For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత నోట్లు ఉంటే భారీ జ‌రిమానా: రూ. 50 వేల జ‌రిమానాకు ప్ర‌తిపాద‌న‌

తుది గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. ఆ తరువాత ఈ నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కావని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబరు 30 తర్వాత ఎవరి వద్దైనా రూ.500, రూ.1000 పాత నోట్లు ఎక్కువ‌గా ఉంటే జరిమానా

|

ఇప్ప‌టికే న‌గ‌దు కొర‌త‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రద్దైన పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే తుది గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. ఆ తరువాత ఈ నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కావని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబరు 30 తర్వాత ఎవరి వద్దైనా రూ.500, రూ.1000 పాత నోట్లు ఎక్కువ‌గా ఉంటే జరిమానా విధించనున్నారు. పాతవ‌న్నీ క‌లిపి పెద్ద నోట్ల విలువ రూ. 10 వేల‌కు మించ‌కూడ‌దు. మించితే జరిమానా విధిస్తారు. ఈ విధంగా ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం.

అమ్మో! మోదీ హెచ్చ‌రిక త‌ర్వాత కూడా న‌ల్ల‌ధ‌నం మార్చుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారా?అమ్మో! మోదీ హెచ్చ‌రిక త‌ర్వాత కూడా న‌ల్ల‌ధ‌నం మార్చుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారా?

రద్దైన పాత పెద్ద నోట్లు డిసెంబర్ 30 తర్వాత పది వేలకుపైగా కలిగి ఉన్నా, ఎవరికైనా ఇచ్చినా, తీసుకున్నా చట్టరీత్యా నేరం. దీనిపై రూ.50,000 జ‌రిమానా లేదా ఎంత డబ్బులుంటే దానికి ఐదు రెట్ల జరిమానా విధించే అవకాశముంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా కేంద్రం దీనిపై ఓ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని సమాచారం. ర‌ద్ద‌యిన నోట్ల‌ను మార్చి,31 వ‌ర‌కూ మార్చుకోవడానికి అవ‌కాశ‌మున్నా ఆ గ‌డువును త‌గ్గిస్తార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి.

Read more about: currency rbi notes
English summary

పాత నోట్లు ఉంటే భారీ జ‌రిమానా: రూ. 50 వేల జ‌రిమానాకు ప్ర‌తిపాద‌న‌ | Possession of old notes after December 30 may invite penalty of over Rs 50,000

The government is mulling an ordinance to bring a new law under which possessing, transferring or receiving over Rs 10,000 in banned 500 and 1,000-rupee notes post December 30 will be a punishable offence.
Story first published: Tuesday, December 27, 2016, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X