For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత‌నోట్ల‌తో ఆదాయ‌పు ప‌న్ను చెల్లించొచ్చు: ఐటీ శాఖ‌

పాత రూ.500, రూ. 1000 నోట్లతో ఆదాయపు పన్నును చెల్లించవచ్చు. ఈ సదుపాయం ఈ నెల 30వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం దేశంలో రద్దు చేసిన పాత నోట్లను కేవలం బ్యాంకులలో మాత్రమే డిపాజిట్ చేసే వీలుంది. అయితే.. వీటిని ఉ

|

పాత రూ.500, రూ. 1000 నోట్లతో ఆదాయపు పన్నును చెల్లించవచ్చు. ఈ సదుపాయం ఈ నెల 30వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం దేశంలో రద్దు చేసిన పాత నోట్లను కేవలం బ్యాంకులలో మాత్రమే డిపాజిట్ చేసే వీలుంది. అయితే.. వీటిని ఉపయోగించుకునేందుకు ఆర్థిక శాఖ ఓ వెసులు బాటు కల్పించింది. రద్దు చేసిన పాత రూ. 500, రూ. 1000 నోట్లను ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చని ఐటీ శాఖ‌ వెల్లడించింది. డిసెంబర్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని.. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది.

Govt allows use of old notes for tax payment under income disclosure scheme

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద చెల్లింపులు చేయాల‌నుకునేవారు.. పన్ను, సర్‌ఛార్జి, పెనాల్టీ, డిపాజిట్‌ కోసం పాత రూ. 500, రూ.100 నోట్లను డిసెంబరు 30 వరకు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటివరకూ లెక్కల్లో చూపని ఆదాయం, బ్యాంకు డిపాజిట్లను మార్చి 31, 2017 వరకూ వెల్లడించవచ్చంటూ 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన-2016' ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వెల్లడించని ఆదాయాన్ని ఇప్పుడు వెల్లడించి.. 50శాతం మొత్తాన్ని పన్ను రూపంలోను, దానిపై సర్‌ఛార్జ్‌ను చెల్లించాలి. మిగిల‌న 50 శాతంలో 25 శాతం మొత్తాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీలేని పథకంలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత దాన్ని వెన‌క్కు తీసుకోవ‌చ్చు.

Read more about: it currency notes
English summary

పాత‌నోట్ల‌తో ఆదాయ‌పు ప‌న్ను చెల్లించొచ్చు: ఐటీ శాఖ‌ | Govt allows use of old notes for tax payment under income disclosure scheme

The government on Monday allowed use of junked Rs500 and Rs1,000 notes till 30 December for paying tax on disclosures made under its new income disclosure scheme.Govt allows use of old notes for tax payment under income disclosure scheme
Story first published: Saturday, December 24, 2016, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X