For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐలోకి అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1న

దేశంలో అతిపెద్ద‌ ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు మరింత పెద్ద‌ది కాబోతోంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్1, 2017 నుంచి ప్రారంభం కాబోతోంది. దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఇదో

|

దేశంలో అతిపెద్ద‌ ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు మరింత పెద్ద‌ది కాబోతోంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్1, 2017 నుంచి ప్రారంభం కాబోతోంది. దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఇదో అతిపెద్ద విలీన‌ ప్రకియగా పేరొందబోతోంది.
త‌దుప‌రి ప్రక్రియకు ఏప్రిల్ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడంతో వేగంగా ఇక నుంచి త‌తంగం మరింత పుంజుకోనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎస్బీఐలో క‌లిసిపోతున్న సంగ‌తి తెలిసిందే.


అయితే భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇది కూడా చ‌ద‌వండి 5 బ్యాంకుల విలీనం... 37 ల‌క్ష‌ల కోట్లకు ఎస్‌బీఐ
అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా నిలవబోతోంది. రూ.37 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్, 22500 శాఖలు, 58 వేల ఏటిఎంలు, 50 కోట్ల మంది కస్టమర్లతో ఇక నుంచి ఎస్బీఐ దేశంలోనే దిగ్గ‌జ బ్యాంకుగా అవ‌త‌రించ‌బోతోంది.
ఈ విలీనం తర్వాత ఐదు బ్యాంకుల ఉద్యోగులు, ఆఫీసర్లంతా ఎస్బీఐ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీలకు మాత్రం మినహాయింపు ఉండబోతోంది. డేటా ఇంటిగ్రేషన్, ఐటి స్ట్రీమ్‌లైనింగ్, ట్రెజరీ ఆపరేషన్స్, ఉద్యోగుల పే స్కేల్ వంటి కీలకమైన ప్రక్రియలన్నీ ఒక్కటొక్కటిగా క్లియర్ చేయబోతున్నారు. ఈ ఇంటిగ్రేషన్ ప్రకియ ఈ ఏడాది మొదటి అర్ధభాగం లోపు పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు.

Read more about: sbi banking ఎస్‌బీఐ
English summary

ఎస్‌బీఐలోకి అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1న | SBI merger with five associate banks from 1 April

The government on Thursday said that 1 April will be the record date for the merger of State Bank of India (SBI) with five of its associate banks.The associate banks are State Bank of Bikaner and Jaipur (SBBJ), State Bank of Mysore (SBM), State Bank of Travancore (SBT), State Bank of Hyderabad (SBH) and State Bank of Patiala (SBP).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X