For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఎంఎంఐడీ లేకుండానే బ్యాంకు ఖాతాల‌కు న‌గ‌దు బ‌దిలీ- యూపీఐ ద్వారా

యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ ద్వారా ఆన్‌లైన్‌లో సుల‌భంగా డ‌బ్బులు ట్రాన్స్‌ ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టిదాకా డ‌బ్బులు పంప‌డానికి ఇమ్మీడియ‌ట్‌ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎంపీఎస్‌) అందుబాటులో ఉండేది. దీంతో వెంట‌

|

స్మార్ట్‌ఫోన్‌, ఇంట‌ర్నెట్ ఉంటే చాలు, క్ష‌ణాల్లో డ‌బ్బులు పంపించేందుకు యూపీఐ వ‌చ్చేసింది.
ఆన్‌లైన్‌లో డ‌బ్బులు పంపించ‌డానికి ఎన్నో స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చాయి. నెట్‌బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్‌ ఫ‌ర్ చేసుకోవ‌డానికి బ్యాంకులు వినియోగ‌దారుల‌కు ఎన్నో విధానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఖాతా నుంచి ఖాతాకు, వ్యాలెట్‌కు, వ్యాలెట్ల నుంచి ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ దైనందిన జీవితంలో చేసే వ్య‌వ‌హారం. ఇందుకోసం చాలా మంది డెస్క్‌టాప్‌, ల్యాప్ టాప్ వాడ‌టం ద్వారానే ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్నారు. ఇప్పుడు స‌రికొత్త‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ప‌ద్ద‌తి యూపీఐ విధానం. యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ ద్వారా ఆన్‌లైన్‌లో సుల‌భంగా డ‌బ్బులు ట్రాన్స్‌ ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టిదాకా డ‌బ్బులు పంప‌డానికి ఇమ్మీడియ‌ట్‌ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎంపీఎస్‌) అందుబాటులో ఉండేది. దీంతో వెంట‌నే డ‌బ్బులు పంపే వీలు ఉండేది. ఇప్పుడు ఐఎంపీఎస్‌కు మించిన ఆప్ష‌న్లతో వ‌చ్చేసింది యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌). ప్ర‌స్తుతం యూపీఐ సౌక‌ర్యాన్ని 30 కి పైగా బ్యాంకులు అందిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌, యాప్‌లు ఉండ‌గా దీని ప్ర‌త్యేక‌త ఏంట‌నే అనుమానం క‌ల‌గొచ్చు. దీనిలో ప్ర‌త్యేక‌త ఏంటంటే ఒక్క‌సారి యూపీఐ అడ్ర‌స్ ఉంటే ఎక్క‌డా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఖాతా వివ‌రాలు అవ‌స‌రం లేదు.

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యూపీఐ యాప్‌ను తీసుకుంటే...

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యూపీఐ యాప్‌ను తీసుకుంటే...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌లో అకౌంట్స్ ట్యాబ్‌లో యూపీఐ ఆప్ష‌న్ ఉంటుంది.

ఏ బ్యాంక్ యాప్ అయినా ఓపెన్ చేసి లాగిన్ అవ‌గానే యూపీఐ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే మీ మొబైల్‌ నెంబరును యాక్సెస్‌ చేసుకొని యాప్‌ ఖాతా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెనూలోని ‘యాడ్‌ అకౌంట్‌' ఆప్షన్‌లోకి వెళ్తే అక్కడ మీ మొబైల్‌ నెంబరుకు అనుబంధంగా ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత వర్చువల్‌ అడ్రెస్‌ను తయారు చేయమని అడుగుతుంది. మీకు ఎవరైనా డబ్బులు పంపాలంటే చెప్పాల్సిన అడ్రెస్‌ (మెయిల్‌ ఐడీ లాంటిదే) అది. అక్కడ మీకు నచ్చినట్లుగా వర్చువల్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవాలి. (ఉదాహరణకు:sekhar059@hdfcbank). ఆ తర్వాత యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేయడానికి అవసరమయ్యే పిన్‌ నంబరును జోడించాల్సి ఉంటుంది. దాని తర్వాత ‘సెట్‌ ఎం పిన్‌' ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ అడిగిన డెబిట్‌ కార్డు ప్రాథమిక వివరాలు ఇచ్చి ఎం పిన్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఈ ఆప్‌ ద్వారా ప్రతిసారి డబ్బులు పంపినప్పుడు ఈ ఎం పిన్‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది.

2. వ‌ర్చువ‌ల్ ఐడీ క్రియేష‌న్ ఇలా

2. వ‌ర్చువ‌ల్ ఐడీ క్రియేష‌న్ ఇలా

వ‌ర్చువ‌ల్ ఐడీ ఎక్కువగా వినియోగ‌దారులు పేరు, మొబైల్ నంబ‌రు క‌లిసి వ‌చ్చేలా పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంది. అక్క‌డ ఏ పేరు లేదా నంబ‌రు పెట్టాల‌నుకునేది మీ ఇష్టం. ఉదాహ‌ర‌ణ‌కు రంజిత్‌@ఐసీఐసీఐ లేదా 9848012345@యాక్సిస్ అని పెట్టుకోవ‌చ్చు.ఐసీఐసీఐ పాకెట్ వినియోగ‌దారులు ఉదాహ‌ర‌ణ‌కు సూర‌జ్‌007@పాకెట్ ఫార్మెట్‌లో యూపీఐ వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి వ‌ర్చువ‌ల్ ఐడీ క్రియేట్ చేసుకునేప్పుడు మాత్ర‌మే బ్యాంకు ఖాతా వివ‌రాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. దాని త‌ర్వాత ఎవ‌రికైనా డ‌బ్బులు పంపాల‌న్నా, ఎవ‌రి నుంచైనా డ‌బ్బులు స్వీక‌రించాల‌న్నా కేవ‌లం ఆ యూపీఐ అడ్ర‌స్ ఉంటే చాలు.

