For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ స‌ర‌కు ర‌వాణా కోసం డ్రై పోర్టు

తెలంగాణ‌కు ఓడ‌రేవు లేకున్నా ఆ దిశ‌గా డ్రైపోర్టు ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ముంపు గ్రామాల్లో మిగిలిన గ్రామాలు కావాలి. అవి వచ్చే వీలు లేదు. మరి రెండు రాష్ట్రాలు ఈ రెండు అం శా

|

తెలంగాణ‌కు ఓడ‌రేవు లేకున్నా ఆ దిశ‌గా డ్రైపోర్టు ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ముంపు గ్రామాల్లో మిగిలిన గ్రామాలు కావాలి. అవి వచ్చే వీలు లేదు. మరి రెండు రాష్ట్రాలు ఈ రెండు అం శాలపై ఒక అవగాహనకు వస్తున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఈ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.తెలంగాణ కు ఓడ రేవు లేదు కాబట్టి సరకు రవాణాకు ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నం ఓడరేవును డ్రైపో ర్టుగా వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనుమతి కావాలి. ఖమ్మం జిల్లాలోని మిగిలిన ముంపు గ్రామాలు ఆంధ్ర్ర పదేశ్‌కు వచ్చేస్తే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. ఈ రెండు నిర్ణయాలపై రెండు రాష్ట్రాలు త్వరలో తమ తమ అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుని ఒక అవగాహనకు రానున్నాయని విశ్వసనీయం గా తెలిసింది. పాలనా సౌలభ్యం కోసం ఒక రాష్ట్రం ఆలోచిస్తుంటే, అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని మరో రాష్ట్రం ముందడుగు వేస్తోంది. వెరసి, తెలంగాణాలోన ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాం తంలోని మరిన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందాం.

మ‌చిలీప‌ట్నం తెలంగాణ‌కు కీల‌కం కానుందా?

మ‌చిలీప‌ట్నం తెలంగాణ‌కు కీల‌కం కానుందా?

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుండి రావాల్సిన నిత్యావసరాలు, బొగ్గు లాంటివి ఆంధ్రప్రదేశ్‌ మీదుగానే రావాలి. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతానికి కాకినాడ ఓడరేవును వాడుకుంటున్నది. అయితే, కాకినాడ పోర్టు భౌగోళికంగా తెలంగాణా ప్రాంతానికి చాలా దూరం. దీని వల్ల తెలంగాణా ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చులు చాలా అవుతుండటంతో పాటు కాలయాపన కూడా బాగా జరుగుతు న్నది. మరి, రవాణా సమయం, ఖర్చులు తగ్గించుకోవాలంటే మార్గమేమిటి? మార్గాలు యోచించిన తెలంగాణా ప్రభుత్వానికి పొరుగునే ఉన్న కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు) పోర్టు కనబడింది. ఈ పోర్టును గనుక ఉపయోగించుకుంటే, రవాణా వ్యయం తగ్గటమే కాకుండా, సమయం కూడా కలసివస్తుంది.

 పోల‌వ‌రం ముంపు గ్రామాల కోసం

పోల‌వ‌రం ముంపు గ్రామాల కోసం

ఇక, ఆంధ్రప్రదేశ్‌ పరిస్దితి చూస్తే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దృష్ట్యా ఇప్పటికే భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని ఏడు మండలల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రలో కలిసాయి. అయినా, పాలనా సౌలభ్యం కోసమని మరిన్ని గ్రామాలను కలుపుకుంటేనే మంచిదని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం యోచిస్తున్నది. మరి, ఇందుకు మార్గమేమిటి. భద్రాచలం ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినపుడు పై ప్రాంతంలోని వందలాది గ్రామాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటే తెలంగాణా ప్రభుత్వం కన్నా ఎపి ప్రభుత్వంకే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఏడు మండలా ల్లోని వందలాది గ్రామాలను కలుపుకున్నా, మరిన్ని గ్రామాలను కూడా కలుపుకుంటే ఇటు పాలనా సౌలభ్యంతో పాటు అటు ప్రకృతి విపత్తులు సంభవించినపుడు సహాయ చర్యలు తీసుకో వటం కూడా ఏపీ ప్రభుత్వానికి చాలా సులువు. ఒకరకంగా చూస్తే పై సందర్భాల్లో సహాయ చర్యలు చేపట్టాలంటే తెలంగాణా ప్రభుత్వానికి సమస్యే. అందుకనే, తమ భూభాగంలోని మరిన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు వదులుకుని, ప్రతిగా మచిలీపట్నం పోర్టును వాడుకోవటం వల్ల తెలంగాణా రాష్ట్రానికి కలిగే నష్టం కన్నా భవిష్యత్తులో వాటిల్లే లాభమే ఎక్కువని దీర్ఘకాల దృష్టితో తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

నాలుగు లైన్ల ర‌హ‌దారులు వేస్తారా?

