For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌గ‌టు బంగారు ఆస్తుల్లో ఫ‌స్ట్ కేర‌ళ, నెక్ట్స్ త‌మిళ‌నాడు

గ‌టు బీహారీయుల‌కంటే 18 రెట్లు ఎక్కువ బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు, న‌గ‌ల‌ను కేర‌ళ పౌరులు క‌లిగి ఉన్నారంట‌. కేర‌ళ స‌గ‌టు పౌరుల బంగారు, వెండి విలువ రూ. 1.61 ల‌క్ష‌లుగా లెక్క‌గ‌ట్టారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ని

|

దేశంలో ఏ రాష్ట్రం వ్య‌క్తుల కంటే కేర‌ళీయులకు బంగారం అంటే మోజు అంటే తెలుసు కానీ మ‌రీ ఇంత‌లా అనీ తెలీదు. ఇది చ‌దివితే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. స‌గ‌టు బీహారీయుల‌కంటే 18 రెట్లు ఎక్కువ బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు, న‌గ‌ల‌ను కేర‌ళ పౌరులు క‌లిగి ఉన్నారంట‌. కేర‌ళ స‌గ‌టు పౌరుల బంగారు, వెండి విలువ రూ. 1.61 ల‌క్ష‌లుగా లెక్క‌గ‌ట్టారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివిసించే కేర‌ళీయులు క‌లిగే ఉండే విలువైన లోహాల విలువ స‌గ‌టు బీహార్ ప‌ట్ట‌ణ పౌరుడి కంటే 15 రెట్లు ఎక్కువ‌. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ లెక్క‌ల్లోని విశ్లేష‌ణ‌లు. నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే సంస్థ‌(ఎన్ఎస్ఎస్‌వో) స‌గ‌టు కుటుంబ ఆస్తులు, అప్పులపై ఒక సామాజిక అధ్య‌య‌నాన్ని చేప‌ట్టింది. అందులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. దాని ప్ర‌కారం చూస్తే ప‌ట్ట‌ణ‌,గ్రామీణ ఏ వ‌ర్గీక‌ర‌ణ చూసిన ద‌క్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ ఉంది. దేశ గ్రామీణ స‌గ‌టు పౌరుడి వ‌ద్ద ఉండే బంగారం,వెండి వంటి లోహాల విలువ‌ రూ. 39,775గా ఉండ‌గా, ప‌ట్ట‌ణ ప్రాంత స‌గ‌టు రూ.85,474గా ఉంది. కేర‌ళ వాసులు గ్రామీణులైనా, ప‌ట్ట‌ణ వాసులైనా ఎక్కువ బంగారాన్ని క‌లిగి ఉన్నారు. అందులోని మ‌రిన్ని ముఖ్య‌మైన ముచ్చ‌ట‌గొలిపే అంశాలు మీ కోసం.

స‌గ‌టు బంగారాన్ని క‌లిగి ఉండ‌టంలో టాప్ 5 రాష్ట్రాలు(గ్రామీణ‌)

స‌గ‌టు బంగారాన్ని క‌లిగి ఉండ‌టంలో టాప్ 5 రాష్ట్రాలు(గ్రామీణ‌)

గ్రామీణుల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఇవి టాప్‌

  • కేర‌ళ రూ. 1,61,211
  • త‌మిళ‌నాడు రూ. 1,08,094
  • గోవా రూ. 1,06,327
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రూ. 71,089
  • గుజ‌రాత్ రూ.70,500
స‌గ‌టు బంగారాన్ని క‌లిగి ఉండ‌టంలో టాప్ 5 రాష్ట్రాలు (ప‌ట్ట‌ణ‌)

స‌గ‌టు బంగారాన్ని క‌లిగి ఉండ‌టంలో టాప్ 5 రాష్ట్రాలు (ప‌ట్ట‌ణ‌)

ప‌ట్ట‌ణ వాసుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఇవి

  • కేర‌ళ రూ.2,59,608
  • గోవా రూ. 2,00,346
  • త‌మిళ‌నాడు రూ. 1,86,738
  • తెలంగాణ రూ. 1,28,800
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రూ. 1,09,801
స‌గ‌టు బంగారాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉన్న రాష్ట్రాలు(గ్రామీణ‌)

స‌గ‌టు బంగారాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉన్న రాష్ట్రాలు(గ్రామీణ‌)

గ్రామీణ ప్రాంతాల‌ను చూస్తే

  • ప‌శ్చిమ బెంగాల్ రూ. 13,443
  • మేఘాల‌య రూ. 11,895
  • బీహార్ రూ. 8820
  • జార్ఖండ్ రూ. 7389
  • మిజోరాం రూ. 1801
స‌గ‌టు బంగారాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉన్న రాష్ట్రాలు(ప‌ట్ట‌ణ‌)

స‌గ‌టు బంగారాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉన్న రాష్ట్రాలు(ప‌ట్ట‌ణ‌)

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తక్కువ బంగారం క‌లిగి ఉన్నవి

  • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రూ. 28,803
  • మేఘాల‌య రూ. 26,623
  • నాగాలాండ్ రూ.25,545
  • బీహార్ రూ. 18,161
  • మిజోరాం రూ. 16,248

Read more about: gold బంగారం
English summary

స‌గ‌టు బంగారు ఆస్తుల్లో ఫ‌స్ట్ కేర‌ళ, నెక్ట్స్ త‌మిళ‌నాడు | South Indian states dominates in Average gold value with every person

An average rural household in Kerala owns gold and silver worth an estimated ₹1.61 lakh, nearly 18 times more than the holdings of a similar family in Bihar.An urban household in Kerala likewise holds precious metals and jewellery whose worth is nearly 15 times more than the value of the holdings of an urban household in Bihar.South Indian states dominates in Average gold value with every person
Story first published: Saturday, December 24, 2016, 17:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X