3. ఈ విధానం సుల‌భం, సుర‌క్షితం

3. ఈ విధానం సుల‌భం, సుర‌క్షితం

ఇంత‌కుముందు కంటే మ‌రింత సుల‌భంగా, సుర‌క్షితంగా పేమెంట్స్ మ‌రియు ఫండ్ ట్రాన్స్‌ ఫ‌ర్ చేయ‌డంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే చాలా బ్యాంకులు ఈ విధానాన్ని ఉప‌యోగిస్తున్నాయి. ఇప్ప‌టికే మీ బ్యాంకు మొబైల్ యాప్ వాడుతుంటే అందులోనే యూపీఐ ఆప్ష‌న్ సైతం ఉంటుంది. మీరు చేయాల్సింద‌ల్లా యునిక్ అడ్ర‌స్‌ను క్రియేట్ చేసుకోవ‌డ‌మే. షాపింగ్‌, క్యాబ్ బిల్లు, నెట్ బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల‌కు యూపీఐ ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

4. ఎం-పిన్ ప్రాధాన్య‌త‌

4. ఎం-పిన్ ప్రాధాన్య‌త‌

యూపీఐ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయ‌గానే యూజ‌ర్ నేమ్ మ‌రియు ఈమెయిల్ ఐడీల‌ను అడుగుతుంది. ఐడీ ఇవ్వ‌గానే ఎం-పిన్ ఎంట‌ర్ చేయాల్సిఉంటుంది. ఎం-పిన్ అంటే ఏటీఎమ్ పిన్ లాంటిది. ఇది ఎంట‌ర్ చేస్తేనే లావాదేవీ పూర్తి అవుతుంది. బ్యాంకు యాప్‌లు అప్‌టేడ్ అయి ఉంటేనే మీకు మీ బ్యాంక్ మొబైల్ యాప్‌లో యూపీఐ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

5. డ‌బ్బు పంపండిలా... (sending money)

5. డ‌బ్బు పంపండిలా... (sending money)

మొద‌ట సెంట్ మ‌నీ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ల‌బ్దిదారు(బెనిఫిసియ‌రీ) వ‌ర్చువ‌ల్ పేమెంట్ అడ్ర‌స్‌ను ఎంట‌ర్ చేయాలి. ఎంత సొమ్ము అనేది రాసి సెండ్‌పై క్లిక్ చేయాలి. వివ‌రాల‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేయండి.

రిమార్క్స్‌లో ఏ ఉద్దేశం అనేది రాసుకోవ‌చ్చు. అంతే క్ష‌ణాల్లో ల‌బ్దిదారుకు డ‌బ్బు జ‌మ‌వుతుంది.

6. యూపీఐ ద్వారా డ‌బ్బు పొంద‌డం ఎలా?

6. యూపీఐ ద్వారా డ‌బ్బు పొంద‌డం ఎలా?

క‌లెక్ట్ మ‌నీ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఎవ‌రి నుంచి డ‌బ్బులు పొందాల‌నుకుంటున్నారో వారి వ‌ర్చువ‌ల్ పేమెంట్ అడ్ర‌స్‌ను ఎంట‌ర్ చేయండి, ఎంత డ‌బ్బు అనేది రాయండి. క‌న్‌ఫ‌ర్మ్ చేయండి. రిమార్క్స్ అవ‌స‌ర‌మ‌నుకుంటే రాసుకోవ‌చ్చు. మీకు డ‌బ్బు ఎప్పుడు కావాల‌నే వివ‌రాల‌ను రాయండి. స‌బ్‌మిట్‌ను నొక్కండి. అవ‌త‌లివారు డ‌బ్బు పంపగానే మీ ఖాతాలో డ‌బ్బు జ‌మ అవుతుంది.

7. యూపీఐని మొద‌ట ప్ర‌వేశ‌పెట్టిన బ్యాంకులు

7. యూపీఐని మొద‌ట ప్ర‌వేశ‌పెట్టిన బ్యాంకులు

ఆంధ్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర, భార‌తీయ మ‌హిళా బ్యాంకు, కెన‌రా బ్యాంకు, క్యాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఫెడ‌ర‌ల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టీజేఎస్‌బీ స‌హ‌కారీ బ్యాంకు, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, క‌ర్ణాట‌క బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, సౌత్ ఇండియ‌న్ బ్యాంకు, విజ‌యా బ్యాంకు, యెస్ బ్యాంకు. ప్ర‌స్తుతం ఎస్‌బీఐ సైతం యూపీఐ సౌక‌ర్యాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.

Read more about: upi transfer money online
English summary

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, ఎంఎంఐడీ లేకుండానే బ్యాంకు ఖాతాల‌కు న‌గ‌దు బ‌దిలీ- యూపీఐ ద్వారా | What is UPI and steps to get started with UPI

UPI allows a customer to pay directly from a bank account to different merchants, both online and offline, without the hassle of typing credit card details, IFSC code, or net banking/wallet passwords.UPI is a payment system that allows money transfer between any two bank accounts by using a smartphone.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X