For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌ల్ల‌ధ‌న కుబేరుల‌కు ప్ర‌భుత్వం నుంచి చివ‌రి అవ‌కాశం

న‌ల్ల‌ధ‌నం క‌లిగిన వారికి ప్ర‌భుత్వం తుది అవ‌కాశ‌మిచ్చింది. మార్చి చివ‌రిలోపు 50 శాతం ప‌న్ను చెల్లించ‌డం ద్వారా న‌ల్ల‌ధనాన్ని స‌క్ర‌మ‌మైనదానిగా మార్చుకోవాల‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీ

|

న‌ల్ల‌ధ‌నం క‌లిగిన వారికి ప్ర‌భుత్వం తుది అవ‌కాశ‌మిచ్చింది. మార్చి చివ‌రిలోపు 50 శాతం ప‌న్ను చెల్లించ‌డం ద్వారా న‌ల్ల‌ధనాన్ని స‌క్ర‌మ‌మైనదానిగా మార్చుకోవాల‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ప‌థ‌కాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా ఇబ్బందుల‌ను త‌ప్పించుకోవాల‌ని ప‌న్ను ఎగ‌వేత‌దార్లు ప్ర‌భుత్వ శిక్ష‌ల నుంచి వెసులుబాట్లు పొంద‌వ‌చ్చ‌ని చెప్పింది. కొత్త న‌ల్ల‌ధ‌న వెల్ల‌డి పథకాన్ని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా ప్రకటించారు. ఇది రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆదాయ వెల్లడికి గాను ఇచ్చిన ఈ అవకాశం మార్చి 31, 2017తో ముగిస్తుందని వెల్లడించారు. 50 శాతం పన్ను, జరిమానాతో ఈ గడువు లోపల ఆదాయాలను వెల్లడించాలని ఆయన సూచించారు. ఇలా వెల్లడించిన ఆదాయ సమాచారాన్ని బహిర్గతం చేయమని అధియా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పన్నుల చట్టం, 2016 లోని రెండవ సవరణకు రాష్ట్రప‌తి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిందని పేర్కొన్నారు.


నల్లదనం వివరాలను ప్రజలు కూడా ప్ర‌భుత్వానికి ర‌హ‌స్యంగా అందించవచ్చని తెలిపారు. దీనికోసం ఒక ప్ర‌త్యేక‌ ఈ- మెయిల్ ను కూడా క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నల్లధనంపై పోరులో ప్రజలు సమాచారం అందించాలనుకుంటే [email protected] అనే మెయిల్ ఐడీకి వివరాలు అందించాలని కోరారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజలు నల్లధనం సమాచారం అందించవచ్చని వెల్ల‌డించారు. ఇది కూడా చ‌ద‌వండి దేశంలో టాప్ 20 బ్రాండ్లు

Read more about: black money
English summary

న‌ల్ల‌ధ‌న కుబేరుల‌కు ప్ర‌భుత్వం నుంచి చివ‌రి అవ‌కాశం | Black Money Holders Get Last Chance To Disclose Till March 2017

Black Money Holders Get Last Chance To Disclose Till March 2017Offering one last chance to black money holders, the government on Friday said they have time until March-end to come clean by paying 50 per cent
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X