For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబిక్విక్ వాలెటేంటి? దాని ద్వారా న‌గ‌దు బ‌దిలీ, రీచార్జీ,బ‌స్ టికెట్ బుకింగ్ ఎలా చేయాలి ?

దాదాపు 70 వేలకు పైగా రిటైల‌ర్స్ మొబిక్విక్‌ యాప్ ద్వారా సేవ‌లందిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి MOBIKWIKని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మొబిక్విక్ వ్యాలెట్ బుక్‌మైషో, మేక్‌మైట్రిప్‌, డోమినోస్ పిజ్జా, ఈ

|

దాదాపు 70 వేలకు పైగా రిటైల‌ర్స్ మొబిక్విక్‌ యాప్ ద్వారా సేవ‌లందిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి MOBIKWIKని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మొబిక్విక్ వ్యాలెట్ బుక్‌మైషో, మేక్‌మైట్రిప్‌, డోమినోస్ పిజ్జా, ఈబే వంటి వ్యాపార సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యాల‌ను కుదుర్చుకుంది. మొబిక్విక్ ట్యాగ్‌లైన్ దేశ్ కా వ్యాలెట్‌. అంటే దేశం మొత్తం ఈ వ్యాలెట్ ద్వారా న‌గ‌దు ర‌హితంగా మారాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం. మ‌నీ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసే విధానాన్ని మొబిక్విక్ సుల‌భ‌త‌రం చేసింది. అయితే మొబిక్విక్ వ్యాలెట్ అంటే ఏమిటి? అది ఎలా ప‌నిచేస్తుంది? అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏదైనా రుసుము ఉంటుందా? అవ‌న్నీ ఇక్క‌డ తెలుసుకుందాం.

మొబిక్విక్ వ్యాలెటేంటి? దాన్ని ఎలా వాడుకోవాలి(మొబిక్విక్ ఆఫ‌ర్ల కోసం)

మొబిక్విక్ వ్యాలెటేంటి? దాన్ని ఎలా వాడుకోవాలి(మొబిక్విక్ ఆఫ‌ర్ల కోసం)

మొబిక్విక్ ఆఫ‌ర్ల కోసం

ఇది ఒక ఆన్‌లైన్ పేమెంట్ వ్యాలెట్‌. యూజ‌ర్ లాగిన్ అయిన త‌ర్వాత డెబిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డుల ద్వారా డ‌బ్బు జ‌మ చేసుకోవ‌చ్చు. ఈ మధ్య క్యాష్ డిపాజిట్ (పిక‌ప్‌) స‌దుపాయాన్ని సైతం ప్ర‌వేశ‌పెట్టారు.

వ్యాలెట్‌లో డ‌బ్బు జ‌మ‌యిన త‌ర్వాత ఈ లావాదేవీల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

మొబైల్, డీటీహెచ్ రీచార్జీ,డేటా కార్డు రీచార్జీ, బిల్లు చెల్లింపులు వంటి వాటిని చేసుకోవ‌చ్చు. మూవీ టిక్కెట్లను సైతం బుక్ చేయ‌వ‌చ్చు.

వీట‌న్నింటికి మీ వ్యాలెట్లో నుంచి డ‌బ్బు మిన‌హాయిస్తారు. దీంతో న‌గ‌దు ర‌హితంగా మీ

లావాదేవీల‌ను పూర్తిచేయొచ్చు.

మొబిక్విక్ వ్యాలెట్ ఎందుకు వాడాలి?

మొబిక్విక్ వ్యాలెట్ ఎందుకు వాడాలి?

ఇది ఒక సెక్యూర్ పేమెంట్ వ్య‌వ‌స్థ‌. చాలా ర‌కాల చెల్లింపుల‌కు దీన్ని వాడుకోవ‌చ్చు.

మొబైల్ రీచార్జీ, న‌గ‌దు బ‌దిలీ వంటి వాటిని వేగంగా నిర్వ‌హించుకోవ‌చ్చు.

దేశంలో అత్యంత వేగంగా, సౌక‌ర్య‌వంతంగా న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను దీని ద్వారా

చేసుకోవ‌చ్చు.

ప్ర‌స్తుతానికి 2.5 కోట్ల మంది మొబిక్విక్‌ను వాడుతున్నారు. ఇంకా జ‌మ అవుతున్నారు.

మొబిక్విక్ వ్యాలెట్‌కు న‌గ‌దు ఎలా జ‌మ చేయాలి?

మొబిక్విక్ వ్యాలెట్‌కు న‌గ‌దు ఎలా జ‌మ చేయాలి?

మీ లాగిన్ వివ‌రాల‌తో అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. మీకు ఖాతా లేక‌పోతే సైన్ అప్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని త‌ర్వాత లాగిన్ అవ్వొచ్చు.

యాడ్ మ‌నీ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్ష‌న్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సాయంతో న‌గ‌దును జ‌మ చేసుకోండి. త‌ర్వాత మీ లావాదేవీల్లో

అవ‌స‌ర‌మ‌య్యే చెల్లింపుల కోసం వ్యాలెట్ డ‌బ్బుల‌ను వాడుకోండి.

మొబిక్విక్ వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ ఎలా?

మొబిక్విక్ వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ ఎలా?

* మొబిక్విక్ ఖాతాలోకి లాగిన్ అవండి

* ట్రాన్స్‌ఫ‌ర్ మ‌నీ (Transfer Money) ఆప్ష‌న్‌ను ఎంచుకోండి

* వ్యాలెట్ టు బ్యాంక్‌(Wallet to Bank) ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేయండి

* ల‌బ్దిదారు(Beneficiary) బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను న‌మోదు చేయండి

* సెండ్ మ‌నీ(Send money) ఆప్ష‌న్‌పై క్లిక్ చేయండి

* మీ న‌మోదిత మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది.

* ఓటీపీ, డ‌బ్బు వివ‌రాలు న‌మోదు చేస్తే మీరు సూచించిన ఖాతాకు న‌గ‌దు బదిలీ అవుతుంది.

 మీరు బిల్లు చెల్లింపులు చేసేందుకు ప‌నికొచ్చే వ్యాలెట్లు మీరు బిల్లు చెల్లింపులు చేసేందుకు ప‌నికొచ్చే వ్యాలెట్లు

Read more about: wallet payment
English summary

మొబిక్విక్ వాలెటేంటి? దాని ద్వారా న‌గ‌దు బ‌దిలీ, రీచార్జీ,బ‌స్ టికెట్ బుకింగ్ ఎలా చేయాలి ? | What is Mobikwik Wallet? How To Transfer Money, Recharge Mobile, Book Bus Tickets Via Mobikwik

Mobikwik wallet with there tagline' Desh ka wallet' is pushing the entire nation to go cashless, By simplifying the process of transferring money online. But what is this Mobikwik wallet? How does it work? How to have a Mobikwik account? Are there any registration fees? lets get to know in detail
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X