For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌ర‌ప‌తి స‌మీక్షలో వ‌డ్డీ రేట్ల య‌థాత‌థంతో మార్కెట్లు దిగాలు

ఆర్‌బీఐ ప‌రప‌తి స‌మీక్ష వెంట‌నే మార్కెట్లు బాగా న‌ష్ట‌పోయాయి. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయింది. మ‌ళ్లీ పుంజుకొంది. ట్రేడింగ్ ముగిసేసరికి

|

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన పరపతి సమీక్షను చేపట్టిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) యథాతథ రేట్ల అమలుకే మొగ్గుచూప‌డంతో మార్కెట్లు న‌ష్టాల బాట ప‌ట్టాయి. రెపో రేటులో కనీసం పావు శాతం కోతను ఆశించిన పెట్టుబ‌డిదారులు యథాతథ పాలసీ అమలుతో నిరాశ‌కు గుర‌య్యారు. దీంతో కొనుగోళ్ల నుంచి దారి మార్చి అమ్మకాలకు తెరతీశారు. వెరసి మిడ్ సెషన్‌ వరకూ లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆపై ఒక్కసారిగా నష్టాల వైపుకి మళ్లాయి. మార్కెట్ ముగిసే స‌రికి స్వ‌ల్ప నష్టాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 156 పాయింట్లు(0.59%) కోల్పోయి 26,237 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 8102 వద్ద స్థిరపడింది. అయితే తొలుత ఒక దశలో 26,540 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌, 26165 వ‌ద్ద రోజులో క‌నిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ కూడా గరిష్టంగా 8,190ను, కనిష్టంగా 8077ను తాకింది.

ఆర్‌బీఐ ప‌రప‌తి స‌మీక్ష వెంట‌నే మార్కెట్లు బాగా న‌ష్ట‌పోయాయి. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయింది. మ‌ళ్లీ పుంజుకొంది.

 ప‌ర‌ప‌తి స‌మీక్షలో వ‌డ్డీ రేట్ల య‌థాత‌థంతో మార్కెట్లు దిగాలు

Read more about: sensex nifty
English summary

ప‌ర‌ప‌తి స‌మీక్షలో వ‌డ్డీ రేట్ల య‌థాత‌థంతో మార్కెట్లు దిగాలు | Sensex fallen 156 points as RBI keeps repo rate unchanged

RBI's move to keep its policy rates unchanged created shock in the domestic stock market with the benchmark Sensex falling over 300 points soon after the monetary policy announcement.But its recovered slightly and ended down by 155.89 points or 0.59 per cent at 26,236.87
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X