For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

44 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు సానుకూలంగా ఉన్న‌ నేపథ్యంలో రోజు మొత్తం పటిష్టంగా కదిలిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు చివరికు స్వల్ప లాభాలతో ముగిశాయి. చివర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రధాన సూచీలు నామమాత్

|

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు సానుకూలంగా ఉన్న‌ నేపథ్యంలో రోజు మొత్తం పటిష్టంగా కదిలిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు చివరికు స్వల్ప లాభాలతో ముగిశాయి. చివర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రధాన సూచీలు నామమాత్ర లాభంతో సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 44 పాయింట్ల లాభంతో 26,393 వద్ద నిలవగా, నిఫ్టీ కూడా 14 పాయింట్లు బలపడి 8143 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8150 దిగువనే స్థిరపడింది.
రిజ‌ర్వ్ బ్యాంకు పరపతి సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సానుకూల ధోరణితో కదలాడాయని నిపుణులు తెలిపారు. అయితే ఆ తర్వాత తీవ్ర ఒడిదొడుకుల మ‌ధ్య సాగిన మార్కెట్‌ చివరకు స్వల్ప లాభాలతో ముగిసింది.

 44 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

అయితే మిడ్‌ సెషన్‌లో ఒక్కసారిగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 150 పాయింట్ల వరకూ పుంజుకుని 26,502 వద్ద గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ సైతం 50 పాయింట్లు ఎగసి 8178కు చేరింది. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండటం, వచ్చే వారం ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష వంటి అంశాల కారణంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

Read more about: sensex
English summary

44 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌ | Sensex ends slight gains RBI policy meet announcement awaited

Sensex failed to hold on to its early momentum and came off the day’s high due to profit-booking, but managed to close higher for the second day in a cautious trade ahead of the RBI policy meet announcement tomorrow amid mixed global cues.
Story first published: Tuesday, December 6, 2016, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X