For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చి 31 నాటికి బ్యాంకు ఖాతాదారులంద‌రికీ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ : కేంద్రం

నోట్ల ర‌ద్దు త‌ర్వాత భీమ్ యాప్‌, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంతో పాటు ఇప్పుడు మ‌రో ముందడుగు వేయ‌బోతోంది. ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్‌ బ్యాంకింగ్‌ (ఎం-బ్యాంకింగ్‌ను వినియ

|

ఆన్‌లైన్ లావాదేవీల‌ను పెంచే యోచ‌న‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం దూసుకెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దు త‌ర్వాత భీమ్ యాప్‌, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంతో పాటు ఇప్పుడు మ‌రో ముందడుగు వేయ‌బోతోంది. ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్‌ బ్యాంకింగ్‌ (ఎం-బ్యాంకింగ్‌) సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్యాంకులన్నింటినీ కేంద్రం ఆదేశించింది. మొబైల్‌ ఫోన్‌ గల ప్రతీ ఖాతాదారు ఎం-బ్యాంకింగ్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు.

 మార్చి 31 నాటికి బ్యాంకు ఖాతాదారులంద‌రికీ నెట్ బ్యాంకింగ్‌

గతంలో మొబైల్‌ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో అత్యధిక శాతం ఖాతాదారులు దీనిపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం చాలా మంది ఎం-బ్యాంకింగ్‌ కోరుకుంటున్న నేపథ్యంలో మార్చి 31లోగా అన్ని బ్యాంకులు తమ వినియోగ‌దారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని పేర్కొన్నట్లు ఆమె వివరించారు. యూపీఐ లేదా భీమ్‌ యాప్‌ ఉపయోగిస్తున్న ఖాతాదారులకు ఆటోమేటిక్‌గా మొబైల్‌ బ్యాంకింగ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా ఏ అవ‌కాశాన్ని కేంద్రం వ‌దులుకోవ‌డం లేదు. బ్యాంకులు ఏ మేర‌కు స్పందిస్తాయో చూడాలి.

English summary

మార్చి 31 నాటికి బ్యాంకు ఖాతాదారులంద‌రికీ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ : కేంద్రం | Get all accounts on net banking by March 31 centre ordered all Banks

The government has instructed banks to enable internet banking across all accounts by March 31 and mandatorily link them to the Aadhaar number to facilitate digital payments and online transactions. The measure has been approved at the "highest levels" in the government, and is aimed at facilitating digital payments across the banking system.
Story first published: Friday, March 3, 2017, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X