నాలుగు లైన్ల ర‌హ‌దారులు వేస్తారా?

మచిలీపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడి నుండి వ్యాపార కార్యకలాపాలు కూడా మొదలవనున్నాయి. ఇదే విషయాన్ని ఆలోచించిన తెలంగాణా ప్రభుత్వం త్వరలో పూర్తవనున్న బందరు పోర్టులో ఆరు బెర్త్‌లను వాడుకోవటానికి ఎపి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు వీలుగా, మచిలీపట్నం కేంద్రంగా తెలంగాణాలోని రాజధాని హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాలకు నాలుగు లైన్ల రహదారులను కూడా నిర్మించాలని అనుకుంటున్నది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నది. అంతేకాకుండా తెలంగాణా రాష్ర్టంలోని రెండు నగరాల్లో డ్రై పోర్టుల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది.

 డ్రైపోర్టు అంటే?

డ్రైపోర్టు అంటే?

పోర్టు ఎక్కడున్నా, విదేశాలతో ఒప్పందాలు చేసుకుని సరుకు రవాణాకు అవసరమైన ప్యాకింగ్‌ చేసి ఓడరేవుకు చేర్చి ఎగుమతి చేయటాన్ని డ్రై పోర్టు అంటారు. అంటే తెలంగాణా రాష్ట్రం విదేశాలకు సరుకును ఎగుమతి చేయాలంటే, తెలంగాణాలో ఓడరేవు ఉండాల్సిన అవసరమే లేదు. సమీపంలో ఎక్కడ ఓడరేవున్నా తెలంగాణా భూభాగం మీదనే సరుకులు ప్యాకింగ్‌ చేసి సదరు ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఈ విషయంపైనే తెలంగాణా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిసింది.ఒక వైపు తెలంగాణా అవసరం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌కు పాలనా సౌలభ్యం. పైగా, ప్రస్తుతం భద్రాచలం డివిజన్‌లోని దాదాపు అన్నీ గ్రామాలూ మావోయిస్టులకు ప్రధాన స్ధావరాలే. ఎపిలోకి మావోయిస్టులు ప్రవేశించాలంటే, తెలంగాణా భూభాగమే అనువైన మార్గం.

ఉభ‌య‌తార‌క‌మే...

ఉభ‌య‌తార‌క‌మే...

ప్రస్తుతం భద్రాచలం డివిజన్‌కు ఒక వైపు ఛత్తీస్‌ఘర్‌, మరోవైపు ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టుల ప్రాబల్యం చెప్పక్కర్లేదు. ఎప్పటికైనా, తెలంగాణా రాష్ట్రానికి మావోయిస్టుల నుండి ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం. ఈ విషయాలన్నింటినీ ఆలోచించిన తెలంగాణా ప్రభుత్వం పై డివిజన్‌లో ఇప్పటికే ఎపికి బదలాయించిన గ్రామాలతో కలిపి మరిన్ని గ్రామాలను కూడా ఇచ్చేస్తే, తలెత్తబోయే శాంతిభద్రతల సమస్యతో పాటు, వరద సమస్యను కూడా ఎపి ప్రభుత్వానికే వదిలేయటం మంచిదని యోచించినట్లు సమాచారం. అందుకనే, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు తెలిసింది. అయితే, రెండు రాష్ట్రాలూ ఈ విషయమై నిర్ణయమైతే తీసుకోలేదని కూడా విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Read more about: telangana ap
English summary

తెలంగాణ స‌ర‌కు ర‌వాణా కోసం డ్రై పోర్టు | Centre mulls dedicated cargo airport for Telangana

Telangana wants a dedicated cargo airport to be built in northern Hyderabad, while Uttar Pradesh is seeking the green signal to construct one such airport in the western part of the state, official sources said.The Centre has informed these two states that the Airports Authority of India (AAI) had appointed a consultant to study and suggest name(s) of airport(s) or site(s) in the country that can be ‘developed’ or ‘converted’ as ‘dedicated cargo airport(s)’ – which may also be termed as ‘merchant airport(s).’
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X