For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017లో వేత‌నాల పెరుగుద‌ల త‌క్కువేన‌ట‌

ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుద‌ల త‌క్కువ‌గా ఉండొచ్చ‌ని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున 10శాతం మేర మాత్రమే పెరగొచ్చ‌ని తెలుస్

|

ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుద‌ల త‌క్కువ‌గా ఉండొచ్చ‌ని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున 10శాతం మేర మాత్రమే పెరగొచ్చ‌ని తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఈ పెరుగుదల 4.8 శాతంగా మాత్ర‌మే ఉండ‌గ‌ల‌ద‌ని ఆ నివేదిక పేర్కొంది. ఉద్యోగుల వేతనాల పెరుగుదల 10శాతం మేర ఉంటుందని, అయితే వాస్తవ పెరుగుదల కేవలం 4.8 శాతంగానే ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు 2017 సంవత్సరానికి వేతనాల పెరుగుదలపై రూపొందించిన అంచనా నివేదిక వెల్ల‌డించింది. ఇది కూడా చ‌ద‌వండి ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

 2017లో వేత‌నాల పెరుగుద‌ల త‌క్కువేన‌ట‌

ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగానే ఉంటుందని, అయితే మొత్తంమీద వేతనాల పెరుగుదల స్థిరీకరించాయని, రాబోయే రెండేళ్లలో 9.5-10.5 శాతం మధ్య ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు కంట్రీ మేనేజర్ అమర్ హలీమ్ తెలిపారు. కింది స్థాయి ఉద్యోగుల వేతనాల పెరుగదల ఎక్కువగా ఉండవచ్చని, ఆసియా దేశాలతో సహా మిగతా దేశాలతో పోలిస్తే ఈ స్థాయి ఉద్యోగుల వేతనాలు మ‌న దేశంలో కాస్త‌ తక్కువగా ఉన్నాయని హ‌లీమ్ చెప్పారు.కాగా, ఆసియాలో వేతనాల పెరుగుదల 6.1 శాతం మేర ఉండొచ్చని, గత ఏడాదితో పోలిస్తే ఇది 0.3 శాతం తక్కువని, అయితే వాస్తవ పెరుగుదల 4.3 శాతం ఉండవచ్చని కూడా ఆ నివేదిక తెలిపింది. వియత్నాం, థాయిలాండ్, ఇండోనేసియా లాంటి దేశాల్లో వాస్తవ వేతనాల పెరుగుదల అధికంగా ఉండొచ్చ‌ని ఆ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సగటున ఉద్యోగుల వేతనాల పెరుగుదల 2.3 శాతం మేర ఉంటుంద‌ని, గ‌త సంవ‌త్స‌ర‌ అంచనా 2.7 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అని ఆ నివేదిక తెలిపింది.

Read more about: salary
English summary

2017లో వేత‌నాల పెరుగుద‌ల త‌క్కువేన‌ట‌ | Employees in India may get lower salary hike next year says Report

Employees are expected to see an average 10 % increase in salary in 2017, lower than 10.3% rise this year, and after taking inflation into account, the hike would be a paltry 4.8 %, says a report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X