For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్ర‌వ‌రి 1నే బ‌డ్జెట్‌:ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌లుండ‌వు

కేంద్ర బ‌డ్జెట్‌ను ఎప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల‌నే దానిపై కేంద్ర ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌లు జ‌రిగే 5 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌బోవ‌ని స్ఫ‌ష్టం చేశారు. వ‌చ్చే నెల నుంచి జ‌ర‌

|

కేంద్ర బ‌డ్జెట్‌ను ఎప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల‌నే దానిపై కేంద్ర ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌లు జ‌రిగే 5 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌బోవ‌ని స్ఫ‌ష్టం చేశారు. వ‌చ్చే నెల నుంచి జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 4 నుంచి మొద‌ల‌వ‌నున్నాయి. దానికి కొన్ని రోజుల ముందే బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పించాల‌న్న కేంద్రం నిర్ణ‌యాన్ని కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ స‌హా విప‌క్ష పార్టీలు వ్య‌తిరేకించాయి. అదే విష‌యంపై ప‌లు విప‌క్ష పార్టీల‌న్నీ కూట‌మిగా వెళ్లి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే బ‌డ్జెట్‌ను ఒక నెల ముందే ప్ర‌వేశ‌పెట్టాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని ఎన్నిక‌ల సంఘం ఎదుట కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఫిబ్ర‌వ‌రి 1నే బ‌డ్జెట్‌:ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌లుండ‌వు

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి రోజు(ఏప్రిల్ 1) నుంచే కేటాయింపుల ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌డానికి ఇది వీలు క‌ల్పిస్తుంద‌ని వివర‌ణ ఇచ్చింది. తాజా షెడ్యూల్ ప్ర‌కారం పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లోని మొద‌టి అంకం ఈ నెల చివ‌ర‌న ప్రారంభ‌మ‌వుతుంది. ఆ రోజున పార్ల‌మెంటును ఉద్దేశించి స‌భాధ్య‌క్షుడైన రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ప్ర‌సంగంతో బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెడ‌తారు. ఈ నెల 31న ఆర్థిక స‌ర్వే ను ప్ర‌వేశ‌పెడ‌తారు. మ‌రుస‌టి రోజు అంటే ఫిబ్ర‌వ‌రి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ‌డ్జెట్‌ను పార్ల‌మెంటుకు స‌మ‌ర్పిస్తారు. ఈ 2017 బ‌డ్జెట్ నుంచి ప్ర‌త్యేక రైల్వే బ‌డ్జెట్ లేకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం బ‌డ్జెట్ ముద్ర‌ణా ప్ర‌క్రియ‌ను అరుణ్ జైట్లీ లాంఛ‌నంగా ప్రారంభించారు.

English summary

ఫిబ్ర‌వ‌రి 1నే బ‌డ్జెట్‌:ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌లుండ‌వు | budget on feb 1 no announcemetnts for poll bound states

Sweeping aside objections raised by opposition parties, the government will present the Union Budget 2017-18 on February 1 but will refrain from making any announcements pertaining to poll-bound States.
Story first published: Thursday, January 19, 2017, 21:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X