For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల్లో క‌రెంట్ ఖాతా అంటే ఏమిటి? తెర‌వ‌డం ఎలా?

కరెంట్ ఖాతా అనేది, ఖాతాదారుడు, బ్యాంకులో దాచుకున్న సోమ్మును, ఏ సమయంలో నైనా తిరిగి తీసుకునే సదుపాయం కలదు. సోమ్ము దాచుకున్న ఖాతాదారుడు ఈ ఖాతాల‌ను స్వేచ్ఛగా రోజులో ఎన్ని సార్లు అయినా విత్‌డ్రా, డిపాజిట్‌

|

కరెంట్ ఖాతా అనేది, ఖాతాదారుడు, బ్యాంకులో దాచుకున్న సోమ్మును, ఏ సమయంలో నైనా తిరిగి తీసుకునే సదుపాయం కలదు. సోమ్ము దాచుకున్న ఖాతాదారుడు ఈ ఖాతాల‌ను స్వేచ్ఛగా రోజులో ఎన్ని సార్లు అయినా విత్‌డ్రా, డిపాజిట్‌ల కోసం వాడుకొనవచ్చు. కానీ పొదుపు ఖాతాల విష‌యంలో ప‌రిమిత లావాదేవీల‌కే అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ ఖాతాను చిన్న చిన్న వ్యాపారులు, వర్తకాలు, వృత్తులలో ఉన్నవారు తెరుస్తారు. కరెంట్ ఖాతాలు , పొదుపు ఖాతాల వ‌లె క్ర‌మంగా వ‌డ్డీని అందించ‌వు. కరెంటు ఖాతా తెరిచే విధానం, అర్హ‌త‌ల‌ను తెలుసుకుందాం.

ఈ ఖాతాలు ఎవ‌రి కోసం?

ఈ ఖాతాలు ఎవ‌రి కోసం?

ప్రాధమికంగా వ్యాపార అవసరాల నిమిత్తం, కరెంట్ ఖాతాలు ఉద్దేశించబడ్డాయి. వ్యాపారులు, భాగస్వామ్య వ్యాపార సంస్ధలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు మొదలైనవి, ఈ ఖాతాను ఉపయోగించుకుంటాయి. ధనలావాదేవీలను, వ్యాపారంలోని ప్రతి స్ధాయిలో, ఎటువంటి యిబ్బంది లేకుండా సవ్యంగా జరగడానికి వీలుగా మాత్రమే ఈ కరెంట్ ఖాతా ఉద్దేశించబడింది.

 అర్హ‌త‌లు

అర్హ‌త‌లు

భారతదేశంలో నివసించే అందరు భారతీయులు, 18 సంవత్సరాల వయసు నిండినవారు, అంత కన్నా ఎక్కువ వయసు కలవారు ఈ ఖాతా తెరవడానికి అర్హులు. అంతేకాక, వ్యక్తులు, వ్యక్తి యాజమాన్యం కల సంస్ధలు, భాగస్వామ్య సంస్ధలు, వ్యాపార సంస్ధలు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్ధలు, ఆస్తి సంరక్షక సంస్ధలు, అవి భక్త ఉమ్మడి కుటుంబాలు మొదలైనవి కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. కరెంట్ ఖాతాను వ్యక్తి గాగాని, సమిష్టిగాగాని కూడా తెరవవచ్చు.

 క‌నీస డిపాజిట్

క‌నీస డిపాజిట్

బ్యాంకులు 5000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కనిష్ట డిపాజిటును ఖాతా తెరవడానికి అడుగుతాయి. సామాన్యంగా, జాతీయ బ్యాంకులలో కరెంట్ ఖాతా తెరవడానికి, డిపాజిట్ తక్కువగానే అవసరం ఉంటుంది. ప్ర‌యివేటు బ్యాంకుల్లో బ్యాంకును బ‌ట్టి ఇది మారుతుంది.

ఖాతా తెర‌వ‌డం ఎలా?

ఖాతా తెర‌వ‌డం ఎలా?

కరెంట్ ఖాతాను తెరవడం చాలా సులభం. దరఖాస్తు ఫారమ్ ను పూర్తిగా నింపి, అవసరమైన అధికారిక వ్య‌క్తిగ‌త మరియు చిరునామా గుర్తింపు పత్రాల వంటి వాటిని జతచేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు అధికారిక ధృవపత్రాల అవసరం వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒకే వ్యక్తి యాజమాన్యం క్రింద ఉండే వ్యాపారానికి కావలసిన ధృవపత్రాలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ప్రైవేట్ భాగస్వామ్య వ్యాపార సంస్ధకు) కు కావలసిన అధికారిక పత్రాలకు తేడా ఉంటుంది.

English summary

బ్యాంకుల్లో క‌రెంట్ ఖాతా అంటే ఏమిటి? తెర‌వ‌డం ఎలా? | what is current account in bank and how to open it

A current account is a type of deposit account that caters to professionals and businessmen alike. Dealing largely with liquid deposits, this product allows for withdrawal of funds and checks being written against the balance and does not limit the number of transactions in a day. Professionals, traders, SMEs and agricultural businesses can all avail different benefits like free fund transfers between all accounts, free local collections through cheque and fund transfers as well as easy inter-city banking. Select the current account that is most advantageous to you today!
Story first published: Wednesday, January 25, 2017, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X