For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రైవేటు త‌ర్వాత ఎస్‌బీఐ సైతం : చార్జీల బాదుడు

త‌మ ఖాతాదారుల‌కు ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్‌, క‌నీస న‌గ‌దు నిల్వ‌కు సంబంధించిన వివిధ రుసుముల‌ను ప్ర‌క‌టించాయి. ఇప్పుడు ఎస్‌బీఐ సైతం వివిధ స‌వ‌రించిన చార్జీల‌ను త‌న వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది.అవి మీ కోసం

|

రుసుముల బాదుడులో ప్రైవేటుకు దీటుగా ఎస్‌బీఐ సైతం
ఐదేళ్ల త‌ర్వాత ఎస్‌బీఐ త‌న ఖాతాదారుల‌కు వివిధ చార్జీల‌ను స‌వ‌రించింది. గ‌త వారంలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ త‌మ ఖాతాదారుల‌కు ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్‌, క‌నీస న‌గ‌దు నిల్వ‌కు సంబంధించిన వివిధ రుసుముల‌ను ప్ర‌క‌టించాయి. ఇప్పుడు ఎస్‌బీఐ సైతం వివిధ స‌వ‌రించిన చార్జీల‌ను త‌న వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. అవి మీ కోస‌మే...

న‌గ‌దు డిపాజిట్లు హోం బ్రాంచీలోమూడే

న‌గ‌దు డిపాజిట్లు హోం బ్రాంచీలోమూడే

సేవింగ్స్‌ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. ఇక్క‌డ ఒక విష‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు కాస్త స్వాంత‌నే. ఎస్బీఐ పొదుపు ఖాతా క‌లిగిన వారు నాన్‌-హోం బ్రాంచీల్లో చేసే న‌గ‌దు డిపాజిట్ల‌పై ఎటువంటి ప‌రిమితే లేద‌ని ఎస్‌బీఐ వెబ్‌సైట్లో పేర్కొంది.

ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్‌

ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్‌

మూడు నెల‌ల కాల వ్య‌వ‌ధిలో త్రైమాసిక ఖాతా నిల్వ‌ను రూ.25 వేలుగా నిర్వ‌హించిన వారికి ఖాతా లావాదేవీల‌కు సంబంధించి పంపే ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్ కోసం మూడు నెల‌ల‌కు రూ. 15 రుసుమును వ‌సూలు చేస్తారు. అకౌంట్ స్టేట్‌మెంట్ ఫిజిక‌ల్ కాపీని ఇంటికి వ‌చ్చేలా అభ్య‌ర్థిస్తే అందుకు రూ. 44(+సేవా ప‌న్ను అద‌నం) రుసుము ఉంటుంది. మెయిల్ ద్వారా కావాల‌నుకుంటే ఎటువంటి రుసుములు ఉండ‌వు.

వీటికి రుసుముల్లేవు

వీటికి రుసుముల్లేవు

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపుల‌కు ఎటువంటి ప్ర‌త్యేక రుసుముల్లేవు. అదే విధంగా ఏ మొబైల్‌, డీటీహెచ్ రీచార్జీ లేదా టాప్అప్‌ల‌కు చార్జీలు అద‌నంగా వ‌సూలు చేయ‌రు. ఏటీఎం కేంద్రాలు, కాంటాక్ట్ సెంట‌ర్లు వంటి వాటి ద్వారా ఏటీఎమ్ పిన్‌ను రీసెట్ చేసుకుంటే అందుకోసం ప్ర‌త్యేకంగా చార్జీలు ఉండ‌వ‌ని ఎస్‌బీఐ పేర్కొంది.

క‌రెంటు ఖాతాదారులు

క‌రెంటు ఖాతాదారులు

రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000 డిపాజిట్ల‌పై 75పైసల చార్జీ+సేవా రుసుం విధింపు ఉంటుంది. అయితే, ఈ చార్జీ కూడా కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తారు. మిగిలిన కరెంటు ఖాతాలపై చార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే, బ్యాంకు శాఖలో నగదు ఉపసంహరణల విషయాన్ని బ్యాంకు ప్రస్తావించలేదు.

