For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్ప లాభాలతో సరి! - బీఎస్ఈ షేరుకు భ‌లే డిమాండ్‌

వారంలో చివ‌రి ట్రేడింగ్ రోజు మార్కెట్లు ప్ఛ్ మ‌నిపించాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్

|

వారంలో చివ‌రి ట్రేడింగ్ రోజు మార్కెట్లు ప్ఛ్ మ‌నిపించాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 14 పాయింట్లు బలపడి 28,240 వద్ద నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,741 వద్ద స్థిరపడింది.

స్వల్ప లాభాలతో సరి! - బీఎస్ఈ షేరుకు భ‌లే డిమాండ్‌

బడ్జెట్‌ నేపథ్యంలో గత రెండు రోజులు మార్కెట్లు లాభాలతో ప‌రుగులు పెట్ట‌గా నేటి ట్రేడింగ్‌లో కన్సాలిడేషన్‌ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ట్రెండుకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, చిన్న షేర్లకు భారీ డిమాండ్ కనిపించడం గమనించదగ్గ అంశమని చెప్పారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు మూల‌ధ‌న కేటాయింపులు చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని నిధులు స‌మ‌కూరుస్తామ‌ని జైట్లీ చెప్ప‌డం బ్యాంకు షేర్ల‌కు ఊపునిచ్చింది.

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) షేర్లు శుక్రవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో (ఎన్‌ఎస్‌ఈ) నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.806 కన్నా 35శాతం అధికంగా రూ.1,085 వద్ద ఈ షేర్లు నమోదు కావడం విశేషం. తొలి సెషన్‌లో ఐతే రూ.1,200ను తాకింది. జనవరి 25న ముగిసిన బీఎస్‌ఈ ఐపీవోకు 51.15 రెట్ల స్పందన లభించింది. ఆసియాలో పురాతన, భారత్‌లో తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజీ కావడంతో మదుపర్లు బీఎస్‌ఈ ఐపీవోపై భారీ ఆసక్తి కనబరిచారు.

English summary

స్వల్ప లాభాలతో సరి! - బీఎస్ఈ షేరుకు భ‌లే డిమాండ్‌ | Sensex ends flat after two continuous days gains

Shares closed flat on Friday on caution ahead of the central bank's policy meeting next week, but indexes ended a second straight week with gains after the Budget, aimed at accelerating economic growth, boosted sentiment.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X