For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

29,000 దాటిన సెన్సెక్స్‌

సానుకూల యారోపియ‌న్ మార్కెట్ల సంకేతాల‌తో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి. అయితే తొలుత జోరందుకుని ఏడాది గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో వెనకడుగు వేశాయి. ఫిబ్రవరి డెరివేటివ్స్

|

సానుకూల యారోపియ‌న్ మార్కెట్ల సంకేతాల‌తో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి. అయితే తొలుత జోరందుకుని ఏడాది గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో వెనకడుగు వేశాయి. ఫిబ్రవరి డెరివేటివ్స్‌ నేటితో ముగిసిన నేపథ్యంలో చివరి అర గంటలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగ‌డంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 28 పాయింట్లు పెరిగి 28,893 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,939 వద్ద స్థిరపడింది.

 సెప్టెంబ‌రు త‌ర్వాత గ‌రిష్ట స్థాయికి నిఫ్టీ

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే విద్యుత్ రంగం(0.68%), మౌలిక రంగం(0.31%), చ‌మురు,స‌హ‌జ‌వాయు రంగం(0.26%), పీఎస్‌యూ(0.24%) న‌ష్ట‌పోగా; ఐటీ(1.7%), టెక్నాల‌జీ(1.65%), స్థిరాస్తి రంగం(1.65%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.47%) లాభ‌ప‌డ్డాయి.
సెప్టెంబ‌రు త‌ర్వాత గ‌రిష్ట స్థాయికి నిఫ్టీ
మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు జోరందుకోవడంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 8969ను అధిగమించింది. 8982 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో 2016 సెప్టెంబర్‌,8 త‌ర్వాత అత్య‌ధిక స్థాయి ముగింపును తాకింది. ఇక సెన్సెక్స్‌ సైతం లాభాల డబుల్‌ సెంచరీ సాధించి 29,000 పాయింట్ల మార్కును దాటింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.7 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 0.8 శాతం, మెటల్‌ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. మరోపక్క పీఎస్‌యూ బ్యాంక్‌ 0.4 శాతం నీరసించింది.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం(24న) స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ మళ్లీ సోమవారం(27న) పున‌: ప‌్రారంభ‌మ‌వుతుంది.

English summary

29,000 దాటిన సెన్సెక్స్‌ | Sensex ends flat after hitting today high of 29065

Sensex ended marginally higher after earlier hitting the day's high of 29,065.31 due to fresh selling in power, infrastructure, oil & gas and PSU stocks amid firm European cues.The broader NSE index ended higher, having earlier hit a near two-year high, with IT stocks leading the gains on the day of derivatives expiry.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X