ప‌వ‌ర్ గెయిన్‌, ప‌వ‌ర్ ప్యాక్‌

ప‌వ‌ర్ గెయిన్‌, ప‌వ‌ర్ ప్యాక్‌

త్రైమాసిక న‌గ‌దు నిల్వ‌ల నిర్వ‌హ‌ణ‌ల విష‌యంలో వివిధ ఖాతాల‌కు ప‌రిమితులు వేర్వేరుగా ఉన్నాయి. సాధార‌ణ క‌రెంటు ఖాతా విష‌యంలో కేవ‌లం రూ.10వేల నిల్వ ఉంటే చాలు. కానీ ప‌వ‌ర్‌ గెయిన్ ఖాతాదార్లు రూ. 2 ల‌క్ష‌లు, ప‌వ‌ర్ ప్యాక్ ఖాతాదార్లు రూ. 5 ల‌క్ష‌లుగాను క‌నీస నిల్వ‌ను నిర్వ‌హించుకోవాల్సి ఉంటుంది. ఆయా ఖాతాల‌కు డిపాజిట్‌ల విష‌యంలో ఉచిత ప‌రిమితులు ఈ విధంగా ఉన్నాయి. ప‌వ‌ర్ గెయిన్ ఖాతా క‌లిగిన వారు రూ. 15 ల‌క్ష‌లు(నెల‌కు), ప‌వ‌ర్ ప్యాక్ ఖాతాదార్లు రూ. 60 ల‌క్ష‌లు(నెల‌కు) ఉచితంగా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. ఆపైన రుసుములు వ‌ర్తిస్తాయ‌ని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ రుసుములు క‌నీసం రూ.50 నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా రూ. 20 వేల వ‌ర‌కూ ఉండొచ్చు.

ఏటీఎం సేవలపై చార్జీలు

ఏటీఎం సేవలపై చార్జీలు

ఇక నుంచి నెలలో ఎస్‌బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరించుకోగలరు. ఆపై సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి జరిపే ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. అలాగే, నెలలో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు సార్లు మాత్రమే నగదు విత్‌డ్రాయ‌ల్స్‌ ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీకి రూ.20 చార్జీ ఉంటుంది.

బ్యాంకులో సొమ్ములుంటే రుసుములు ఉండ‌వు

బ్యాంకులో సొమ్ములుంటే రుసుములు ఉండ‌వు

ఒకవేళ ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25వేలు ఉంటే సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీలపై చార్జీలు ఉండవు. రూ.లక్ష బ్యాలన్స్‌ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ లావాదేవీలు ఉచితం. ఏటీఎం మెషిన్లలో నగదు లేక లావాదేవీ తిరస్కరణకు గురైతే దానిపై కూడా రూ.20సేవా రుసుం విధించడం జరుగుతుంది.

ఖాతా మూసివేసేందుకు

ఖాతా మూసివేసేందుకు

ఎస్‌బీఐ పొదుపు ఖాతాను తెరిచిన త‌ర్వాత 14 రోజుల్లోపు ఖాతాను క్లోజ్ చేయాల‌నుకుంటే ఎటువంటి చార్జీలు లేవు. ఒక‌వేళ 14 రోజుల త‌ర్వాత‌, 6 నెల‌ల్లోపు ఖాతాను మూసివేయాల‌నుకుంటే అకౌంట్ క్లోజింగ్ చార్జీల కింద రూ. 500తో పాటు సేవా ప‌న్నుఅద‌నంగా వ‌సూలు చేస్తారు. 6 నెల‌లు దాటిన త‌ర్వాత 12 నెల‌ల్లోపు ఖాతాను మూసివేస్తే అందుకు రూ. 1వేయి(సేవా ప‌న్ను అద‌నం) రుసుములు క‌ట్టాల్సిందే.

ఖాతా మూసివేత విష‌యంలో ఫైనాన్సియ‌ల్ ఇన్‌క్లూజ‌న్లో భాగంగా తెరిచిన సాధార‌ణ మ‌రియు చిన్న పొదుపు ఖాతాల‌కు మిన‌హాయింపునిచ్చారు. బేసిక్‌(బీఎస్‌డీఏ),స్మాల్ అకౌంట్స్‌కు ఎటువంటి రుసుములు ఉండ‌వు.

English summary

ప్రైవేటు త‌ర్వాత ఎస్‌బీఐ సైతం : చార్జీల బాదుడు | see the new service charges of sbi from april 1st 2017

After a gap of five years, State Bank of India has decided to reintroduce penalty on non-maintenance of minimum balance in accounts from April 1, and revised charges on other services, including ATMs. The country's largest bank will permit savings bank account holders to deposit cash three times a month free of charges and levy Rs 50 plus service tax on every transaction beyond that.
Story first published: Monday, March 6, 2017, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X