For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడో విడ‌త బంగారు బాండ్లు ఈ నెల 27 నుంచి

సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27 వ తేదీ సోమ‌వారం వీటి ఇష్యూ ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్

|

సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27 వ తేదీ సోమ‌వారం వీటి ఇష్యూ ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్లను కేటాయిస్తారు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ బాండ్ల‌ను హామీగా ఉంచి రుణాల‌ను సైతం తీసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఈ ద‌శ బంగారు బాండ్ల గురించి స‌మ‌గ్ర వివ‌రాలు తెలుసుకుందాం.

రూ. 20 వేల‌కు మించి న‌గ‌దు కుద‌ర‌దు

రూ. 20 వేల‌కు మించి న‌గ‌దు కుద‌ర‌దు

రూ.20వేల వరకు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంది. అంతకుమించితే డీడీ లేదా చెక్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత జారీ. ‘‘ఆర్‌బీఐతో ప్రభుత్వం సంప్రదించిన అనంతరం సౌర్వభౌమ బంగారు బాండ్లు 2016-17 ఏడో సిరీస్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది'' అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది.

 ఆరు నెల‌ల‌కోసారి 2.50% వ‌డ్డీ

ఆరు నెల‌ల‌కోసారి 2.50% వ‌డ్డీ

బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రత్యామ్నాయ సాధనంగా సౌర్వభౌమ బంగారు బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు బాండ్లను జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటిపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. బాండ్ల కాల వ్యవధి 8 ఏళ్లు కాగా, ఐదో ఏట నుంచి వైదొలగేందుకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్టాక్ ఎక్స్చేంజీలలో ట్రేడ్‌ అవుతాయి.

ల‌క్ష్యాన్ని అందుకోలేక‌

ల‌క్ష్యాన్ని అందుకోలేక‌

బంగారు బాండ్ల ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా వాటిని ఇష్యూ చేస్తున్న‌ప్ప‌టికీ వీటికి ఊహించినంత స్పంద‌న రావ‌డం లేదు. 2015-16 బ‌డ్జెట్లో బంగారు ప‌థ‌కాల ద్వారా కేంద్రానికి రూ. 1318 కోట్ల ఆదాయం వ‌చ్చింది. 2016-17 బ‌డ్జెట్లో భాగంగా వీటి నుంచి రూ. 10 వేల కోట్ల‌ను రావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటే, కేవ‌లం రూ. 3809 కోట్ల రూపాయ‌ల మేర స్పందన వ‌చ్చింది. 2017-18 బ‌డ్జెట్లో రూ. 5వేల కోట్ల‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు.

 500 గ్రాముల ప‌రిమితి మొద‌టి ద‌ర‌ఖాస్తుదారుకు మాత్ర‌మే

500 గ్రాముల ప‌రిమితి మొద‌టి ద‌ర‌ఖాస్తుదారుకు మాత్ర‌మే

ఉమ్మ‌డిగా పెట్టుబ‌డి పెట్ట‌ద‌ల‌చుకుంటే 500 గ్రాముల ప‌రిమితి మొద‌టి ద‌ర‌ఖాస్తుదారుకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల‌లో పెట్టుబ‌డి వెన‌క్కు తీసుకునే పెట్టుబ‌డిదారుల‌కు మూల‌ధ‌న ప‌న్ను నుంచి మిన‌హాయింపునిచ్చారు. 999 స్వ‌చ్చ‌త గ‌ల బంగారం ధ‌ర‌ల‌ను ఇండియా బులియ‌న్ అండ్ జువెల‌ర్స్ అసోషియేష‌న్ నిర్ణ‌యిస్తుంది. వారు నిర్ణ‌యించే ధ‌ర‌ల‌ను ఆధారంగా చేసుకుని ముగింపు ధ‌ర స‌గ‌టును బ‌ట్టి బాండ్ల ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం రూపాయ‌ల్లో నిర్ణ‌యిస్తుంది.

English summary

ఏడో విడ‌త బంగారు బాండ్లు ఈ నెల 27 నుంచి | govt to launch 7th tranche of sovereign gold bonds from feb 27

In case of joint holding, the investment limit of 500 grams will be applied to the first applicant only. Investors have been exempted from any tax on capital gains from the redemption of such gold bonds. The indexation benefits will be provided to long-term capital gains arising to any person on transfer of bond. Bonds will be tradeable on stock exchanges from a date to be notified by the RBI.
Story first published: Friday, February 24, 2017, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X