For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభ‌వార్త‌! ఫిబ్ర‌వ‌రి 20 నుంచి ఏటీఎమ్ విత్‌డ్రా ప‌రిమితి రూ.50 వేల‌కు పెంపు

పెద్ద నోట్ల మార్పిడి త‌ర్వాత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌కు కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో ముందడుగేసింది. కరెన్సీ విత్ డ్రా పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచింది

|

పెద్ద నోట్ల మార్పిడి త‌ర్వాత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌కు కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో ముందడుగేసింది. కరెన్సీ విత్ డ్రా పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించింది. మార్చి 13 నుంచి నగదు విత్ డ్రాపై పరిమితిని పూర్తి స్థాయిలో ఎత్తివేయనున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం వారంలో గరిష్టంగా రూ.24 వేలను మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. జనవరి 27 నాటికి రూ. 9.92 లక్షల కోట్ల విలువైన కొత్త రూ.500, రూ.2000 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ వివ‌రణ ఇచ్చింది.

cash withdrawal limits from feb 20 is 50,000 per week

ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా పరిమితిని రూ.2,500 నుంచి రూ.4,500కు పెంచుతూ జనవరి 1న రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తర్వాత జ‌న‌వ‌రి 16 నుంచి దాన్ని రూ.10 వేలకు పెంచారు. ఇప్పటికే కరెంటు ఖాతాల ద్వారా నగదు విత్ డ్రా విషయంలో ఆర్‌బీఐ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. రూ.50వేల నుంచి రూ. లక్ష వరకూ ఈ పరిమితిని గతంలోనే ఆర్‌బీఐ పెంచింది. న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వెలువ‌రించిన త‌ర్వాత న‌గ‌దు ప్ర‌వాహాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు ఆంక్ష‌లు విధించిన సంగ‌తి అందరికీ విదిత‌మే.

ఇది కూడా చ‌ద‌వండి మీరు బిల్లు చెల్లింపులు చేసేందుకు ప‌నికొచ్చే వ్యాలెట్లు

Read more about: rbi currency notes
English summary

శుభ‌వార్త‌! ఫిబ్ర‌వ‌రి 20 నుంచి ఏటీఎమ్ విత్‌డ్రా ప‌రిమితి రూ.50 వేల‌కు పెంపు | rbi Cash Withdrawal Limit From Feb 20 increased to 50k

All restrictions on cash withdrawal from savings bank account will be removed from next month. You can withdraw as much cash you want from March 13. From 20 February, the cash withdrawal limit will be increased to Rs 50,000 per week. The existing limit is Rs 24,000.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X