For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర బ‌డ్జెట్‌కు సుప్రీంకోర్టులో లైన్ క్లియ‌ర్‌

కేంద్ర బ‌డ్జెట్ 2017-18 ప్ర‌వేశపెట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. బ‌డ్జెట్‌ను స‌మర్పించే తేదీని వాయిదా వేయాల‌ని ఎం.ఎల్ శ‌ర్మ కేంద్ర న్యాయస్థానంలో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌

|

కేంద్ర బ‌డ్జెట్ 2017-18 ప్ర‌వేశపెట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. బ‌డ్జెట్‌ను స‌మర్పించే తేదీని వాయిదా వేయాల‌ని ఎం.ఎల్ శ‌ర్మ కేంద్ర న్యాయస్థానంలో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇవాళ పిటిషన్ పై విచారించిన కోర్టు ఫిబ్ర‌వ‌రి 1నే ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ప‌చ్చ‌జెండా ఊపింది. రాష్ట్రాల్లో త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, వాటివ‌ల్ల కేంద్రం త‌న ప‌నులు మానుకోలేద‌ని తేల్చిచెప్పింది. ఏడాది మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటే కేంద్రం త‌న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌కూడ‌దా? అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది.

SC dismissed plea to postpone Union Budget

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి త‌న ఆదేశాల్లో బ‌డ్జెట్ కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసేదేమీ ఉండ‌ద‌న్నారు. ముఖ్యంగా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వం ప‌నిని అడ్డుకునే వీల్లేద‌ని అన్నారు. ఏడాది పొడ‌వునా దేశంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్నందున బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ‌కు వాయిదా వేసేందుకు ఆదేశించ‌లేమ‌ని పేర్కొన్నారు. ఎప్పుడూ ఏదో రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉంటాయ‌న్న న్యాయ‌మూర్తి అంత మాత్రాన బ‌డ్జెట్‌ను వాయిదా వేయాల్సిన అవ‌స‌రం ఉందా అని శ‌ర్మ‌ను ప్ర‌శ్నించారు.

English summary

కేంద్ర బ‌డ్జెట్‌కు సుప్రీంకోర్టులో లైన్ క్లియ‌ర్‌ | SC dismissed plea to postpone Union Budget

SC dismissed plea to postpone Union Budget The Supreme Court today rejected the plea seeking postponement of Union Budget presentation ahead of the upcoming assembly polls in five states.
Story first published: Monday, January 23, 2017, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X