For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజ‌య్ మాల్యాపై క్రిమిన‌ల్ కేసు పెట్టాలి:బ‌్యాంకు ఉద్యోగుల సంఘం

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాతో సహా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ‌వేసిన‌ 8,000 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అఖిల భారత బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం (ఎఐబీఈఏ) డిమాండ్‌ చేసింది. బ్యాంకులకు దాదా

|

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాతో సహా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ‌వేసిన‌ 8,000 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అఖిల భారత బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం (ఎఐబీఈఏ) డిమాండ్‌ చేసింది. బ్యాంకులకు దాదాపు రూ.80,000 కోట్ల రుణాల‌ను ఎగ్గొట్టిన ఆయా వ్య‌క్తుల‌ పేర్లు కూడా వెల్లడించాలని ఎఐఇబిఎ ప్రధాన కార్యదర్శి సివి వెంకటాచలం కోరారు. 'లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాతో సహా 8,000 మంది మొండి బ‌కాయిదారులు బ్యాంకులకు రూ.80,000 కోట్ల వరకు బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టారు. వీరందరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి' అన్నారు. ఆదివారం గోవాలో బ్యాంకింగ్‌ ఉద్యోగులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెంకటాచలం ఈ డిమాండ్‌ చేశారు.

వేత‌నంపై ప‌న్ను ఆదా కోసం ప‌లు ఉత్త‌మ మార్గాలు

 AIBEA pressing for announcement of loan defaulters

అంతే కాకుండా న‌ల్ల‌ధ‌నంపై సైతం బ్యాంకు ఉద్యోగుల సంఘం త‌న‌దైన అభిప్రాయాల‌ను వెల్ల‌డించింది. కేవ‌లం పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌ల్ల‌ధ‌నాన్ని ఏరివేయ‌డం సాధ్యం కాద‌ని తెలిపింది. అవినీతి, లంచ‌గొండిత‌నాన్ని త‌గ్గించ‌డంతో పాటు రిక‌వ‌రీ చ‌ట్టాల‌కు మార్పులు చేయాల్సి ఉంద‌ని సూచించింది. విజ‌య్ మాల్యా లాంటి రుణ ఎగ‌వేత‌దార్ల పేర్ల‌ను వెల్ల‌డించాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని కోరుతూ ఏఐబబీఈఏ తీర్మానం చేసింది.

Read more about: vijay mallya black money
English summary

విజ‌య్ మాల్యాపై క్రిమిన‌ల్ కేసు పెట్టాలి:బ‌్యాంకు ఉద్యోగుల సంఘం | AIBEA pressing for announcement of loan defaulters

“Black money cannot be weed out through demonetisation. For that you require stringent anti-corruption, anti-bribery and amendments to the existing recovery laws,” he said. Venkatchalam questioned why is government not disclosing the names of these black money holders and loan defaulters? “Why no criminal action is initiated? Why just civil case against Mallya?” he sought to know.
Story first published: Monday, December 5, 2016, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X