For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

329 పాయింట్ల న‌ష్టంలో సెన్సెక్స్‌, 8100 దిగువ‌న నిఫ్టీ

దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్ర‌వారం భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో నీరసంగా మొదలైన మార్కెట్లలో మిడ్ సెషన్‌ నుంచీ అమ్మకాలు వెల్తువెత్తాయి. అటు

|

దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్ర‌వారం భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో నీరసంగా మొదలైన మార్కెట్లలో మిడ్ సెషన్‌ నుంచీ అమ్మకాలు వెల్తువెత్తాయి. అటు ఆసియా, ఇటు యూరప్‌ మార్కెట్లు 1-1.5 శాతం మధ్య నష్టపోవడంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల నిరవధిక అమ్మకాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పెంపు అంచనాలు బలపడటం వంటి అంశాలు కూడా పెట్టుబ‌డిదార్ల‌లో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెప్పారు. ట్రేడింగ్‌ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 329 పాయింట్లు క్షీణించి 26,231 వద్ద నిలవగా, నిఫ్టీ106 పాయింట్లు దిగజారి 8,087 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 0.34% న‌ష్టపోగా, సెన్సెక్స్ 0.33% న‌ష్టాల‌కు గుర‌యింది.

Sensex Slumps 329 Points As US Bond Yields Surge

రంగాల వారీ చూస్తే క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(2.32%), ఎఫ్ఎమ్‌సీజీ(1.62%), ఆటో(వాహ‌న‌) రంగం(1.61%), మూల‌ధ‌న వ‌స్తురంగం(1.51%) న‌ష్ట‌పోయాయి. ఎక్కువ‌గా న‌ష్టోయిన షేర్లలో ఏసియ‌న్ పెయింట్స్‌(3.57%), మారుతి(3.44%), టాటా మోట‌ర్స్‌(3.37%), అదానీ పోర్ట్స్‌(3.13%), హెచ్‌డీఎఫ్‌సీ(2.35%) ఉన్నాయి. రిల‌య‌న్స్ ఉచిత ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో టెలికాం షేర్లు ఈ రోజు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇదిలా ఉండ‌గా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబ‌డిదారులు గురువాంర 402.62 కోట్ల రూపాయ‌ల విలువైన షేర్ల‌ను అమ్మేశారు.

Read more about: sensex nifty
English summary

329 పాయింట్ల న‌ష్టంలో సెన్సెక్స్‌, 8100 దిగువ‌న నిఫ్టీ | Sensex Slumps 329 Points As US Bond Yields Surge

The Sensex slumped 329 points, as Foreign Portfolio Investors continued to hammer down stocks. A rise in interest rates in the US is not good for emerging market economies as it leads to capital outflows.
Story first published: Friday, December 2, 2016, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X