For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల‌సీని స్వాధీనం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

పాలసీ స్వాధీనం అన్ని రకాల పాలసీలకు వర్తించదు. ఎండోమెంట్‌, యూలిప్స్‌ లాంటి జీవిత కాలం వర్తింపజేసే పాలసీలను స్వాధీనపర్చుకునే వీలుంటుంది. టర్మ్‌ పాలసీలో పాలసీ గడువులోగా ప్రమాదం జరిగితే బీమా హామీ మొత్తాన్

|

స్వాధీన విలువ (సరెండర్‌ వాల్యూ)
మెచ్యూరిటీ తేదీ లేదా బీమా ఉద్దేశించిన సంఘటన అవ్వక ముందే పాలసీదారుడు తన పాలసీని ముగించాలని కోరుకుంటే బీమా కంపెనీ పాలసీదారుకు అందించే సొమ్మునే స్వాధీన విలువ అంటారు.

సాధారణంగా ఒక పాలసీని తీసుకున్నాక పాలసీదారుడు దాన్ని స్వాధీనపర్చకపోవడమే మేలు ఎందుకంటే హామీ ఇచ్చిన సొమ్ము కంటే స్వాధీన విలువ తక్కువ ఉంటుంది. అయితే తీసుకున్న పాలసీ తన అవసరాలకు తగినది కాదని భావించినప్పుడు స్వాధీనం పరచడమే మంచిది. ఒక్కసారి పాలసీని స్వాధీనం చేశాక బీమాకు వర్తించే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి.

పాలసీ కాలావధి, చెల్లించిన ప్రీమియంలు, ప్రీమియం చెల్లించిన కాలావధిని పరిగణలోకి తీసుకొని ఇందుకు కొంత స్వాధీన రుసుమును వేసి స్వాధీన విలువకు తగ్గ సొమ్మును పాలసీదారుకు అందజేస్తారు.

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) ఇటీవల సూచించిన విధంగా అయిదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించిన వారికి స్వాధీన రుసుము వర్తింపజేయవద్దని బీమా కంపెనీలకు
నిర్దేశించింది.

ఓ పాలసీని స్వాధీనం చేసుకోవాలంటే కనీసం మూడేళ్ల వరకు వరుసగా ప్రీమియంలు చెల్లించి ఉండాలి.
మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా పాలసీని స్వాధీనపర్చుకోవాలని పాలసీదారు భావిస్తే ఇంతవరకు చెల్లించిన ప్రీమియంలను దానికి స్వాధీన రుసుమును కలిపి ఎంత వరకు చెల్లించాలో 'పెయిడ్‌ అప్‌ వాల్యూ' గా లెక్కించి అందజేస్తారు.

పాలసీ స్వాధీనం అన్ని రకాల పాలసీలకు వర్తించదు. ఎండోమెంట్‌, యూలిప్స్‌ లాంటి జీవిత కాలం వర్తింపజేసే పాలసీలను స్వాధీనపర్చుకునే వీలుంటుంది. టర్మ్‌ పాలసీలో పాలసీ గడువులోగా ప్రమాదం జరిగితే బీమా హామీ మొత్తాన్ని ఇస్తారు కాబట్టి వీటిని స్వాధీనపర్చుకునే అవకాశం లేదు.

How to calculate cash surrender value of life insurance

సాధారణంగా బీమా కంపెనీలు పాలసీలపై రుణాలు ఇస్తుంటాయి. ఎప్పుడైనా పాలసీ నుంచి పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకున్నా లేదా పాలసీపై రుణాలు తీసుకున్నా దాని ప్రభావం స్వాధీన విలువపై ఉంటుంది. రుణాలు తీసుకుంటే స్వాధీన విలువ తగ్గుతుందన్నమాట.

స్వాధీన విలువను లెక్కించేటప్పుడు పాలసీపై జమ అయ్యే బోనస్‌ను కూడా కలిపి ఇస్తారు. అంతవరకు ప్రీమియంల రూపంలో చెల్లించిన పెట్టుబడులను స్వాధీన విలువగా అందజేస్తారు. పెట్టుబడి బీమా కలిసి ఉన్న ఎండోమెంట్‌ పథకాలు, మనీబ్యాక్‌ పాలసీలు, యూలిప్‌ లాంటి పాలసీలకు మాత్రమే స్వాధీన వెసులుబాటు ఉంటుంది.

కొన్ని యూలిప్స్‌లో ఒక ఏడాది తర్వాత కూడా స్వాధీనపర్చుకునే వీలుంటుంది. అయితే స్వాధీన సొమ్మును మాత్రం మూడేళ్ల తర్వాతే చెల్లిస్తారు.

Read more about: insurance policy
English summary

పాల‌సీని స్వాధీనం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి | How to calculate cash surrender value of life insurance

How to surrender lic policy before maturityHow to calculate cash surrender value of life insurance
Story first published: Thursday, January 19, 2017, 19:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X