For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ష్టాలతో ముగిసిన సెన్సెక్స్

ప్రపంచ మార్కెట్ల కార‌ణంగా ఉత్సాహంతో క‌దిలిన మార్కెట్లు ముగింపు స‌మ‌యానికి డీలా ప‌డ్డాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి న‌ష్టాల దిశ‌గా అడుగులు వేశాయి. ట

|

స్థిరాస్తి, ఫార్మా రంగాల్లో లాభాల స్వీక‌ర‌ణ‌

ప్రపంచ మార్కెట్ల కార‌ణంగా ఉత్సాహంతో క‌దిలిన మార్కెట్లు ముగింపు స‌మ‌యానికి డీలా ప‌డ్డాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి న‌ష్టాల దిశ‌గా అడుగులు వేశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 145 పాయింట్లు క్షీణించి 28,840 వద్ద నిలిచింది. తద్వారా 29,000 పాయింట్ల కీలకస్థాయి దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు తక్కువగా 8,900 వద్ద స్థిరపడింది. మూడో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి సాధించిన జీడీపీ కారణంగా బుధవారం మార్కెట్లు భారీగా లాభపడ్డ సంగతి తెలిసిందే. అటు యూరప్‌, అమెరికా మార్కెట్లు సైతం 1.5-2 శాతం లాభ‌ప‌డ‌టంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ల‌పైనా కనిపించింది. దీంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రోత్సాహకరంగా మొదలయ్యాయి. ఈ ప్ర‌భావంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 29,145 పాయింట్ల‌ను తాకగా.. నిఫ్టీ 8,992కు ఎగసింది. తద్వారా మరోసారి 9,000 మైలురాయికి చేరువైంది. మిడ్‌ సెషన్‌ నుంచీ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగ‌డం, యూరోపియ‌న్‌ మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లడం వంటి అంశాల కార‌ణంగా ఒక్కసారిగా సెంటిమెంటును బలహీనపరిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

స్థిరాస్తి, ఫార్మా రంగాల్లో లాభాల స్వీక‌ర‌ణ‌

స్థిరాస్తి, ఫార్మా రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగిన‌ట్లుగా
మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ స‌మావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్ర‌సంగంతో పెట్టుబ‌డిదారుల‌కు జోష్ వ‌చ్చినా చివ‌రి వ‌ర‌కూ మార్కెట్ల‌లో అదే ఉత్సాహం కొన‌సాగ‌లేదు. టాటా మోటార్స్‌తో పాటు ప‌లు వాహ‌న రంగ దిగ్గ‌జాలు నెల‌వారీ అమ్మ‌కాల్లో మంచి పురోగ‌తి క‌న‌బ‌ర‌చ‌డంతో వాహ‌న రంగ షేర్లు బాగా లాభాల‌ను స్వీక‌రించాయి.

Read more about: sensex stock markets share market
English summary

న‌ష్టాలతో ముగిసిన సెన్సెక్స్ | Profit booking in realty pharma stocks pulls Sensex down 145 points

The Sensex and Nifty retreated from near two-year highs to end lower as investors booked profit in pharmaceutical and realty stocks such as Sun Pharmaceutical Industries and DLF Ltd.The broader NSE index closed down 46.05 points or 0.51 per cent at 8,899.75 after rising as much as 0.52 per cent earlier in the session to 8,992.50, its highest since March 2015 and on the verge of surpassing a key psychological level of 9,000.
Story first published: Thursday, March 2, 2017, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X