For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీవో అంటే ఏమిటి? 2016 ఐపీవోల సంవ‌త్స‌రం ఎందుకు అయింది?

ఏ స్టాక్ ఎక్సేంజీ జాబితాలో కూడా లేని కంపెనీ మొదటిసారిగా ప్రజలకు కొత్తగా షేర్లను ఇస్తే లేదా ప్రస్తుతం ఉన్న షేర్లను అమ్మాలని ప్రతిపాదిస్తే లేదా రెండూ చేస్తే, దానిని ఐపీవో(ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్‌) అంట

|

ఏ స్టాక్ ఎక్సేంజీ జాబితాలో కూడా లేని కంపెనీ మొదటిసారిగా ప్రజలకు కొత్తగా షేర్లను ఇస్తే లేదా ప్రస్తుతం ఉన్న షేర్లను అమ్మాలని ప్రతిపాదిస్తే లేదా రెండూ చేస్తే, దానిని ఐపీవో(ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్‌) అంటారు. షేర్ లను ఇచ్చే వాళ్ళు, పబ్లిక్ ప్రతిపాదన ద్వారా, కొత్త పెట్టుబడిదారులను షేర్ హోల్డింగు కుటుంబంలో చేరమని ప్రతిపాదిస్తారు.

ఐపీవో అంటే ఏమిటి? 2016 ఐపీవోల సంవ‌త్స‌రం ఎందుకు అయింది?

కంపెనీ ప్రోత్సాహకులు, వాళ్ళకు పెట్టుబడి చేసిన బ్యాంకులతో సంప్రదించి నిర్ణయించిన ధరకు, పెట్టుబడిదారులకు షేరులు అందుబాటులో ఉంచుతారు.
ఐపీవోను విజయవంతగా పూర్తి చేస్తే, కంపెనీ షేర్లు నియుక్త స్టాక్ ఎక్సేంజి జాబితాలో ల‌భ్య‌మ‌వుతాయి. మదుప‌ర్లు లేదా ట్రేడ‌ర్లు వాటితో వ్యాపారం చేయవచ్చు. అంటే ఆయా షేర్ల‌ను కొన‌వ‌చ్చు లేదా అమ్మ‌వ‌చ్చు.

2003-2004 నుండి 2007-2008 వరకు ఐపీవోల కోసం చురుకైన మార్కెట్టు ఉండేది. ఐపీవోల సంఖ్య తక్కువ ఉన్నప్పటికి, ఉత్పన్నము చేయగలుగుతున్న డబ్బు మొత్తాలు పెరుగుతూ ఉండేవి. ఆర్ధిక వ్యవస్థలో మరియు సహాయక మార్కెట్లలో మాంద్యం వలన 2008-2009 లో కేవలం 21 చిన్న ఐపీవోల ద్వారా ఉత్పన్నం చేయగలిగిన మొత్తం, అత్యల్ప స్థాయికి, అంటే 2034 కోట్లకు పడిపోయింది. త‌ర్వాత 2009-10 సంవ‌త్స‌రంలో ,ఐపీవోల మార్కెట్ మరలా మెరుగుపడటమును చూశాం. మ‌ళ్లీ ఇటీవ‌ల 2016 సంవ‌త్స‌రం ఐపీవోల సంవ‌త్స‌రంగా పేరు తెచ్చుకుంది.

 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నారా? అయితే వివిధ మార్గాలివే... మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నారా? అయితే వివిధ మార్గాలివే...

మొద‌టి 9 నెలల కాలంలో 21 ఐపీవోల ద్వారా వివిధ కంపెనీలు రూ. 19379 కోట్ల‌ను రాబ‌ట్ట‌గ‌లిగాయి.2007 త‌ర్వాత మొద‌టి జ‌న‌వ‌రి-సెప్టెంబ‌రు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇంత ఎక్కువ రావ‌డం ఇదే మొద‌టిసారి. అప్ప‌ట్లో 2007 సంవ‌త్స‌రంలో 81ఐపీవోల ద్వారా రూ. 28,993.65 కోట్ల‌ను కంపెనీలు రాబ‌ట్టాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 132.37 ల‌క్ష‌ల షేర్ల‌ను విడుద‌ల చేసింది. దేశంలో ఏ బీమా కంపెనీ అయినా ఐపీవో జారీ చేయ‌డం ఇదే మొద‌టిది. ఐపీవో ముగిసే స‌రికి 21 సెప్టెంబ‌రు నాటికి ఐపీవో ద్వారా ఆ సంస్థ షేర్ల‌కు 10.44 ఇంత‌ల డిమాండ్ ఏర్ప‌డింది. ఇది కూడా చ‌ద‌వండి బ‌డ్జెట్లో ముఖ్య ప‌దాల అర్థాలేంటి?

English summary

ఐపీవో అంటే ఏమిటి? 2016 ఐపీవోల సంవ‌త్స‌రం ఎందుకు అయింది? | why 2016 is the year of IPOs and what is the initial public offer

An IPO is when a company which is presently not listed at any stock exchange makes either a fresh issue of shares or makes an offer for sale of its existing shares or both for the first time to the public. Through a public offering, the issuer makes an offer for new investors to enter its shareholding family. Prudential Life Insurance Co. Ltd offered 132.37 million shares in its initial public offering (IPO) last month—the first by an Indian insurer.
Story first published: Monday, January 30, 2017, 21:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X