For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల డిపాజిట్ల‌పై వూహాగానాల‌ను కొట్టిపారేసిన ఆర్‌బీఐ

ఆర్‌బీఐ స్పందించింది. దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ మొత్తంలో 86 శాతానికి సమానం అయిన రూ.15.4 లక్షల కోట్లను రద్దు చేస్తే... ఆ మొత్తం అంతా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయ‌నే వాద‌న‌ల‌ను ఖండించింది.

|

నవంబ‌ర్ 8న పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాల్లో జ‌మ అయిన నోట్ల‌పై వ‌స్తున్న వూహాగానాల‌పై ఆర్‌బీఐ స్పందించింది. దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ మొత్తంలో 86 శాతానికి సమానం అయిన రూ.15.4 లక్షల కోట్లను రద్దు చేస్తే... ఆ మొత్తం అంతా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయ‌నే వాద‌న‌ల‌ను ఖండించింది. ఆయా వార్తా సంస్థలు వెల్లడించిన నివేదికలు సరైనవి కావని తేల్చేసింది రిజ‌ర్వ్‌బ్యాంక్‌. తుది గడువు డిసెంబర్ 30 తర్వాత.. ఇటు తాము కానీ... ఇటు ప్రభుత్వం కానీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత నోట్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని ఆర్‌బీఐ వివ‌రించింది.

నోట్ల డిపాజిట్ల‌పై వూహాగానాల‌ను కొట్టిపారేసిన ఆర్‌బీఐ

పాత నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో జమ అవుతున్న నోట్ల వివరాలను లెక్కించే ప్రక్రియను.. మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నామని కేంద్ర బ్యాంకు వెల్ల‌డించింది. జ‌మ అయిన న‌గ‌దుకు సంబంధించి లెక్కింపులో త‌ప్పులు, లేదా రెండు సార్లు లెక్క‌ప‌పెట్ట‌డం వంటి పొర‌పాట్లు జ‌రిగేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆర్‌బీఐ వివ‌రించింది. అలాంటి త‌ప్పుల‌ను తొలగిస్తూ రద్దయిన నోట్లను లెక్కిస్తున్నామని అత్యున్నత బ్యాంక్ తెలిపింది.

Read more about: rbi notes currency
English summary

నోట్ల డిపాజిట్ల‌పై వూహాగానాల‌ను కొట్టిపారేసిన ఆర్‌బీఐ | How many old notes did people deposit? RBI says it is still counting them

The Reserve Bank of India (RBI) on Thursday clarified it was still counting how many old notes have been returned to the banking system, to eliminate double counting. Therefore, it said the numbers being quoted should not be construed as verified. RBI is reconciling the numbers provided by banks against the actual cash stashed in currency chests.
Story first published: Friday, January 6, 2017, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X