For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో టారిఫ్‌ల‌ ప్ర‌క‌ట‌న‌... 10% ఎగ‌సిన షేర్లు

జియోతో టెలికాం రంగాన్ని కుదేలు చేసిన రిలయన్స్.. ఇప్పుడు టారిఫ్ ప్లాన్స్ ప్రకటించి షేర్ మార్కెట్లోను దూసుకెళ్తోంది. నిన్నటిదాకా ఉచిత సర్వీసులతో ఇతర టెలికాం కస్టమర్స్ ను సైతం తనవైపుకు తిప్పుకున్న రిలయన్

|

జియోతో టెలికాం రంగాన్ని కుదేలు చేసిన రిలయన్స్.. ఇప్పుడు టారిఫ్ ప్లాన్స్ ప్రకటించి షేర్ మార్కెట్లోను దూసుకెళ్తోంది. నిన్నటిదాకా ఉచిత సర్వీసులతో ఇతర టెలికాం కస్టమర్స్ ను సైతం తనవైపుకు తిప్పుకున్న రిలయన్స్.. తాజా డేటా ప్లాన్ ప్రకటనతో ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అద‌ర‌కొట్టే ఆఫ‌ర్ల‌తో జియో దూసుకెళుతున్న తీరుతో మిగ‌తా టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో జియో నిర్ణ‌యాలు మిగ‌తా కంపెనీల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో, టెలికాం రంగంలో ఏం జ‌రుగుతోందో తెలుసుకుందాం.

8 ఏళ్ల గ‌రిష్టానికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు

8 ఏళ్ల గ‌రిష్టానికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు

ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ బుధవారం నాడు 8ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం విశేషం. దీన్నిబట్టి ఇన్వెస్టర్లకు ఆస‌క్తినిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ తాజా డేటా ప్లాన్ ప్రకటనతో 7శాతం జంప్ చేసిన సంస్థ షేర్స్ బీఎస్ఈలో రూ.1192(10%)గా ట్రేడ్ అవుతున్నాయి. మిగిలిన టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా షేర్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి.

 ఏప్రిల్ 1 త‌ర్వాత రుసుములే...

ఏప్రిల్ 1 త‌ర్వాత రుసుములే...

2017 ఏప్రిల్ 1 నుంచి జియో 4జీబీ సర్వీసులపై ఛార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులకు ఊపునిచ్చింది. వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన‌ టెలికాం వెంచర్ నుంచి నగదు ప్రవాహం కోసం పెట్టుబ‌డిదార్లు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఛార్జీల మోతతో జియో తన చందాదార్ల సంఖ్య‌ను ఎలా త‌గ్గ‌కుండా చూసుకుంటుందో గ‌మ‌నించ‌వ‌ల‌సి ఉందని క్రెడిట్ స్యూజ్ చెప్పింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ‌ ఉచిత తాయిలాల‌తో ఇన్నిరోజులు మొబైల్ సిమ్ వాడేవాళ్ల‌ను విపరీతంగా ఆకట్టుకోవ‌డంతో టెలికాం దిగ్గజాల ఆదాయంపై ప్ర‌భావం ప‌డిన సంగతి తెలిసిందే.

రిల‌య‌న్స్ జియో ఉచిత సేవ‌లు

రిల‌య‌న్స్ జియో ఉచిత సేవ‌లు

సెప్టెంబ‌ర్ 2016 నుంచి రిల‌య‌న్స్ జియో ఉచితంగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు కాల్‌, డేటా సేవ‌లు అందిస్తున్న‌ది. మొద‌ట వెల్‌క‌మ్ ఆఫ‌ర్ పేరిట ఉచిత సేవ‌ల‌ను ఆరంభించిన జియో త‌ర్వాత దాన్ని పొడిగించిన సంగ‌తి తెలిసిందే. వెల్‌క‌మ్ ఆఫ‌ర్ ముగిసిన త‌ర్వాత మార్చి 31 వ‌ర‌కూ అమ‌ల్లో ఉండేలా హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. దేశంలో అగ్ర‌గామి టెలికాం కంపెనీల‌ను తోసిరాజ‌ని నెమ్మ‌దిగా క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జియో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే జియోని వాడుతున్న వారందరినీ చేజార‌కుండా చూసుకోవ‌డంతో పాటు కొత్త వాళ్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

