For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ల్ల‌ధ‌నంపై పోరాటం: ప‌్ర‌భుత్వానికి ఉత్సాహానిచ్చే చర్య‌

న‌ల్ల కుబేరుల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా అనూహ్య స్పందన వస్తోంది. పాత నోట్ల రద్దు అనంతరం న‌ల్ల‌ధ‌నం క‌లిగిన వారి వివరాలు తెలిసిన వాళ్లు తమకు నేరుగా సమాచారం అంది

|

న‌ల్ల కుబేరుల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా అనూహ్య స్పందన వస్తోంది. పాత నోట్ల రద్దు అనంతరం న‌ల్ల‌ధ‌నం క‌లిగిన వారి వివరాలు తెలిసిన వాళ్లు తమకు నేరుగా సమాచారం అందించాలంటూ ప్రభుత్వం ఓ ఈ-మెయిల్ అడ్రస్‌ ప్రవేశపెట్టింది. శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచిన‌ blackmoneyinfo@incometax. gov మెయిల్ ఐడీకి మంచి స్పందన వస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-మెయిల్ అడ్రస్‌కు కేవలం 72 గంటల్లోనే 4,000 మెయిల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం.

black money menace

పన్ను అధికారులు, ఇతర విచారణ ఏజెన్సీలకు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, ఇతర అస్పష్టమైన ఆదాయ వివరాల గురించిన స‌మాచారం కూడా పెద్ద ఎత్తున వ‌స్తున్న‌ట్లు విత్త మంత్రిత్వ శాఖ‌ పేర్కొంది. డిపాజిట్ల చేసిన నివేదికలు తమకు రోజువారీ అందుతున్నాయని, దాని ప్రకారం ఏజెన్సీలు వీటిపై దృష్టిసారిస్తున్నట్టు ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. మంగ‌ళ‌వారం ఐటీ అధికారులు మ‌ధ్య‌ప్ర‌దేశ్ భాజ‌పా నేత సుశీల్ విశ్వానిపై జ‌రిపిన దాడుల్లో అత‌ని బ్యాంకు ఖాతాల్లో లెక్క చూప‌ని ఆదాయం బ‌య‌ట‌ప‌డింది. అధికారులు ప్ర‌జ‌ల నుంచి అందుతున్న స‌మాచారంతో పాటు అక్ర‌మ క‌రెన్సీ మార్పిడులు, హ‌వాలా లావాదేవీల‌పై డేగ క‌న్నుతో ప‌రిశీల‌న జ‌రుపుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి మోదీ చెప్పిన త‌ర్వాత కూడా న‌ల్ల‌ధ‌నాన్ని ఈ విధంగా మారుస్తున్నారా?
ఈ విధంగా వ‌చ్చిన‌ సమాచారంతో జరుపుతున్న దాడుల్లో కూడా భారీగా కొత్త, పాత నోట్లు, బంగారం నిల్వ‌లు బ‌య‌ట ప‌డుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణాల్లో బ్యాంకు అధికారులు సైతం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత దారులకు మరో చివరి అవకాశంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథక వివరాలు తెలుపుతూ ఈ ఈ-మెయిల్ అడ్రస్‌ను ప్రభుత్వం ప్రజలకు వెల్ల‌డించింది. న‌ల్ల కుబేరుల వివ‌రాలు తెలిసిన‌ వాళ్లునేరుగా ప్రభుత్వానికి సమాచారం అందించేలా దీన్ని ప్రవేశపెట్టినట్టు రెవెన్యూ కార్యదర్శ హస్ముఖ్ అథియా తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ బ్లాక్ మ‌నీకి సంబంధించి జ‌రిగిన దాడుల్లో ఐటీ, ఈడీ అధికారులు రూ. 250 కోట్ల‌కు పైగా సీజ్ చేశారు.న‌ల్ల‌ధ‌నంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ ప్రభుత్వం నవంబ‌రు8న‌ పాత నోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే.

English summary

న‌ల్ల‌ధ‌నంపై పోరాటం: ప‌్ర‌భుత్వానికి ఉత్సాహానిచ్చే చర్య‌ | Black money menace Government receives 4,000 emails in 72 hours says report

Three days after government made public an official email address to report any tipoffs related to black money holders, it has received around 4,000 messages, reports ET. The email ‘blackmoneyinfo@incometax. gov.in’ was launched by Central government on Friday so that people could report any information related to black money holders without revealing their identity.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X