For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పావు శాతం కూడా త‌గ్గించ‌లేదు

అంతర్జాతీయ అనిశ్చిత ప‌రిస్థితులు నెల‌కొన్న‌ నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో య‌థాత‌థ స్థితికే మొగ్గుచూపింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. మంగళ, బుధవారాల్లో జరిగిన

|

అంతర్జాతీయ అనిశ్చిత ప‌రిస్థితులు నెల‌కొన్న‌ నేపథ్యంలో ఆర్‌బీఐ య‌థాత‌థ స్థితికే మొగ్గుచూపింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. మంగళ, బుధవారాల్లో జరిగిన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

 పావు శాతం కూడా త‌గ్గించ‌లేదు

రెపో రేటు 6.25శాతాన్ని ఆర్‌బీఐ అలాగే ఉంచింది. నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5శాతం ఉంటుందని క‌మిటీ అంచ‌నా వేసింది. 2016-17లో వృద్ధిరేటును 7.6 నుంచి 7.1 శాతానికి త‌గ్గించి అంచ‌నాల‌ను మార్చారు. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకుల‌కు డ‌బ్బు ఇచ్చేందుకు వ‌సూలు చేసే వ‌డ్డీ రేటు.పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ.11.55 లక్షల కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌కు మార్గాలు

ఆర్‌బీఐ స‌మీక్ష‌లోని ముఖ్యాంశాలు
* రెపోరేటు: 6.25% ; రివ‌ర్స్ రెపో రేటు : 5.75%
* సీఆర్ఆర్ (న‌గ‌దు నిల్వ‌ల నిష్ప‌త్తి) : 4%
* వృద్ది రేటు అంచ‌నాల త‌గ్గింపు: 7.6% నుంచి 7.1%(2016-17)
* ఆర్థిక సంవ‌త్స‌రానికి ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యం: 5%

ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌పంచంలో టాప్‌-10 మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ‌లివే...

నవంబ‌రు 8న కేంద్రం రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ అనూహ్య‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును కనీసం 25 బేసిస్‌ పాయింట్లు కోత విధిస్తుందని భావించారు. బ్యాంకర్లతో పాటు చాలా సంస్థలు ఇదే విధంగా ఊహించాయి. అంచనాలను తల్లకిందులు చేస్తూ రెపోరేటును 6.25% వ‌ద్దే ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటించారు.

Read more about: repo rate rbi
English summary

పావు శాతం కూడా త‌గ్గించ‌లేదు | Rbi unchanged interest rates this time also Repo rate same

The Reserve Bank of India (RBI) today left the repo rate unchanged, in what was a shock to economists and markets, which were largely expecting an interest rate cut. Repo rates are interest rates at which the RBI lends money to banks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X