English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

బంగారం నిల్వ‌ల్లో టాప్‌-10 దేశాలు ఇవే...

ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో అమెరికా, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఫ్రాన్స్‌,చైనా మొద‌టి 5 స్థానాలు కలిగి ఉన్నాయి. వాడ‌కంలో భార‌తీయులు ముందున్నా మ‌న దేశంలో నిల్వ‌లు అంత‌గా లేవు. 2010 నుంచి మొద‌ల

Written by: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో అమెరికా, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఫ్రాన్స్‌,చైనా మొద‌టి 5 స్థానాలు కలిగి ఉన్నాయి. వాడ‌కంలో భార‌తీయులు ముందున్నా మ‌న దేశంలో నిల్వ‌లు అంత‌గా లేవు. 2010 నుంచి మొద‌లుకొని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని ఎక్కువ‌గా కొని నిల్వ చేస్తున్నాయి. ఒక్క 2015లోనే అన్ని దేశాలు క‌లిసి 483 ట‌న్నుల బంగారాన్ని కొని పెట్టుకున్నాయి. ఏ ఏడాదిలోనైనా రెండో అత్య‌ధిక కొనుగోలు ఇదే. సింహ భాగాన్ని ర‌ష్యా, చైనా కొనుగోలు చేశాయి. వ‌రల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంది. ఆయా లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచంలో ఎక్కువ బంగారు నిల్వ‌ల‌ను క‌లిగిన దేశాల వివ‌రాల‌ను ఇక్క‌డ చూద్దాం.

10. భార‌త‌దేశం

నిల్వ‌: 557.7 ట‌న్నులు
మొత్తం విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 6.3%
ప్ర‌పంచంలోనే అత్య‌ధిక బంగారాన్ని కొని పెట్టుకునే వాటిలో మ‌న ఆర్‌బీఐ ఒక‌టి. బంగారాన్ని వినియోగించే దేశాల్లో భార‌త్‌ ప్ర‌పంచంలో రెండో స్థానంలో ఉంది. బంగారం వ్యాపారానికి అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌రు నెల వ‌ర‌కూ మ‌న దేశంలో అత్య‌ధిక డిమాండ్ ఉంటుంది. భార‌త దేశ జ‌నాభా 2016 అంచ‌నాల ప్ర‌కారం 129 కోట్ల‌కు పైనే.
5600 బిలియ‌న్ డాల‌ర్ల‌తో సంప‌ద ప‌రంగా ఏడో స్థానంలో నిలిచింది. సంప‌ద‌లో మ‌న దేశం చెప్పుకోద‌గ్గ పురోగ‌తి ఉంద‌ని వర‌ల్డ్ వెల్త్‌ నివేదిక పేర్కొంది.

9. నెద‌ర్లాండ్స్

నిల్వ‌: 612.5 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం::61.2 శాతం.
బంగారం నిల్వ చేసే ప్ర‌దేశాల‌ను స‌రికొత్త‌గా తీర్చిదిద్దేందుకు ఆ దేశ డ‌చ్ సెంట్ర‌ల్ బ్యాంకు వేరే ప్ర‌దేశాల వెదుకులాట‌లో ఉంది. దీన్ని చాలా మంది న‌మ్మ‌లేక‌పోవ‌చ్చు. దీని కోసం ఈ దేశం అమెరికాతో తాత్కాలిక ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ విధంగా అక్కడ నుంచి కొంచెం కొంచెం బంగారాన్ని వెన‌క్కు తెస్తోంది.

 

 

8. జ‌పాన్

నిల్వ‌: 765.2 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 2.4%
ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా జ‌పాన్ ఉంది. బంగారం నిల్వ‌ల్లో 8వ స్థానంలో ఉంది. బంగారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కొన‌డంలోనూ, అవ‌స‌రం లేన‌ప్పుడు అమ్మేయ‌డంలోనూ ఆ దేశ కేంద్ర బ్యాంకు చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ యేడాది జ‌న‌వ‌రిలో జపాన్ కేంద్ర బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డంతో ప్ర‌పంచం అంతా బంగారానికి డిమాండ్ పెరిగింది.

7. స్విట్జ‌ర్లాండ్‌

నిల్వ‌: 1040 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 6.7%
బంగారం నిల్వ‌ల్లో ఏడో స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ, త‌ల‌స‌రి ఒక్కో వ్య‌క్తికి ఉండే బంగారం లెక్క‌న చూస్తే స్విట్జ‌ర్లాండ్ అంత‌ర్జాతీయంగా మొద‌టి స్థానంలో ఉంది. రెండో ప్ర‌పంచ యుద్ద స‌మ‌యంలో ఈ దేశం యూర‌ప్ మొత్తానికి బంగారం వ్యాపార కేంద్రంగా త‌యార‌యింది. అప్పుడు త‌ట‌స్థంగా ఉండ‌టంతో రెండు వైపు దేశాల‌తో ఇది లావాదేవీల‌ను పెద్దఎత్తున సాగించింది. ప్ర‌స్తుతం ఎక్కువ శాతం గోల్డ్ ట్రేడింగ్ హాంగ్‌కాంగ్‌, చైనాల్లో జ‌రుగుతుంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంలో స్విస్ నేష‌న‌ల్ బ్యాంకు బంగారు నిల్వ‌ల ద్వారా 5.9 బిలియ‌న్ డాల‌ర్ల లాభాన్ని ఆర్జించింది.

