For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట‌ర్నెట్ లేకుండా పేటీఎమ్‌నుంచి న‌గ‌దు బ‌దిలీ ఎలా?

ఇంట‌ర్నెట్ ర‌హిత న‌గ‌దు బ‌దిలీ కోసం1800 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది సంస్థ. PayTM అకౌంట్ ఉన్నవారు ఈ నంబర్ కి డయల్ చేసి, ఒక 4 డిజిట్ సీక్రెట్ కోడ్ ని పొందవలసి ఉంటుంది.

|

పెద్ద నోట్ల ర‌ద్దుతో న‌గ‌దుకు విప‌రీత‌మైన కొర‌త ఏర్ప‌డింది. న‌గ‌దు లేక ఇబ్బందిప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు వ్యాలెట్లు, మొబైల్ యాప్‌లే ప్ర‌త్యామ్నాయాలుగా ఉంటున్నాయి. ఈ కోవ‌లో మొద‌టి వరుస‌లో పేటీఎమ్ ఉంది. PayTM అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా వివ‌రించే అవ‌స‌రం లేనంత పాప్యుల‌ర్ అయిపోయింది. గ‌త నెల రోజుల నుంచి ఈ మొబైల్ వ్యాలెట్ల‌ను వాడే జనాభా చాలా రెట్లు పెరిగింది. రీచార్జీలు, సినిమా టికెట్ల నుంచి, విమాన టికెట్ల దాకా, అన్ని ఖర్చులు PayTM ద్వారానే చెల్లిస్తున్నారు పట్టణ జనాభా. చేతిలో డ‌బ్బు లేనప్పుడు ఈ PayTM బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే రోజుకి వందల కోట్ల ట్రాన్ సాక్షన్స్ ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి.

రూపే కార్డుతో ఉన్న ఆఫ‌ర్లేంటి?రూపే కార్డుతో ఉన్న ఆఫ‌ర్లేంటి?

PayTM ద్వారా ఇతరులకి చెల్లించాలంటే, వారికి PayTM ఖాతా ఉండాల్సిందే. అంతేకాక, వారి మొబైల్ నంబర్ మనదగ్గర ఉండాలి, లేక QR Code ని స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మ‌న ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే అంద‌రి ద‌గ్గ‌ర అన్ని స‌మ‌యాల్లో ఇంట‌ర్నెట్ ఉండ‌క‌పోవ‌చ్చు. అయినా ఇప్పుడు అదేమీ పెద్ద స‌మ‌స్య కాదు. ఇంటర్నెట్ లేకుండా కూడా PayTM ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

ఇంట‌ర్నెట్ ర‌హిత న‌గ‌దు బ‌దిలీ కోసం 1800 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది ఆ సంస్థ. PayTM అకౌంట్ ఉన్నవారు ఈ నంబర్ కి డయల్ చేసి, ఒక 4 డిజిట్ సీక్రెట్ కోడ్ ని పొందవలసి ఉంటుంది. ఒక్కసారి సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాక, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా సరే, ఈ నంబర్ కి కాల్ చేసి, ఏ PayTM అకౌంట్ కి అయితే డబ్బులు పంపాలో, వారి PayTM అకౌంట్ ఉన్న మొబైల్ నంబర్ టైప్ చేసి డబ్బు పంపవచ్చు. అయితే మీ PayTM అకౌంట్లోకి డబ్బులు జమచేసుకోవడం మాత్రం ఇంటర్నెట్ మరియు యాప్ సహాయంతోనే చేసుకోవాలి.

 ఇంట‌ర్నెట్ లేకుండా పేటీఎమ్‌నుంచి న‌గ‌దు బ‌దిలీ ఎలా?

ఐఐటీ ప‌రీక్ష ఫీజు చెల్లింపుకూ పేటీఎమ్‌, ఎస్‌బీఐ బ‌డ్డీ
పెద్ద నోట్ల ర‌ద్దుతో విద్యార్థులు, వ్య‌వ‌సాయ దారులు ఎక్కువ ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ప్ర‌భుత్వ సంస్థ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు సీబీఎస్ఈ చేరింది. ఐఐటీ జేఈఈ ప‌రీక్ష ఫీజును చెల్లించేందుకు పేటీఎమ్‌ను వాడుకునే వెసులుబాటును ఇచ్చింది. విద్యార్థులు ద‌ర‌ఖాస్తు రుసుమును క్రెడిట్‌, డెబిట్ కార్డులు, ఈ-చ‌లానాతో పాటుగా ఈ-వాలెట్‌, పేటీఎమ్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన బ‌డ్డీ వంటి వాటిని వాడుకునేందుకు సీబీఎస్ఈ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచే క్ర‌మంలో భాగంగా ఈ ముంద‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఫీజు చెల్లించేందుకు పేటీఎమ్ వాడితే అద‌నంగా 1.5%; ఎస్‌బీఐ బ‌డ్డీ ద్వారా అయితే రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

Read more about: paytm wallet money
English summary

ఇంట‌ర్నెట్ లేకుండా పేటీఎమ్‌నుంచి న‌గ‌దు బ‌దిలీ ఎలా? | How to transfer Money in Paytm without internet and what is paytm

Paytm launches toll-free number to let you transfer money without internet connection; here’s how to use it. To enable feature phone users or people with iffy internet connection use the mobile wallet, Paytm has launched a toll-free number — 1800 1800 1234.
Story first published: Thursday, December 8, 2016, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X