For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు రుసుముల‌పై ఆగ్ర‌హంతో ఉన్న క‌స్ట‌మ‌ర్లు, సోష‌ల్ మీడియాలో సెటైర్లు

ప్రైవేట్‌రంగ బ్యాంకులు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై విధించిన చార్జీలను 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి వస్తుండటం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే

|

ప్రైవేట్‌రంగ బ్యాంకులు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై విధించిన చార్జీలను 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి వస్తుండటం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రుసుముల‌ను ఒక్క‌సారిగా పెంచేశాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రకటించాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేతన ఖాతాదారులకు (సాలరీ అకౌంట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పాయి. అయతే దీనిపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో 70 శాతం మంది వ్యతిరేకత కనబరిచారు.

రూ.20 తోనే పోస్టాఫీసు పొదుపు ఖాతానా? ఖాతా గురించి మ‌రిన్ని విష‌యాలు...రూ.20 తోనే పోస్టాఫీసు పొదుపు ఖాతానా? ఖాతా గురించి మ‌రిన్ని విష‌యాలు...

బ్యాంకు రుసుముల‌పై ఆగ్ర‌హంతో ఉన్న క‌స్ట‌మ‌ర్లు

మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచించుకోవాలని ప్రైవేట్‌రంగ బ్యాంకర్లను కోరింది. ఎస్బీఐ సైతం చార్జీల‌ను పెంచ‌డం సామాన్యుడిని ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. ఒక్క‌సారి ఎస్బీఐ విలీనం పూర్త‌యితే దేశంలో స‌గం మంది బ్యాంకు ఖాతాదారుల‌కు స్టేట్ బ్యాంకే సేవ‌లందిస్తుంది. అలాంటిది ఒక‌ప‌క్క ఫైనాన్సియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ గురించి మాట్లాడుతూ మ‌రో వైపు ఇలా చార్జీలు పెంచ‌డ‌మేంట‌ని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్‌బీఐ, ప్ర‌భుత్వం ఏ మేలు కోసం ఈ చ‌ర్య‌ల‌కు అంగీక‌రించాయో వివ‌రించాల్సిందేన‌ని క‌స్ట‌మ‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగుల‌తో సైతం వాగ్వాదానికి దిగుతున్నారు. దీనికి బ్యాంకు శాఖ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు చేయ‌గ‌లిగిందేమీ లేదు. క‌స్ట‌మ‌ర్లంతా ఆర్‌బీఐకి, ప్ర‌భుత్వానికి లేఖ‌ల,మెయిల్స్‌ ద్వారా విన్న‌పాల ద్వారా త‌మ అభ్యంత‌రాల‌ను తెల‌పాల్సిందిగా మ‌న‌వి. రెండు, మూడు రోజుల నుంచి నెటిజ‌న్లు ఆర్బీఐ, బ్యాంకుల‌పైన సామాజిక మాధ్య‌మాల్లో వ్యంగాస్త్రాల‌ను సైతం సంధిస్తున్నారు.

అమ్మో! బ్యాంకుల‌కు ఈ సేవ‌ల‌న్నింటికీ రుసుములు వ‌సూలు చేస్తున్నాయా?అమ్మో! బ్యాంకుల‌కు ఈ సేవ‌ల‌న్నింటికీ రుసుములు వ‌సూలు చేస్తున్నాయా?

English summary

బ్యాంకు రుసుముల‌పై ఆగ్ర‌హంతో ఉన్న క‌స్ట‌మ‌ర్లు, సోష‌ల్ మీడియాలో సెటైర్లు | customers fury over banks regarding charges for services and transactions

As per the Reserve Bank of India's (RBI) policy, banks are allowed to provide a certain number of transactions free of cost to customers every month. In the year 2014, RBI changed eligibility for transaction up to three instead of 5 free transactions for metro cities. After the free transactions, a nominal fee will be charged per transaction which can be decided by banks with maximum fee of Rs 20 per transactions, RBI had said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X