For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలాలో ఆ పెట్టుబ‌డి ఈ వ్యాపారానికేనా టాటా?

ర‌త‌న్ టాటా గ‌త రెండేళ్ల కాలంలో స్టార్ట‌ప్‌ల‌పై విప‌రీత‌మైన మోజుతో వాటికి నిధుల సాయాన్ని అందించారు. తాజాగా ఓలా క్యాబ్స్‌పై అమిత‌మైన ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ పెట్టుబ‌డి పెట్టిన

|

కార్పొరేట్లు దేశంలో పెట్టుబ‌డి వాతావ‌ర‌ణాన్ని ప్రోత్స‌హించేందుకు యువ పారిశ్రామిక వేత్త‌లు పెట్టిన స్టార్ట‌ప్‌ల్లో పెట్టుబడులు పెట్ట‌డం ఈ మ‌ధ్య బాగా ఎక్కువైంది. అదే కోవ‌లో ర‌త‌న్ టాటా సైతం చేరారు. ఆయ‌న గ‌త రెండేళ్ల కాలంలో స్టార్ట‌ప్‌ల‌పై విప‌రీత‌మైన మోజుతో వాటికి నిధుల సాయాన్ని అందించారు. తాజాగా ఓలా క్యాబ్స్‌పై అమిత‌మైన ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ పెట్టుబ‌డి పెట్టిన రెండు నెలల్లోపే టాటా వ్యాపార విజ్ఞత‌ను క‌న‌బరిచారు. ఆన్‌లైన్ ట్యాక్సీ నిర్వ‌హ‌ణ సంస్థ‌కు టాటా మోటార్స్ వాహనాల‌ను అమ్మేందుకు ప్ర‌తిపాద‌న‌లు పంపారు.

ratan tata in ola cabs

జూన్ 2015 నుంచి టాటా ఓలా సంస్థ‌లో పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప‌నిచేస్తున్న అంత‌ర్జాతీయ క్యాబ్ నిర్వ‌హ‌ణ సంస్థ‌తో ఓలా క్యాబ్స్ పోటీప‌డుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. మొద‌ట ఓలాతో క్యాబ్‌ల విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపిన టాటా మోటార్స్ త‌ర్వాత ఉబ‌ర్‌తో సైతం ఇదే విధ‌మైన చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని స‌మాచారం. అయితే ఇందులో టాటా మోటార్స్ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే ఆ విష‌య‌మై వివ‌ర‌ణ కోసం ర‌త‌న్ టాటా మోటార్స్‌కు లేఖ రాశారు.

ratan tata in ola cabs

ఓలా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు భ‌విష్ అగ‌ర్వాల్‌తో తాను మాట్లాడిన‌ప్పుడు 10వేల నానో, ఇండికా, ఇండిగో వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిన‌ట్లు లేఖ‌లో ప్ర‌స్తావించారు. అయితే ఓలా ఎంతో ఆస‌క్తిగా ఉన్న‌ప్ప‌టికీ టాటా మోటార్స్ నుంచి సానుకూల స్పంద‌న‌లు రాలేద‌ని భ‌విష్ అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో ఓలా క్యాబ్స్‌తో టాటా మోటార్స్ డీల్ ఎందుకు ఆల‌స్య‌మ‌యిందో, అస‌లు ఒప్పందం కుదుర్చుకోక‌పోవ‌డానికి ప్ర‌య‌త్నం స‌రైన రీతిలో జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణాలు తెల‌పాల్సిందిగా త‌న లేఖ‌లో టాటా మోటార్స్‌ను ర‌త‌న్ కోరార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Read more about: tata ola
English summary

ఓలాలో ఆ పెట్టుబ‌డి ఈ వ్యాపారానికేనా టాటా? | 2 months after investing in Ola Ratan wanted Tata Motors to pursue deal with the cab firm

Nearly two months after Ratan Tata invested in Ola, he had asked then Tata Sons Chairman Cyrus Mistry to vigorously pursue a proposal to sell Tata Motors’ vehicles to the online taxi aggregator.
Story first published: Wednesday, February 15, 2017, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X