6. ర‌ష్యా

నిల్వ‌: 1460.4 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 15%
గ‌త కొన్నేళ్లుగా బంగారం నిల్వ‌ల‌ను పెంచుకోవ‌డంలో ర‌ష్యా విప‌రీతంగా శ‌క్తుల‌న్నీ కూడ‌గ‌ట్టుకుంటోంది. 2015లో అత్య‌ధిక బంగారం(260 ట‌న్నులు) కొన్న దేశం ఇదే. యూఎస్ డాల‌రుకు ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర నిల్వ‌ల‌ను క‌లిగి ఉండే ప్ర‌ణాళిక‌లో భాగంగా ఆ దేశం ఈ విధంగా చేసింది. బంగారాన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేసేంద‌కు గాను డాల‌రు నిల్వ‌ల‌ను పెద్ద ఎత్తున అమ్మేసింది.

5. చైనా

నిల్వ‌: 1797.5 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 2.2%
2009 త‌ర్వాత ఆ దేశం బంగారం నిల్వ‌ల వివ‌రాల‌ను పంచుకోవ‌డం చైనా ఆపేసింది. దాని త‌ర్వాత మొద‌టిసారిగా 2015 వేస‌వి కాలం నుంచి ఆ దేశం బంగారం కొనుగోలు వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌సాగింది. 2015 డిసెంబ‌రులో అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ క‌రెన్సీల్లో డాల‌రు, యూరో,యెన్‌ల‌తో పాటు రెమిన్బి(యువాన్‌) వ‌చ్చి చేరింది. ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్ నెల‌లో చైనా యువాన్ డినామినేటెడ్ గోల్డ్ ఫిక్స్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌పంచంలో బంగారాన్ని అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేసే దేశం చైనాయే కావ‌డం గ‌మ‌నార్హం.

4. ఫ్రాన్స్‌

నిల్వ‌: 2435.7 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 62.9
గ‌త కొన్నేళ్ల నుంచి ఫ్రాన్స్ కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ‌లు కొద్దికొద్దిగా విక్ర‌యిస్తున్నా ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో 60 శాతానికి పైగా బంగారం ఉంది. కేవ‌లం ఎక్కువ‌గా ఉన్న బంగారాన్ని కొద్దికొద్దిగా త‌గ్గించ‌డ‌మే కాకుండా విదేశాల్లో వాల్ట‌ల్లో బంగారాన్ని వెన‌క్కు తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఆ దేశాధ్య‌క్షుడు మారిన్ లె పెన్‌.

3. ఇట‌లీ

నిల్వ‌: 2451.8 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం:68%
6 నుంచి 7 కోట్ల మ‌ధ్య జ‌నాభా క‌లిగిన ఇట‌లీ మిశ్ర‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌. యూరో జోన్‌లో మూడో అతిపెద్ద దేశ‌మైన ఇట‌లీ ప్ర‌పంచంలో సంప‌ద‌లో 10 వ స్థానంలో ఉంది. ఈ దేశానికి యూరోపియ‌న్ సెంట్ర‌ల్ బ్యాంకు(ఈసీబీ)తో సత్సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈసీబీ అధ్య‌క్షుడు మారియో ద్రాఘి నుంచి మంచి మ‌ద్ద‌తు ఉంది.
ఎందుకంటే అత‌డు ఇంత‌కుముందు బ్యాంక్ ఆఫ్ ఇట‌లీ గ‌వ‌ర్నర్‌గా చేశారు. డాల‌రు ఒడిదుడుకుల నుంచి బంగారు మంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌నేది ఆయ‌న అభిప్రాయం.

2. జ‌ర్మ‌నీ

నిల్వ‌: 3381 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం:68.9%
విదేశీ స్టోరేజీల నుంచి నెద‌ర్లాండ్స్ నిల్వ‌ల‌న్నీ దేశానికి తెప్పించుకున్న విధంగానే జ‌ర్మ‌నీ సైతం అదే ప‌నిచేసింది. న్యూయార్క్‌, ప్యారిస్ ప్రాంతాల్లో ఉన్న నిల్వ‌ల‌ను కూడా స్వ‌దేశానికి ర‌ప్పించింది. ఆ దేశ కేంద్ర బ్యాంకు గ‌తేడాది కాలంలోనే 210 ట‌న్నుల‌ను వెన‌క్కి ర‌ప్పించింది. 2020 నాటికి మొత్తం నిల్వ‌ల‌ను దేశంలోనే స్టోర్ చేయాల‌నేది అస‌లు ప్ర‌ణాళిక‌గా ఉంది.

1. అమెరికా

నిల్వ‌: 8133.5 ట‌న్నులు
ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 74.9%
సంప‌ద‌కు స్వ‌ర్గ‌ధామం అమెరికా. 2015లో న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల సంపదతో ఏడో స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా అగ్ర‌స్థానంలో ఉంది. అమెరికాలో సింహ భాగం విదేశీ మార‌కం బంగారంలో ఉంటుంది. దాదాపు నాలుగింట మూడొంతులు బంగారం నిల్వ‌ల పైనే ఆ దేశ ఫారిన్ రిజర్వ్‌లు దాగి ఉన్నాయంటే ప‌సిడి నిల్వ‌ల‌కు ఆ దేశం ప్రాధాన్య‌త ఎంత వ‌ర‌కూ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇది కూడా చ‌ద‌వండి బంగారంపై పెట్టుబ‌డులు పెట్టండిలా...

Read more about: gold
Story first published: Saturday, December 24, 2016, 10:43 [IST]
English summary

TOP 10 countries with Highest gold reserves

Beginning in 2010, central banks around the world turned from being net sellers of gold to net buyers of gold. Last year they collectively added 483 tonnes—the second largest annual total since the end of the gold standard—with Russia and China accounting for most of the activity. The second half of 2015 saw the most robust purchasing on record, according to the World Gold Council (WGC).
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC