For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వ్యాపారులకు సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్లను తగ్గించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

|

డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు విధించే రుసుములకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎండిఆర్( రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్టు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు వెనక్కు ఇచ్చేయనున్నట్టు తెలిపింది.
అంతే కాకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్లను తగ్గించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

చిన్న వ్యాపారులకు సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకాన్నిఅమలు చేసే దిశగా జనవరి 1, 2017 నుంచి డెబిట్ కార్డుల మీద టాక్స్ అండ్ నాన్ టాక్స్ బకాయిలను ఆయా బ్యాంకులకు చెల్లించనున్నట్టు కేంద్ర బ్యాంకు ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకులు ఎండీఆర్ బకాయిల కోసం త్రైమాసిక ప్రాతిపదికన చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ తోపాటు ఆర్బీఐ నాగ్పూర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది.

అలాగే రూ. ఒక లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారునుండి ఎలాంటి రుసుములు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బకాయిల చెల్లింపుల కోసం ఏప్రిల్30 లోగా ఆర్బీఐలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో కోరింది.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. సంవత్సర కాలానికి గాను రూ.లక్ష నుంచి 2లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే బాధ్యతలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్పగిస్తూ నిబంధలను సవరించారు.

Read more about: digital online
English summary

చిన్న వ్యాపారులకు సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ | MDR charges waived on debit card payments to Centre

The Reserve Bank of India (RBI) will start reimbursing Merchant Discount Rate (MDR) charges to banks for payments made through debit cards since January 1, the central bank announced on Thursday.In a bid to encourage digital transactions following the demonetisation of high value currency in November, the Union government had, in December, decided to reimburse banks MDR charges on taxes and receipts paid through debit and credit cards.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X