 జియో ప్రైమ్ పేరుతో రుసుములు

జియో ప్రైమ్ పేరుతో రుసుములు

జియో వినియోగ‌దారులు మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్ ప్లాన్‌లోకి మారాల్సి ఉంటుంది. జియో ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకున్న వారికి ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు జియో వాయిస్ కాల్స్ ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు వర్తించవు.అంతే కాకుండా బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వు. అంటే ఉచిత ఆఫ‌ర్లు 365 రోజులు వ‌ర్తిస్తాయి. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

డేటా సేవ‌ల‌ను పొందాలంటే

డేటా సేవ‌ల‌ను పొందాలంటే

డేటా సేవ‌ల‌ను కొన‌సాగించాల‌నుకునే వారు నెల‌కు రూ. 303 ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. జియో న్యూఇయ‌ర్ ఆఫ‌ర్ సంద‌ర్భంగా అందించిన ప్ర‌యోజ‌నాలు అలాగే పొందాలంటే ప్రైమ్ వినియోగ‌దార్లు మార్చి 31,2018 వ‌ర‌కూ నిరాటంక సేవ‌ల కోసం నెల‌కు రూ. 303 చెల్లించాలి. త‌ద్వారా రోజుకు 1జీబీ చొప్పున‌ ప్ర‌తి నెలా 30 జీబీ వ‌ర‌కూ డేటాను ఉచితంగా వాడుకునే వెసులుబాటు కొన‌సాగుతుంది. దీనితో పాటు జియో యాప్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఎయిర్‌టెల్, జియో మ‌ధ్య సమ‌స్య ఏంటి?

 200 కోట్ల నిమిషాల కాల్స్‌

200 కోట్ల నిమిషాల కాల్స్‌

ముకేష్ మాట్లాడుతూ జియో సేవలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ దూసుకుపోతోందని అంబానీ చెప్పారు. డేటా వినియోగంలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. ప్ర‌తి రోజూ మ‌న దేశంలో కేవ‌లం జియో యూజ‌ర్లు 200 కోట్ల నిమిషాల వాయిస్‌, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారని వెల్ల‌డించారు.

జియోతో డిజిట‌ల్ ప్ర‌పంచ‌మే మారిందా!

జియోతో డిజిట‌ల్ ప్ర‌పంచ‌మే మారిందా!

జియో రాక‌కు ముందు ప్ర‌పంచ బ్రాడ్‌బ్యాండ్ విస్త‌ర‌ణ‌లో భార‌త్ 150 స్థానంలో ఉంది. గ‌త నెల జియో వినియోగ‌దార్లంతా క‌లిసి 100 కోట్ల జీబీ డేటాను వినియోగించారు. ఇది దేశ టెలికాం రంగంలో జ‌రుగుతున్న వేగ‌వంత‌మైన మార్పును సూచిస్తుంది. ప్ర‌తి సెక‌నుకు జియో నెట్‌వ‌ర్క్‌లో చేరే వారి సంఖ్య 7గా ఉంది. 170 రోజుల్లో ఈ విధ‌మైన వేగ‌వంత‌మైన అభివృద్ది జ‌రిగింద‌ని అంబానీ వివ‌రించారు. ప్ర‌తి రోజూ జియో త‌న నెట్‌వ‌ర్క్‌లో 5.5 కోట్ల వీడియో గంట‌ల‌ను అందిస్తోందని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు.

 10 కోట్ల క‌స్ట‌మ‌ర్ల దిశ‌గా

10 కోట్ల క‌స్ట‌మ‌ర్ల దిశ‌గా

జియో మార్కెట్లో ప్ర‌వేశించిన 170 రోజుల్లోనే 10 కోట్ల క‌స్ట‌మ‌ర్ల మైలు రాయిని చేరుకోగ‌లిగింద‌ని ముకేష్ అంబానీ చెప్పారు. ఇందుకు తాను ప్ర‌తి జియో క‌స్ట‌మ‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌న్నారు. 2017 చివ‌రికి జియో నెట్‌వ‌ర్క్ అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌ను క‌లుపుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మొత్తానికి దేశంలో 99% జ‌నాభాకు చేరువ అవుతామ‌ని ముకేష్ భ‌రోసా టెలికాం రంగానికి నూత‌న జ‌వ‌సత్వాలిచ్చిదే.

English summary

జియో టారిఫ్‌ల‌ ప్ర‌క‌ట‌న‌... 10% ఎగ‌సిన షేర్లు | Reliance Jio to Offer 20% More Data than Competitors' Best Selling Plan

Reliance Jio to Offer 20% More Data than Competitors' Best Selling Plan Reliance Industries Chairperson and Managing Director Mukesh Ambani made some key announcements on Tuesday. He said that Jio has breached the 100 million customer mark in 170 days. Also, Jio users consumed over 100 crore GB of data since January.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X