For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్ల‌కు లాభాల క‌ళ‌

వ‌రుస‌గా రెండో రోజు మార్కెట్లో లాభాలు ఉర‌క‌లెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు లాభ‌ప‌డి 27,140 వద్ద నిలవగా, నిఫ్టీ 92 పాయింట్లు పుంజుకొని 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, లోహ‌

|

వ‌రుస‌గా రెండో రోజు మార్కెట్లో లాభాలు ఉర‌క‌లెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు లాభ‌ప‌డి 27,140 వద్ద నిలవగా, నిఫ్టీ 92 పాయింట్లు పుంజుకొని 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, లోహ‌, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. నెల రోజుల ముందుగానే సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో అంచనాలు కూడా పెరిగాయని, దీంతో పెట్ట‌బ‌డిదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, చివర్లో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పురోగమించడం చెప్పుకోద‌గ్గ అంశం.

Sensex ends higher by 241 points; Coal India, Tata Steel stocks rally

బీఎస్ఈలో ఐటీ తప్ప అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. లోహ రంగ సూచీ అత్య‌ధికంగా 4.42%, బ్యాంకింగ్ 2.4%, పీఎస్‌యూ 1.72%, మూల‌ధ‌న వ‌స్తు రంగం(1.39%) బాగా లాభ‌ప‌డ‌గా; ఐటీ రంగ సూచీ 0.02% న‌ష్ట‌పోయింది.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో కోల్ ఇండియా(5.41%), టాటా స్టీల్‌(3.99%), లుపిన్‌(2.2%), ఎల్ అండ్ టీ(1.91%), ఐసీఐసీఐ బ్యాంకు(1.79%) ముందుండ‌గా; బ‌జాజ్ ఆటో(0.85%), ఐటీసీ(0.56%), రిల‌య‌న్స్‌(0.28%), ఓఎన్‌జీసీ(0.18%), ఇన్ఫోసిస్‌(0.16%) బాగా న‌ష్ట‌పోయాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ యథాతథంగా నిలవగా, మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌ 4.3 శాతం పెరిగింది. మొత్తం స్టీల్‌ సామర్థ్యంలో 9 శాతానికి సమానమైన మధ్యస్థాయి ఫర్నేస్‌లను దేశవ్యాప్తంగా మూసివేసేందుకు చైనా నిర్ణయించడంతో లోహ రంగానికి లాభించింది. దీనికి 2.3 శాతం జంప్‌చేసిన బ్యాంక్‌ నిఫ్టీ జత కలవడంతో మార్కెట్లు లాభాలతో పురోగమించాయి. కాగా, ఇటీవల లాభాలతో ప‌రుగులు తీస్తున్న షుగర్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడం గమనించదగ్గ ప‌రిణామం.

English summary

వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్ల‌కు లాభాల క‌ళ‌ | Sensex ends higher by 241 points; Coal India, Tata Steel stocks rally

The Sensex and Nifty ended with gains for a second straight session on Wednesday, after hitting a two-month high, tracking Asian peers ahead of US President-elect Donald Trump's news conference later in the day in which he will outline his policies.The 30-share BSE index Sensex ended higher by 240.85 points or 0.9 per cent at 27,140.41 and the 50-share NSE index Nifty closed up by 92.05 points or 1.11 per cent at 8,380.65.
Story first published: Wednesday, January 11, 2017, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X