For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2016 వేగ‌వంత‌మైన మొబైల్ నెట్‌వ‌ర్క్ ఎయిర్‌టెల్‌...

దేశీయ మొబైల్ దిగ్గ‌జం ఎయిర్‌టెల్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింది.అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లో దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. లీడింగ్ బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెట్వర్క్‌ విశ్లేషణ అప

|

దేశీయ మొబైల్ దిగ్గ‌జం ఎయిర్‌టెల్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింది.
అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లో దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. లీడింగ్ బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెట్వర్క్‌ విశ్లేషణ అప్లికేషన్‌ ఓక్లా 2016 సంవత్సరానికి గానూ వెల్ల‌డించిన నివేదిక‌లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్‌ నిలిచిందని పేర్కొంది. అయితే సంవ‌త్స‌ర కాలంగా ఎంతో పోటీని ఎదుర్కొంటున్నా తన నెట్‌వర్క్‌ సామర్థ్యంపైనే ఎయిర్‌టెల్ న‌మ్మ‌కం పెట్టుకుంది. వేగ‌వంత‌మైన ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ గురించి మ‌రిన్ని వార్తా విశేషాలు మీ కోసం...

ప్రాజెక్ట్ లీప్‌

ప్రాజెక్ట్ లీప్‌

ఎయిర్‌టెల్ "ప్రాజెక్ట్ లీప్" ద్వారా త‌న నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని త‌నే విశ్లేషించుకుంటోంది. దీని ద్వారా యూజ‌ర్లు ఆ నెట్వ‌ర్క్ ఎక్క‌డెక్క‌డ ఏ మేర‌కు ప‌నిచేస్తుందో తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం భార‌తీ ఎయిర్‌టెల్ యాజ‌మాన్యం ఇప్ప‌టికే పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింది.

మెరుగైన సేవ‌లే ల‌క్ష్యం

మెరుగైన సేవ‌లే ల‌క్ష్యం

వినియోగదారులకు నిరంతరం సాధ్యమైనంత మేర మంచి సేవలు అందించడానికి ఎయిర్‌టెల్ కృషి చేస్తూనే ఉంటుంద‌ని, ప్రపంచస్థాయి సంస్థ ఓక్లా నుంచి ఎయిర్‌టెల్‌కు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌, దక్షిణాసియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు.

ట్రాయ్ నుంచి సైతం గుర్తింపు

ట్రాయ్ నుంచి సైతం గుర్తింపు

ఇదివ‌ర‌కే టెలికాం నియంత్ర‌ణ సంస్థ ట్రాయ్ సైతం ఎయిర్టెల్‌ను దేశంలోనే వేగ‌వంత‌మైన 4జీ నెట్‌వ‌ర్క్‌గా నిర్దారించింది. ఏదేమైతేనేం

దేశంలో అత్యధిక వినియోగదారులను కలిగిన టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో ఘనత అందుకుంది.

 స్పీడ్ టెస్ట్‌ల ద్వారా నివేదిక‌

స్పీడ్ టెస్ట్‌ల ద్వారా నివేదిక‌

2016లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌‌గా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచిందని బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెటవర్క్‌ విశ్లేషణ అప్లికేషన్‌ ఓక్లా తాజాగా వెల్లడించింది.ఓక్లాకు చెందిన స్పీడ్‌టెస్ట్‌ యాప్‌ ద్వారా దేశంలోని మొబైల్‌ వినియోగదారులపై ఆధునిక పరికరాలతో మిలియన్ల సంఖ్యలో స్పీడ్‌ టెస్టులు నిర్వహించి ఈ నివేదిక తయారు చేశారు.

ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌

ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌

ప్ర‌స్తుతం దేశంలో 100 కోట్ల‌కు పైగా మొబైల్ వినియోగ‌దారులు ఉండ‌గా ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ వాడే వారి సంఖ్య 26.5 కోట్లుగా ఉంది. అందులో యాక్టివ్‌గా ఉండే స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య 96.83 శాతంగా ఉంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ప్ర‌వేశించిన జియో వినియోగ‌దారుల సంఖ్య 10 కోట్ల‌కు పైగానే ఉంది.

 టెలికాం వాటా ఏ నెట్వ‌ర్క్‌కు ఎంత‌?

టెలికాం వాటా ఏ నెట్వ‌ర్క్‌కు ఎంత‌?

భార‌తీ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా నెట్వ‌ర్క్‌లు క‌లిపి మార్కెట్లో 74 శాతం వాటా క‌లిగి ఉన్నాయి. 2016 డిసెంబ‌రు నాటికి ఎయిరర్‌టెల్ వాటా 33.1% ఉండ‌గా; వోడాఫోన్ ఇండియా(23.5%), ఐడియా సెల్యూలార్‌(18.7%) క‌లిగి ఉన్నాయి. మిగిలిన నెట్వ‌ర్క్‌లన్నీ క‌లిపినా మొత్తం దేశీయ టెలికాం మార్క‌ట్లో 26% రెవెన్యూను రాబ‌ట్టుకున్నాయి.

Read more about: telecom airtel
English summary

2016 వేగ‌వంత‌మైన మొబైల్ నెట్‌వ‌ర్క్ ఎయిర్‌టెల్‌... | Airtel rated as India's 'Fastest Mobile Network for 2016'

India's largest telecommunications services provider Bharti Airtel has been rated the 'Fastest Mobile Network for 2016', leading broadband testing and network diagnostic application Ookla said on Thursday.The findings were based on analysis of millions of internet speed tests logged on ‘modern devices' by mobile customers across the country using Ookla's popular Speedtest app
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X