For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్లు కొంటున్నార‌ట‌... మ‌రి ప‌న్నులు మాత్రం క‌ట్ట‌రంట‌!

ప‌న్ను ఎగ‌వేత‌దారులు ఎక్కువ‌! స‌రిగ్గా ప‌న్నులు చెల్లించేవారు త‌క్కువ అన్న‌ట్లుంది మ‌న దేశ ప‌రిస్థితి. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న సమతూక రాహి త్యం బయటపడిందని ఆర్థిక మంత్రి

|

ప‌న్ను ఎగ‌వేత‌దారులు ఎక్కువ‌! స‌రిగ్గా ప‌న్నులు చెల్లించేవారు త‌క్కువ అన్న‌ట్లుంది మ‌న దేశ ప‌రిస్థితి. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న సమతూక రాహి త్యం బయటపడిందని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ప్రజలు చెల్లించే పన్నుకు, వారి జీవనశైలి వినియోగానికి ఏ మాత్రం పొంతన లేదని తన బడ్జెట్ ప్రసంగంలో బ‌హిర్గ‌తం చేశారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంతమాత్రం వాస్తవికతకు అద్దం పట్టడం లేదన్నారు. 130 కోట్లు దాటిన దేశ జనాభాలో 5 లక్షలపైన వార్షికాదాయం కలిగిన వ్యక్తులు 76 లక్షలు మాత్రమే ఉండ‌టాన్ని ఎత్తిచూపారు. ఈ నేప‌థ్యంలో ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి వివిధ ఆస‌క్తిక‌ర అంశాల‌ను తెలుసుకుందాం.

ఇన్ని కార్లున్నా... వారికి ఆదాయం పెద్ద‌గా లేద‌ట‌...

ఇన్ని కార్లున్నా... వారికి ఆదాయం పెద్ద‌గా లేద‌ట‌...

దేశంలో గ‌త ఐదేళ్ల‌లో కోటి 25 ల‌క్ష‌ల కార్లు అమ్ముడుపోయాయి.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం 24.4 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే రూ. 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వార్షికాదాయం క‌లిగినట్లు డిక్ల‌రేష‌న్ల‌ను స‌మ‌ర్పించారు. కానీ కార్ల కొనుగోళ్ల‌ను చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ మాన‌దు. గ‌త 5 సంవ‌త్స‌రాలలో స‌గ‌టున ఏటా 25 ల‌క్ష‌ల కొత్త కార్లు అమ్ముడుపోయాయి. అందులో 35వేల ల‌గ్జ‌రీ కార్లున్నాయి. 2014-15లో ప‌న్ను సంక్ర‌మించే ఆదాయం క‌లిగిన వారిలో రూ. 3.65 కోట్ల మంది ఉండ‌గా కేవ‌లం 5.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే త‌మ ఆదాయం రూ. 5 ల‌క్ష‌ల‌పైన ఉంద‌ని ప్ర‌క‌టించి, రిట‌ర్నులు స‌మ‌ర్పించారు. ఆ ఏడాది మొత్తం ఆదాయ‌పు ప‌న్నులో 57% వీరు చెల్లించిందే. అంటే మొత్తం 3.65 కోట్ల మందిలో కేవ‌లం 1.5 శాతం మందే ప‌న్ను క‌డుతున్నారని ఆదాయ‌పు ప‌న్ను శాఖ విశ్లేషించింది.

99 ల‌క్ష‌ల మంది ఆదాయం 2.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌ట‌

99 ల‌క్ష‌ల మంది ఆదాయం 2.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌ట‌

2015-16లో 3కోట్ల 70 లక్షల మంది ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేశారని వీరిలో 99 లక్షల మంది తమ వార్షికాదాయం రెండున్నర లక్షల మినహాయింపు పరిధిలోపే ఉన్నట్టు చూపారని తెలిపారు. కోటీ 95 లక్షల మంది తమ ఆదాయం రెండున్నర లక్షలు- ఐదు లక్షలు మించి మధ్య ఉన్నట్టు రిటర్న్స్ దాఖలు చేశారని అన్నారు. 52 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం 5 నుంచి 10 లక్ష మధ్య ఉన్నట్టు చూపారని జైట్లీ అన్నారు. కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం 10 లక్షలపైనేనని వెల్లడించారని తెలిపారు.

ప‌న్నులు చెల్లిస్తున్న వారిలో ఎక్కువ శాతం ఉద్యోగులే ఉన్నారు

ప‌న్నులు చెల్లిస్తున్న వారిలో ఎక్కువ శాతం ఉద్యోగులే ఉన్నారు

అంటే 76 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే అధికారిక ఆదాయం రూ. 5 ల‌క్ష‌ల‌పైబ‌డి ఉన్న‌ట్లు చూపుతున్నారు. ఈ 76 లక్షల మందిలో 5 లక్షలపైన వార్షికాదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో 56 లక్షల మంది ఉద్యోగులేనని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 50 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్నట్టుగా ప్రకటిస్తున్న వ్యక్తుల సంఖ్య కేవలం 1.72 లక్షల మంది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆదాయ, వినియోగ స్థాయికి వారు చెల్లిస్తున్న పన్నుకు ఏ మాత్రం పొంతన కనిపించడం లేదన్నారు.

