For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న్ను చెల్లింపుదార్ల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి

వివిధ మార్గాల్లో పన్ను ఎగ‌వేత‌దార్లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు దారులు మూసేందుకు ప్ర‌భుత్వం భిన్న మార్గాల‌ను అన్వేషిస్తోంది. అన్ని బ్యాంకుల ఖాతాదార్ల నుంచి త‌ప్ప‌నిసరిగా ఫిబ్ర‌వ‌రి 28 లోపు పాన్ కార్డు వ

|

వివిధ మార్గాల్లో పన్ను ఎగ‌వేత‌దార్లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు దారులు మూసేందుకు ప్ర‌భుత్వం భిన్న మార్గాల‌ను అన్వేషిస్తోంది. అన్ని బ్యాంకుల ఖాతాదార్ల నుంచి త‌ప్ప‌నిసరిగా ఫిబ్ర‌వ‌రి 28 లోపు పాన్ కార్డు వివ‌రాల‌ను సేక‌రించాల‌ని కేంద్రం ఆదేశించింది. ఒక వేళ పాన్ లేక‌పోతే పాన్ అప్లై చేసిన‌ట్లు చూపే ద‌ర‌ఖాస్తు లేదా ఎక్కువ డిపాజిట్లు చేసిన వారి నుంచి ఫారం 60 ని సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య విష‌యాలు

 ప‌న్ను చెల్లింపుదార్ల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి

మ‌రో వైపుకేంద్ర ఎక్సయిజ్‌ సుంకం, సేవా పన్ను చెల్లింపుదారులకు పాన్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. జీఎస్టీ పరిధిలోకి రావడానికి ముందే పాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచే జీఎస్టీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న కేంద్ర ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ బోర్డు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై కేంద్ర ఎక్సయిజ్‌, సేవా పన్నులు జీఎస్టీలో విలీనమవుతుండటంతో రెండు పన్నులు చెల్లిస్తున్న వారంతా కొత్త విధానంలోకి మారేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నెంబరు కేటాయిస్తోంది సీబీఈసీ. పన్ను చెల్లింపుదారులకు తాత్కాలిక ఐడీ, పాస్‌వర్డ్‌ కూడా ఇస్తారు. పన్ను చెల్లింపుదారులందరూ జీఎస్టీలోకి మారేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించింది.

Read more about: tax pan cbec
English summary

ప‌న్ను చెల్లింపుదార్ల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి | PAN Is Mandatory: Govt Asks Banks To Obtain PAN From Account Holders

Tightening the noose around tax evaders, the government has asked banks to obtain permanent account number (PAN) or Form-60 if PAN is not available, from all bank account holders by February 28, 2017.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X