For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవైసీ వివరాలన్నీ ఒకేచోట ఉంచాల‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశం

బ్యాంకులో ఖాతా ప్రారంభించేందుకు కేవైసీ ప్ర‌క్రియ పూర్తిచేయాల్సిన విష‌యం అంద‌రికీ తెల‌సిందే. అందుకోసం ఫొటో, వ్యక్తిగత-చిరునామా ధ్రువీకరణలు, ఆధార్‌ వివరాలను స‌మ‌ర్పించాలి. ప్ర‌స్తుతం రూ. 50 వేల పైబ‌డి

|

బ్యాంకులో ఖాతా ప్రారంభించేందుకు కేవైసీ ప్ర‌క్రియ పూర్తిచేయాల్సిన విష‌యం అంద‌రికీ తెల‌సిందే. అందుకోసం ఫొటో, వ్యక్తిగత-చిరునామా ధ్రువీకరణలు, ఆధార్‌ వివరాలను స‌మ‌ర్పించాలి. ప్ర‌స్తుతం రూ. 50 వేల పైబ‌డి డిపాజిట్ల‌కు పాన్ కార్డు వివ‌రాల‌ను సైతం త‌ప్ప‌నిస‌రి చేశారు. సంబంధిత ఖాతాపై ఏదైనా విచారణ జరపాల్సి వచ్చినప్పుడు, ఇవే పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇప్పటివరకూ ఈ వివరాలను బ్యాంకుల వద్దే భ‌ద్ర‌ప‌రుస్తున్నారు. ఇకపై అన్ని బ్యాంకుల ఖాతాదారుల వివరాలు 'కేవైసీ కేంద్రీయ రికార్డుల రిజిస్ట్రీ' వద్ద నమోదు కానున్నాయి.

కేవైసీ వివరాలన్నీ ఒకేచోట ఉంచాల‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశం

జనవరి 1 నుంచి బ్యాంకులో ఖాతా ప్రారంభించే వ్యక్తుల కేవైసీలు తప్పనిసరిగా ఈ రిజిస్ట్రీకి అప్‌లోడ్‌ చేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల‌ను ఆదేశించింది. జనవరి నెల మొత్తంమీద జతచేరిన ఖాతాదారుల వివరాలు ఫిబ్రవరి 1 నాటికి అప్‌లోడ్‌ కావాల్సిందే. మిగిలిన ఆర్థిక సంస్థలు కూడా వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి నూతన ఖాతాదారుల వివరాలు అప్‌లోడ్‌ చేయాలని నిర్దేశించింది. ఖాతాదారుల పరిస్థితికి అనుగుణంగా ఈ-కేవైసీని కూడా అనుమతిస్తారు. ఇందుకు వన్‌టైమ్‌ పిన్‌ (ఓటీపీ)ని ఆధారం చేసుకుంటారు. అయితే ఈ ఖాతాదారుల డిపాజిట్‌ రూ.లక్షకు మించడానికి వీలుండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి ఖాతాదారులు తీసుకునే అన్ని రుణాల మొత్తం రూ.2 లక్షలు మించకూడదు.

Read more about: rbi kyc
English summary

కేవైసీ వివరాలన్నీ ఒకేచోట ఉంచాల‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశం | Reserve Bank allows lenders to start OTP-based e-KYC account opening

The Reserve Bank of India (RBI) has decided to allow one-time-pin (OTP) based e-KYC (electronic know your customer) for opening bank accounts.
Story first published: Friday, December 9, 2016, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X