For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ టెలికాం రంగంలో జియో ప్ర‌కంప‌న‌లు ఎటు దారితీస్తాయో?

ఐడియా సెల్యూలార్ ఏకంగా 2007 లో ఐపీవో విడుద‌లైన త‌ర్వాత అత్యంత ఎక్కువ న‌ష్టాల‌ను ఇప్పుడే ప్ర‌క‌టించింది. డిసెంబ‌రుతో ముగిసిన త్రైమాసికానికి ఏకంగా ఏకీకృత నిక‌ర న‌ష్టాల‌ను 492 కోట్లుగా వెల్ల‌డించింది. అం

|

వెంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిన‌ట్లు రిల‌య‌న్స్ జియో ఉచిత సేవ‌లు మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించాయి. రిల‌య‌న్స్ జియో ప్ర‌వేశ ఆఫ‌ర్ సంద‌ర్భంగా ఉచితంగా నెట్‌తో పాట్ ఫ్రీ కాల్స్‌ను ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి దేశ మొబైల్ సేవ‌ల రంగంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టి నుంచి ప్ర‌తి నెలా మొబైల్ టెలికాం సంస్థ‌ల లాభాల్లో గ‌ణ‌నీయ‌మైన త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టెలికాం సంస్థ‌ల త్రైమాసిక ఫ‌లితాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఐడియా సెల్యూలార్ ఏకంగా 2007 లో ఐపీవో విడుద‌లైన త‌ర్వాత అత్యంత ఎక్కువ న‌ష్టాల‌ను ఇప్పుడే ప్ర‌క‌టించింది. డిసెంబ‌రుతో ముగిసిన త్రైమాసికానికి ఏకంగా ఏకీకృత నిక‌ర న‌ష్టాల‌ను 492 కోట్లుగా వెల్ల‌డించింది. అంత‌కు ముందు ఏడాది అదే త్రైమాసికంలో ఆ సంస్థ లాభాలు 636 కోట్లుగా ఉన్నాయి. ఇది కూడా చ‌ద‌వండి అయ్య‌య్యో! జియో ఎంత ప‌నిచేసింది?

ఇత‌ర టెలికాం కంపెనీల‌పై జియో ప్ర‌భావం

అనీల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ 531 కోట్ల నిక‌ర న‌ష్టాల‌ను ప్ర‌క‌టించ‌గా, ఎయిర్ టెల్ ఇండియా విభాగానికి సంబంధించి మాత్రం కాస్త ఊర‌ట క‌లిగించే విధంగా ఉన్నాయి. దేశీయ టెలికాం రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న భార‌తి ఎయిర్‌టెల్ 1.8% మెరుగుద‌ల‌తో మూడో త్రైమాసికంలో 18013 కోట్ల ఆదాయాల‌ను ప్ర‌క‌టించింది. కొత్త సంస్థ కాల్స్ విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాల‌తో త‌మ సంస్థకు కాల్స్ ద్వారా వ‌చ్చే ఆదాయం విష‌యంలో విప‌రీత‌మైన ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతున్న‌ట్లు ఎయిర్‌టెల్ ఇండియా, ద‌క్షిణాసియా విభాగానికి సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న గోపాల్ విట్ట‌ల్ వెల్ల‌డించారు. టెలికాంలో 4జీ రాకే ఒక సంచ‌ల‌నం కాగా, దానిక రిల‌య‌న్స్ జియో మ‌రిన్ని హంగుల‌ను తీర్చిదిద్దుతోంది. రిల‌య‌న్స్ జియో 4జీ నెట్‌వ‌ర్క్ ద్వారా మ‌రెన్ని ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తుందో వేచిచూడాలి. ఏది ఏమైన‌ప్ప‌టికీ వీట‌న్నింటి ద్వారా తుదిగా వినియోగదారుల‌కు మేలు జ‌రుగుతుంద‌నే విష‌యానికి అంద‌రూ సంతోషించాలి. అయితే దేశీయ టెలికాం రంగంలో పోటీ అనేది లేకుండా ఏక‌చ్చ‌త్రాధిప‌త్యానికి తావులేకుండా ట్ర‌య్ నియంత్ర‌ణ ఉంటుంద‌ని స‌గ‌టు వినియోగ‌దారుగా ఆశిద్దాం.

Read more about: telecom jio mukesh ambani idea airtel
English summary

దేశ టెలికాం రంగంలో జియో ప్ర‌కంప‌న‌లు ఎటు దారితీస్తాయో? | Top telecom companies numbers drop on RJio effect

Mobile operators are seeing a massive erosion in profitability due to the free services being offered by new entrant Reliance Jio.The latest quarterly numbers of three listed telecom companies have seen a huge dip in profits, with Idea Cellular reporting losses for the first time since its IPO in 2007.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X