For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు త‌ర్వాత జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లపై ఐటీ శాఖ గురి!

ప్రశ్నలకు స్పందించకపోయినా లేదా వారి స్పందన అసంతృప్తికరంగా ఉన్నా వెంటనే నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలి పారు. మరోవైపు రూ.2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపు 1 కోటి దాకా ఉన్నట్టు సమాచారం. అ

|

నోట్ల రద్దు తర్వాత గుర్తించిన అనుమా నాస్పద ఖాతాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటివరకు 10 లక్షల అనుమా నాస్పద ఖాతా దారాలకు ఎస్‌ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఆదా య పన్నుశాఖ నోటీసులు పంపింది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు తర్వాత 18 లక్షల ఖాతాల నుంచి దాదాపు రూ.4.7 లక్షల కోట్ల అనుమానా స్పద డిపాజిట్లు వచ్చాయని ఐటి శాఖ గుర్తించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట అనుమానాస్పద ఖాతాదారాలను గుర్తించి, ఆదాయం ఎలా వచ్చిందో వివరాలను తెలియజేయాలని ఐటి ప్రశ్నిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని, డిపా జిటర్లు ఐటి కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 10 రోజు ల్లోగా నోటీసులు అందుకున్న ఖాతాదారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన గడువులోగా సమాధానం ఇవ్వని పక్షంలో అవి అనుమానాస్పద ఖాతాలుగానే పరిగణించి, డిపా జిటర్లపై ఐటి తగిన చర్యలు చేపట్టనుంది. కొన్ని సందర్భాల్లో పనిచేయకుండా ఉన్న ఖాతాల్లోకి డిపాజిట్లు రాగా.. గుర్తుతెలియని ఖాతాదారుల నుంచి అకౌంట్లలోకి నగదు డిపాజిట్లు కూడా వచ్చాయి. డిమానిటైజేషన్(నోట్ల రద్దు) తర్వాత అప్రకటిత ఆదాయం వెల్లడించేందుకు ఆఖరి అవకాశంగా ప్రభుత్వం పిఎంజికెవై (ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన) పథకాన్ని ప్రారం భించింది. డిసెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారం భించగా.. మార్చి 31 వరకు అప్రకటిత ఆదా యం వెల్లడికి సమయం ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 18 లక్షల మందికి చెందిన అను మానాస్పద నగదు డిపా జిట్లను ఐటి గుర్తించింది.

13 lakh taxpayers got mails and messages to explain suspicious deposits

దీనిలో రూ.5 లక్షలకు పైన డిపాజిట్లు కల్గినవారు సైతం ఉన్నారు. డిపాజిట్లకు సంబంధించిన వివరాలను తెలియజే యాలంటూ సిబిడిటి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) వీరందరికి ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్ లను పంపననున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించింది. 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను ఐటి గుర్తించిందని మంగళవారం రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ ఆధి యా చెప్పారు. ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో పరి శీలన ద్వారా ఈ ఖాతాల వివ రాలను సేకరిం చినట్టు వెల్లడించారు. గత ఏడాది నవంబరు 9 నుంచి డిసెంబర్ 31 మధ్య నమో దైన భారీ డిపా జిట్లపై దృష్టిపెట్టిన కేంద్రం డాటా ఎనలిస్టుల సహాయంతో ఈ అక్రమార్కులు భర తం పట్టేం దుకు సిద్ధమవుతోంది. టాక్స్ పేమెంట్ ప్రొఫైల్ తో సరిపోలని డిపాజిట్‌దారుల ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించ నున్నారు. ఈ ప్రశ్నలకు స్పందించకపోయినా లేదా వారి స్పందన అసంతృప్తికరంగా ఉన్నా వెంటనే నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలి పారు. మరోవైపు రూ.2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపు 1 కోటి దాకా ఉన్నట్టు సమాచారం. అలాగే కరెంట్ ఖాతాల్లో 12.5 లక్షలకుపైగా డిపాజిట్లను కూడా ఐటి పరిశీలించింది. సమాధానం ఇచ్చేందుకు 10 రోజుల సమయం ఇచ్చామని సిబిడిటి తెలిపింది.

Read more about: cbdt notes currency it
English summary

నోట్ల ర‌ద్దు త‌ర్వాత జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లపై ఐటీ శాఖ గురి! | 13 lakh taxpayers got mails and messages to explain suspicious deposits

Revenue authorities have sent emails and text messages to about 1.3 million of the 1.8 million people identified for making suspicious and large cash deposits after Prime Minister Narendra Modi's sudden move to abolish high-value notes.These accounts are being scrutinised for possible tax evasion in the government's crackdown on black money while the remaining will receive their "please explain" notice tomorrow, said Sushil Chandra, chairman of the Central Board of Direct Taxes (CBDT).
Story first published: Friday, February 3, 2017, 22:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X