For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 1 నుంచి ఎన్‌పీఎస్ రుసుముల త‌గ్గింపు

వార్షిక నిర్వ‌హ‌ణ రుసుమును రూ. 190 నుంచి రూ. 95కు త‌గ్గిస్తున్న‌ట్లు ఎన్ఎస్‌డీఎల్ ప్ర‌క‌టించింది. ఖాతా తెరిచేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ రుసుమును రూ. 50 నుంచి రూ. 40కు, ప్ర‌తి లావాదేవీ రుసుమును రూ.

|

ఎన్‌పీఎస్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌. ఎన్‌పీఎస్‌(జాతీయ పింఛ‌ను ప‌థ‌కం-నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌) ఖాతా తెరిచేందుకు వ‌సూలు చేసే చార్జీ, నిర్వ‌హ‌ణ రుసుముల‌ను ఏప్రిల్ 1 నుంచి త‌గ్గించాల‌ని ఎన్ఎస్‌డీఎల్ నిర్ణ‌యించింది. ఖాతాదారులు నిర్వ‌హించుకునే ఎన్‌పీఎస్ ఖాతాల‌న్నింటినీ ఎన్ఎస్‌డీఎల్ అనే ప్ర‌భుత్వ సంస్థ నిర్వహిస్తుంది. ఎన్‌పీఎస్ ఖాతాల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం కొన్ని సంస్థ‌ల‌కు అనుమ‌తిచ్చింది. అందులో ఎన్ఎస్‌డీఎల్ ఒక‌టి.

 జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌) చార్జీల త‌గ్గింపు

ఇన్ని రోజులు ఎన్ఎస్‌డీఎల్ మాత్ర‌మే రికార్డుల నిర్వ‌హ‌ణ‌ను చూసే సంస్థ‌గా ఉండేది. ఈ రోజు నుంచి కార్వీ అనే ప్ర‌యివేటు ఆర్థిక సేవ‌ల నిర్వ‌హ‌ణ సంస్థకు సైతం రికార్డుల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

దీంతో ఈ రంగంలో పోటీ నెల‌కొన‌నుంది. ఈ నేప‌థ్యంలో ఎన్ఎస్‌డీఎల్ నిర్వ‌హ‌ణ చార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు స‌మాచారం.

* శాశ్వ‌త ప‌ద‌వీ విర‌మ‌ణ ఖాతా(పీఆర్‌ఏ) వార్షిక నిర్వ‌హ‌ణ రుసుమును రూ. 190 నుంచి రూ. 95కు త‌గ్గిస్తున్న‌ట్లు ఎన్ఎస్‌డీఎల్ ప్ర‌క‌టించింది.

* ఖాతా తెరిచేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ రుసుమును రూ. 50 నుంచి రూ. 40కు, ప్ర‌తి లావాదేవీ రుసుమును రూ. 4 నుంచి రూ. 3.75కు త‌గ్గిస్తున్న‌ట్లు పీఎఫ్ఆర్‌డీఏ వెల్ల‌డించింది.

* మ‌రో వైపు కార్వీ సంస్థ ఖాతా ప్రారంభ రుసుమును రూ. 39.36, వార్షిక నిర్వ‌హ‌ణ రుసుమును రూ. 57.63, ప్ర‌తి లావాదేవీ రుసుమును రూ. 3.36 గా నిర్ణ‌యించడం గ‌మ‌నార్హం.

Read more about: nps nsdl
English summary

ఏప్రిల్ 1 నుంచి ఎన్‌పీఎస్ రుసుముల త‌గ్గింపు | charges for subscribers of the National Pension System NPS from April 1

Under pressure from competition, NSDL e-Governance Infrastructure has decided to drastically cut maintenance and account opening charges for subscribers of the National Pension System (NPS) from April 1. w.e.f. April 1, 2017 which would be Rs 40 for PRA opening, Rs 95 for PRA Annual Maintenance and Rs 3.75 for each transaction.
Story first published: Wednesday, February 15, 2017, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X