For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్పొరేట్ ప‌న్ను 30 నుంచి 25 శాతానికా?

2017-18 సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కార్పొరేట్ ప‌న్ను రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని డెలాయిట్ సంస్థ అంచ‌నా వేసింది. ఈ ఏడాది కార్పొరేట్ ప‌న్నును చెప్పుకోద‌గ్గ స్థాయిలో

|

పెద్ద‌నోట్ల రద్దు కార‌ణంగా సామాన్యుల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌ల వృద్దిలో స్వ‌ల్ప మంద‌గ‌మ‌నం ఏర్ప‌డింది. డిమాండ్‌లో ఏర్ప‌డిన ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని 2017-18 సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కార్పొరేట్ ప‌న్ను రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని డెలాయిట్ సంస్థ అంచ‌నా వేసింది. ఈ ఏడాది కార్పొరేట్ ప‌న్నును చెప్పుకోద‌గ్గ స్థాయిలో త‌గ్గించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది పేర్కొన్నారు.

ప‌న్ను రేట్లు త‌గ్గించ‌డం స‌మంజ‌స‌మే

ప‌న్ను రేట్లు త‌గ్గించ‌డం స‌మంజ‌స‌మే

న‌ల్ల‌ధ‌నాన్ని అన్ని విధాలా త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో ప‌న్ను రేట్లు త‌గ్గించ‌డం స‌మంజ‌స‌మేన‌ని డెలాయిట్ నివేదిక‌లో త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్ర‌భుత్వానికి వ‌చ్చే రాబడిలో కార్పొరేట్ పన్ను ద్వారా స‌మ‌కూరే ఆదాయం 19 శాతం మేర ఉంది. ఆదాయపు ప‌న్ను వాటా 14 శాతంగా ఉంది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిమాండ్ బాగా త‌గ్గి, ఆర్థిక వ్య‌వ‌స్థలో వృద్ది క్షీణిస్తుంద‌న్న భ‌యాలు నెల‌కొన్నాయి.

 డిమాండ్‌పై ప‌డిన ప్ర‌తికూల ప్రభావాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు

డిమాండ్‌పై ప‌డిన ప్ర‌తికూల ప్రభావాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు

ఈ నేప‌థ్యంలో డిమాండ్‌పై ప‌డిన ప్ర‌తికూల ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో త‌గిన చ‌ర్య‌ల‌ను చేపట్ట‌వ‌చ్చ‌ని స‌ర్వేలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను పూర్తిగా ఎత్తివేయ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని 40 శాతం మంది అన్నారు. వృద్దికి దోహ‌ద‌ప‌డే మౌలిక, గ్రామీణాభివృద్ది త‌దిత‌ర రంగాల‌కు ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను కొన‌సాగించాల‌ని మెజారిటీ ప్ర‌జ‌లు అభిల‌షించారు. మౌలిక రంగానికి ప్రోత్సాహ‌కాల‌ను తొల‌గించ‌కుండా ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను కొన‌సాగించేందుకు గాను పెట్టుబ‌డితో అనుసంధానించ‌వ‌చ్చ‌ని సూచించారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాన్ని అభివృద్ది కోసం వినియోగించాల‌ని, ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పెట్టుబ‌డుల డిమాండ్ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని 66% మంది పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఈసారి స‌బ్సిడీ వ్య‌యాల‌ను పెంచే అవ‌కాశం ఉంద‌ని ఆరు శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

 ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను క‌ల్పించాలి: టూర్ ఆప‌రేట‌ర్లు

ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను క‌ల్పించాలి: టూర్ ఆప‌రేట‌ర్లు

విదేశీ మార‌క రాబ‌డుల‌పై సేవా ప‌న్నును మిన‌హాయించాల‌ని ట్రావెల్‌,టూర్ ఆప‌రేట‌ర్లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. పొరుగు దేశాలు నిర్ణయించిన జిఎస్‌టి/వ్యాట్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్లపై జిఎస్‌టి రేటును నిర్ణయించాలని సూచిస్తున్నారు.

 కస్టమ్స్‌ సుంకాన్ని పెంచాలి: క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ ఇండ‌స్ట్రీ

కస్టమ్స్‌ సుంకాన్ని పెంచాలి: క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ ఇండ‌స్ట్రీ

దిగుమతులు తగ్గే విధంగా బేసిక్‌ కస్టమ్స్‌ సుం కాన్ని రెండింతలు పెంచి 20 శాతానికి చేర్చాలని అప్లయెన్సెస్‌ అండ్‌ కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతోంది. ఈ చర్య వల్ల దిగుమతులు తగ్గడమేకాకుండా దేశీయంగా మాన్యుఫ్యాక్చరింగ్‌ పెరగడానికి అవకాశంఉంటుందని పేర్కొంది. తయారీ ప్రణాళికను అమలు చేసి విడిభాగాల తయారీని పెంచాలని కోరారు.

English summary

కార్పొరేట్ ప‌న్ను 30 నుంచి 25 శాతానికా? | Jaitley may lower corporate tax in Budget: Deloitte

Finance Minister Arun Jaitley may address the transient pain of demonetisation by cutting corporate tax rates when he presents the Budget for 2017-18 in just over two weeks time.Jaitley in his second Budget speech in February 2015 had announced phasing out of tax incentives with effect from April 1, 2017 and reducing the corporate tax rate from 30 per cent to 25 per cent.
Story first published: Monday, January 16, 2017, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X