For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వార‌స‌త్వంగా వ‌చ్చిన బంగారంపై ప‌న్ను లేదు, వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: ప‌్ర‌భుత్వం

బంగారంపై కేంద్రం పన్ను విధిస్తుందని, జరిమానా వేస్తుందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర‌ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) వివరణ ఇచ్చాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న పుత్త‌డిపై పన్నుకు

|

బంగారంపై కేంద్రం పన్ను విధిస్తుందని, జరిమానా వేస్తుందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర‌ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) వివరణ ఇచ్చాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న పుత్త‌డిపై పన్నుకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదంటూ సిబిడిటి స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. వారసత్వంగా సంక్రమించిన బంగారంపై కానీ, వెల్లడించిన ఆదాయంతో కొన్న బంగారంపై కానీ ఎలాంటి పన్నూ ఉండవని భ‌రోసా ఇచ్చారు.


సీబీడీటీ, కేంద్రం ఇచ్చిన కొన్ని వివ‌ర‌ణ‌లు
1. ప్ర‌జ‌ల వ‌ద్ద ఉండే బంగారం, ఆభ‌ర‌ణాల‌కు సంబంధించి ఎటువంటి ప‌రిమితి లేదు. వార‌స‌త్వంగా కానీ, క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో కొన్న‌ట్లు చూపితే స‌మ‌స్య ఉండ‌దు.
2. వెల్లడించిన ఆదాయం లేదా వ్యవసాయ ఆదాయం లేదా ఇంట్లో పొదుపు చేసి కొన్నవి, వారసత్వంగా వచ్చిన బంగారం, ఆభరణాలపై ప్రస్తుత నిబంధనల ప్రకారం లేదా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి పన్ను ఉండదు.
3. వివాహం అయిన మ‌హిళ వ‌ద్ద 500 గ్రాములు, అవివాహిత యువ‌తి వ‌ద్ద 250 గ్రాములు, పురుషుల వ‌ద్ద 100 గ్రాముల వ‌ర‌కూ బంగారం ఉంచుకోవ‌చ్చు. ఆ ప‌రిమితి వ‌ర‌కూ ఆదాయం స‌రిపోల‌క‌పోయినా.. వాటికి సంబంధించి అధికారులు ఎటువంటి విర‌ణ అడ‌గ‌రు. ఇంకా వాటిని స్వాధీనం చేసుకోరు.
4. కుటుంబ సంప్ర‌దాయాలు, ఆచారాల వంటి కార‌ణాల చేత ఎక్కువ బంగారం క‌లిగి ఉంటే అధికారులు విచక్ష‌ణ‌తో వాటిని స్వాధీనం చేసుకోకుండా వారికి అధికారాలు ఉంటాయి.
5. ఐటీ చ‌ట్టానికి తాజాగా చేసిన స‌మ‌ర‌ణ‌ల్లో ప్ర‌తిపాదించిన 85% ప‌న్ను, చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ఆదాయంతో స‌మ‌కూర్చుకున్న బంగారం, ఇత‌ర ఆభ‌ర‌ణాల నిల్వ‌ల‌కు వ‌ర్తించ‌దు.

Read more about: gold gold rates gold price
English summary

వార‌స‌త్వంగా వ‌చ్చిన బంగారంపై ప‌న్ను లేదు, వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: ప‌్ర‌భుత్వం | Married Women Can Hold Up to 500 gm Gold, No Tax On Ancestral Jewellery

The jewellery/gold purchased out of disclosed income or out of exempted income like agricultural income or out of reasonable household savings or legally inherited which has been acquired out of explained sources is neither chargeable to tax under the existing provisions nor under the proposed amended provisions," the CBDT said.
Story first published: Friday, December 2, 2016, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X