For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! బ్యాంకులే ఇంత మోసం చేశాయా!

పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ.71.47 కోట్లుగా ప్రభుత్వం లెక్క తేల్చింది.ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ద్వారా 46.29 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు జ‌రిగిన‌

|

నాయ‌కుడు ఒక బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం త‌ల‌పెడితే ప్ర‌జ‌లు దానికి సహ‌క‌రించాలి. అత‌ని చ‌ర్య‌ల‌ను మ‌ద్ద‌తు ప‌ల‌కాలి. దేశంలో మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌న‌సారా స్వాగ‌తించారు కోట్ల మంది. అయితే అస‌లు ఎక్క‌డ ప‌నిజ‌ర‌గాలో అక్క‌డే బెడిసికొట్టింది. న‌ల్ల‌ధ‌నాన్ని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ‌తేడాది న‌వంబ‌ర్ 8న పెద్ద నోట్ల ర‌ద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు బ్యాంకర్ల అక్రమాలపై ప్రభుత్వం బ‌హిరంగ ప్రకటనను వెలువ‌రించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ.71.47 కోట్లుగా ప్రభుత్వం లెక్క తేల్చింది.ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ద్వారా 46.29 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. అది కూడా కేవ‌లం మూడు శాఖ‌ల ద్వారానే కావ‌డం విశేషం. అమ్మో! న‌ల్ల‌ధనాన్ని ఈ విధంగా మార్చేశారంట‌

what some banks did after demonetisation

డీమానిటైజేషన్‌ సమయంలో అంటే.. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు... వీరు నగదు మార్పిడిలో పలు అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని కేంద్రం తెలిపింది. రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి, అక్రమ లావాదేవీల్లో పలు బ్యాంకులకు చెందిన 14 బ్రాంచ్‌లలో ఈ అక్రమాలను గుర్తించినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్‌ తెలిపారు. ఆర్బీఐ సైతం పెద్ద మొత్తంలో ఆ స‌మ‌యంలో జ‌రిగిన న‌గ‌దు లావాదేవీల‌ను ట్రాక్ చేసింది. అంతే కాకుండా వాటి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని బ్యాంకుల‌ను సైతం ఆదేశించింది. సో! అక్ర‌మార్కులారా సిద్దంగా ఉండండి.. ప్ర‌భుత్వం మీ భ‌ర‌తం ప‌ట్ట‌బోతోంది.

Read more about: currency notes rbi
English summary

అమ్మో! బ్యాంకులే ఇంత మోసం చేశాయా! | Bank staff colluded to exchange old notes worth Rs 71 crore said Govt

mployees of a few banks were involved in illegally transacting the scrapped high value old notes of Rs 500 and Rs 1,000 amounting to over Rs 71.47 crore during the demonetisation period, from November 9 to December 30, 2016 government said on Friday."Banks have reported 14 cases (branches) where bank employees have been found involved in irregular exchange transaction of specified bank notes (SBNs) during the phase of demonetisation," Minister of State for Finance Santosh Gangwar said in a written reply in Lok Sabha.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X