For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ ఈ ఏడాది 29వేల‌కు : డ‌చ్ బ్యాంక్‌

దేశీయ మార్కెట్లు దూసుకెళతాయ‌ని, 2017 చివ‌రి నాటికి సెన్సెక్స్ 29వేల మార్కును తాకుతుంద‌ని డ‌చ్ బ్యాంకు అంచ‌నా వేస్తోంది. ఏడాది ప్ర‌థ‌మార్థం మొత్తం ఒడిదుడుకుల‌కు లోనై, ద్వితీయ అర్థ భాగంలో మార్కెట్లు

|

దేశీయ మార్కెట్లు దూసుకెళతాయ‌ని, 2017 చివ‌రి నాటికి సెన్సెక్స్ 29వేల మార్కును తాకుతుంద‌ని డ‌చ్ బ్యాంకు అంచ‌నా వేస్తోంది. ఏడాది ప్ర‌థ‌మార్థం మొత్తం ఒడిదుడుకుల‌కు లోనై, ద్వితీయ అర్థ భాగంలో మార్కెట్లు రిక‌వ‌ర్ అవుతాయ‌ని డ‌చ్ బ్యాంక్ ఇండియా ఈక్విటీ స్ట్రేట‌జీ రిపోర్ట్‌,2017 అధ్య‌య‌నం పేర్కొంది.

Sensex to touch 29,000 by year-end: Deutsche Bank

"డిసెంబ‌రు టార్గెట్ 2017గా సెట్ చేశాం. ఏడాది రెండో అర్ధ‌భాగంలో మార్కెట్లు పుంజుకుంటాయి. ప‌న్ను విధానాల‌కు సంబంధించి బడ్జెట్‌లో సానుకూల స్పంద‌న వ‌స్తే త‌ప్ప ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నాలుగో త్రైమాసికం సాధార‌ణ స్థితికి చేరుకోలేదు" అని డ‌చ్ బ్యాంకు నివేదిక వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయంగా చూస్తే ట్రంప్ అమెరికా ఆర్థిక విధానాలు, ఫ్రాన్స్ మ‌రియు జ‌ర్మ‌నీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, బ్రెగ్జిట్ ప‌రిణామాల‌ను ఇంగ్లాండ్ ఎలా చ‌క్క‌దిద్ద‌గ‌ల‌దో అన్న అంశాలు ఈక్విటీ మార్కెట్ల‌పై ప్ర‌భావాన్ని చూప‌గ‌ల‌వు. దేశీయంగా చూస్తే మార్చిలో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు, ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్‌, జీఎస్‌టీ అమ‌లుకు జ‌రిగే స‌న్నాహాలు మార్కెటు సెంటిమెంట్‌ను నిర్దేశిస్తాయి. బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 1 న ప్ర‌వేశ‌పెట్ట‌నుండ‌గా, మార్చి 11 నుంచి ఎన్నిక‌ల షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

Read more about: sensex nifty
English summary

సెన్సెక్స్ ఈ ఏడాది 29వేల‌కు : డ‌చ్ బ్యాంక్‌ | Sensex to touch 29,000 by year-end says Deutsche Bank

Sensex to touch 29,000 by year-end says Deutsche Bank“We expect the market to move in a narrow range during 2017, with recovery likely in the latter part of the year,” Deutsche Bank said in a research note adding, “We are setting December 2017 Sensex target of 29,000 (around 8 per cent upside) implying PE of 16.4 times on 2017-18 EPS,” the report said.
Story first published: Tuesday, January 10, 2017, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X