలువ వెయ్యి రెట్లు పెరిగిందా?

దీని గురించి ఒక విష‌యంల తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. వ‌న్‌ వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంస్థ విలువ 2007లో 11 కోట్ల రూపాయలు ఉంటే 2015 నాటికి రూ.12వేల కోట్లకు చేరింది. అంటే- ఎనిమిదేళ్లలో వెయ్యి రెట్లకుపైన పెరిగింది.

 4 బిలియ‌న్ డాల‌ర్ల పేటీఎమ్‌

4 బిలియ‌న్ డాల‌ర్ల పేటీఎమ్‌

మొద‌ట్లో వివిధ పెట్టుబ‌డిదారుల నుంచి నిధులు సేక‌రించిన పేటీఎమ్ నెమ్మ‌దిగా స్వ‌తాహాగా లాభాలు ఆర్జించ‌గ‌ల స్థాయికి ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అలీ బాబా ఇందులో 625 మిలియ‌న్ డాల‌ర్లు పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు పేటీఎమ్ విలువ 1.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా 2016 ఆగ‌స్టు నాటికి పేటీఎమ్ వాల్యూయేష‌న్‌ను 5 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా అంచ‌నా వేశారు. ఈ మ‌ధ్య స్టార్ట‌ప్ బుడ‌గ పేల‌డంతో మ‌ళ్లీ పేటీఎమ్ విలువ కాస్త త‌గ్గింది. ప్ర‌స్తుతం దాదాపు 4 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న పేటీఎమ్‌లో అలీ బాబా గ్రూప్‌తో పాటు దేశీయ ఇన్వెస్ట‌ర్లు సైతం పెట్ట‌బడులు పెట్టారు.

పేటీఎమ్ పెట్టుబ‌డులు

పేటీఎమ్ పెట్టుబ‌డులు

పేటీఎమ్ సైతం ఇత‌ర సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడుతోంది. ఈ దిశ‌లో మొద‌టి పెట్టుబ‌డి ఆటో రిక్షా అగ్రిగేట‌ర్ జుగ్నూలో 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఇన్వెస్ట్ చేసింది. అంతే కాకుండా ఢిల్లీకి చెందిన షిఫూను 8 మిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసింది. ఇంకా స్థానిక సేవ‌ల‌ను అందించే నియ‌ర్‌.ఇన్‌ను 2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు సొంతం చేసుకుంది. అన్నిటికంటే గొప్ప విష‌యం భార‌త క్రికెట్ జ‌ట్టు స్పాన్ష‌ర్‌షిప్‌ను 200 కోట్ల‌కు గెలుచుకోవ‌డం.

Read more about: paytm alibaba
English summary

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ పేటీఎమ్ వాటా అలీబాబా చేతికి | Reliance Capital sells Paytm stake to Alibaba for rs 275 cr

Reliance Capital has sold its nearly 1 per cent stake in popular digital payments firm Paytm for Rs. 275 crore to China’s Alibaba Group in a deal reaping huge gains for the Anil Ambani—led group firm.
Story first published: Tuesday, March 7, 2017, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X