2015లో విమానాల్లో విదేశాల‌కు వెళ్లిన వారు 2 కోట్ల‌కు పైనే

2015లో విమానాల్లో విదేశాల‌కు వెళ్లిన వారు 2 కోట్ల‌కు పైనే

గత ఐదేళ్లలో దేశంలో 1.25 కోట్లమేర కార్లు అమ్ముడుపోయాయని తెలిపారు. 2015లో వ్యాపారం, టూరిజం ఇతర అవసరాలపై విమానాల్లో విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 2 కోట్ల మందిపైనేనని మంత్రి వివరించారు. వ్యవస్థీకృత రంగంలో 4.2 కోట్ల మంది పనిచేస్తున్నారని వారిలో కేవలం 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని అన్నారు. అలాగే అనియత(అవ్య‌వ‌స్థీకృత‌) రంగంలో ఉన్నవారి సంఖ్య 5.6 కోట్లయితే 1.81 మంది మాత్రమే ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు.

కంపెనీల విష‌యానికొస్తే

కంపెనీల విష‌యానికొస్తే

2014 మార్చివరకూ 13.94 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని వీటిలో 5.97 కంపెనీలు 2016-17లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాయన్నారు. వీటిలో 2.76లక్షల కంపెనీలు నష్టాల్లో ఉన్నట్టుగా లేదా అసలు ఆదాయమే లేనట్టుగా రిటర్న్స్ దాఖలు చేశాయన్నారు. 2.85 లక్షల కంపెనీలు పన్ను చెల్లించడానికి ముందు ఆదాయం కోటి రూపాయలకంటే తక్కువేనని చూపించాయని చెప్పారు. 28వేల కంపెనీలు కోటి నుంచి 10 కోట్ల మధ్య లాభం గడించినట్టు చూపించాయని జైట్లీ స్పష్టం చేశారు.ఆ రెండు కంపెనీల విలీనంతో టెలికాం రంగంలో నంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అవుతారో?

దేశంలో జీడీపీలో ప‌న్నుల వాటా ఇంతేనా...

దేశంలో జీడీపీలో ప‌న్నుల వాటా ఇంతేనా...

అభివృద్ది చెందిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ వృద్దిలో కుంగుబాటుకు గుర‌వుతున్నా భార‌త్ మాత్రం ప్ర‌పంచ ఆర్థికానికి చోద‌క శ‌క్తిగా ప‌నిచేస్తోంది. మన జీడీపీ ఆశాజ‌న‌కంగా న‌మోద‌వుతోంది. అయితే జీడీపీలో ప‌న్నుల వాటా ఆందోళ‌న‌క‌రంగా ఉంది. 1950-51లో జీడీపీలో ప‌న్నుల వాటా 6% ఉండ‌గా; ప‌్ర‌స్తుతం ఇది 16.6% గా ఉంది. వెనుక‌బ‌డిన ద‌క్షిణాఫ్రికాలోనే ఇది 28.8%గా ఉండ‌టం విశేషం. బ్రెజిల్‌(35.6%), చైనా(19.4%), ర‌ష్యా(23.0%) జీడీపీలో ప‌న్నుల వాటాలో మ‌న కంటే ముందున్నాయి. అభివృద్ది చెందుతున్న దేశాల్లో స‌గ‌టు జీడీపీ-ప‌న్ను నిష్ఫ‌త్తి 21.4% ఉండ‌గా కనీసం దాని ద‌రిదాపుల్లో భార‌త్ లేక‌పోవ‌డం బాధాక‌రం. అభివృద్ది జ‌రిగేందుకు ప్ర‌భుత్వానికి నిధులు అవ‌స‌రం. ప‌న్నుల ద్వారానే వ్య‌వ‌స్థ‌కు నిధులు స‌మ‌కూరుతాయ‌న్న‌ది స‌త్యం. అలాంట‌ప్పుడు విప‌రీత‌మైన ప‌న్ను ఎగ‌వేత‌ల కార‌ణంగా ప్ర‌భుత్వం ఇత‌ర ప‌న్ను రేట్ల‌ను పెంచ‌డ‌మో, కొత్త వ‌స్తు,సేవ‌ల‌ను ప‌న్ను ప‌రిధిలోకి చేర్చ‌డ‌మో త‌థ్యం. దేశ పౌరులంతా నిజాయ‌తీగా ప‌న్ను చెల్లించ‌న‌ప్పుడే దేశాభివృద్ది సాధ్య‌మ‌వుతుందున్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Read more about: income tax arun jaitley it tax
English summary

కార్లు కొంటున్నార‌ట‌... మ‌రి ప‌న్నులు మాత్రం క‌ట్ట‌రంట‌! | Why the number of tax payers and car buyers is not tallying

India has just 24.4 lakh tax payers who declared an annual income of over ₹10 lakh yet 25 lakh new cars, including 35,000 luxury cars, are being bought every year for last five years, a top official said.A nation of over 125 crore people had only 3.65 crore individuals filing their tax returns in the assessment year 2014-15, the official said alluding to a huge number of individuals being outside the tax net.He said in the Budget for 2016-17, small traders and businessmen, with turnover of up to Rs 2 crore who did not maintain proper accounts, were presumed to have earned 8 per cent income or profit for tax purposes. But if they use digital mode of payments, their income will now be presumed to be 6 per cent of the turnover and not 8 per cent.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X