For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఆర్‌సీటీసీ, బీమా సంస్థ‌ల ప్రీమియం డిజిట‌ల్ పేమెంట్లు చేస్తే 10% రాయితీ

నోట్ల ర‌ద్దు మొద‌లై నెల రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా గురువారం అరుణ్ జైట్లీ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేందుకు ప‌లు రాయితీల‌ను ప్ర‌క‌టించారు.

|

నోట్ల ర‌ద్దు మొద‌లై నెల రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా గురువారం అరుణ్ జైట్లీ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేందుకు ప‌లు రాయితీల‌ను ప్ర‌క‌టించారు.

కేంద్ర ప్ర‌భుత్వ డిజిట‌ల్ వ‌రాల జ‌ల్లు

నగదు లావాదేవీల నిర్వహణలో ఖ‌ర్చును భ‌రించ‌డం క‌ష్టం. అందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత 20 నుంచి 40 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు పెరిగాయని తెలిపారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు 11 సూత్రాలు రూపొందించినట్లు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులు ఈ-వ్యాలెట్లు, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో కొనుగోలు చేసే వారికి 0.75శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 10వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 2 పీవోఎస్‌ యంత్రాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలకు ఆర్‌బీఐ సరఫరా చేస్తోందని వెల్లడించారు. రూ. 2 వేల వ‌ర‌కూ క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీల‌కు సేవా ప‌న్నును ర‌ద్దు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ఆ 11న‌గ‌రాల్లో గృహ వ‌స‌తి గిరాకీ

సబర్బన్‌ రైళ్లలో నెల, ఏడాది సీజనల్‌ టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి రాయితీ ఇస్తామని, రైల్వేలో ఇప్పటి వరకు 58 శాతం మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారని వెల్ల‌డించారు. ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి రూ.10లక్షల బీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ చెల్లింపులతో రైల్వే క్యాటరింగ్‌, వసతి సౌకర్యం కోసం బుక్‌ చేస్తే 5శాతం, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే రాయితీలు క‌ల్పిస్తామని తెలిపారు. ఇది సాధార‌ణ బీమాకు 10 శాతం, జీవిత బీమాకు 8 శాతంగా ఉంటుంద‌ని అన్నారు. జనవరి 1 నుంచి ముంబయి సబర్బన్‌ రైళ్లలో రాయితీ విధానం అమల్లోకి వస్తుందనిజైట్లీ పేర్కొన్నారు.

Read more about: currency notes
English summary

ఐఆర్‌సీటీసీ, బీమా సంస్థ‌ల ప్రీమియం డిజిట‌ల్ పేమెంట్లు చేస్తే 10% రాయితీ | Buying petrol, insurance via digital mode to be cheaper Jaitley announced

10 per cent and 8 per cent discount will be offered in case of general and life insurance for buying new policy or paying premium online via PSUs websites. A discount of 0.75 per cent will be offered on purchase of petrol and diesel through either credit/debit cards, e-wallets and mobile wallets.Also credit/debit card transactions up to Rs. 2,000 will be exempt from service tax.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X