For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌కు సిద్ద‌మ‌వుతున్న భార‌తీయ రైల్వే

కేంద్ర ప్ర‌భుత్వ ఆశ‌యానికి అనుగుణంగా భార‌తీయ రైల్వే న‌గదు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌గా అడుగులు వేస్తోంది. డిసెంబ‌రు 31 లోపు త‌మ రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్ల‌లో 15 వేల పీవోఎస్‌(పాయింట్ ఆఫ్ సేల్స్‌) యంత్రాల‌న

|

కేంద్ర ప్ర‌భుత్వ ఆశ‌యానికి అనుగుణంగా భార‌తీయ రైల్వే న‌గదు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌గా అడుగులు వేస్తోంది. డిసెంబ‌రు 31 లోపు త‌మ రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్ల‌లో 15 వేల పీవోఎస్‌(పాయింట్ ఆఫ్ సేల్స్‌) యంత్రాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల్సిందిగా ఇండియ‌న్ రైల్వేస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐల‌ను కోరింది. రైల్వే ప్ర‌యాణ టిక్కెట్ల బుకింగ్ డిజిట‌ల్ దిశ‌గా మార్చేందుకు ఈ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతానికి కౌంట‌ర్ల‌లో కార్డుల‌తో చెల్లింపులు జ‌రిపేందుకు ఎటువంటి పీవోఎస్‌లు రైల్వేల వ‌ద్ద లేవు.

న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌కు సిద్ద‌మ‌వుతున్న భార‌తీయ రైల్వే

రోజువారీ లావాదేవీల‌ను బ‌ట్టి 12 వేల కౌంట‌ర్ల‌లో పీవోఎస్ యంత్రాల‌ను ఏర్పాటు చేస్తారు. రైల్వే యంత్రాంగానికి సైతం పెద్ద ఎత్తున న‌గ‌దు నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మే. ఈ క్ర‌మంలో స‌రిప‌డా స్వైపింగ్ యంత్రాలు ఉండ‌టం వ‌ల్ల వారికి సైతం మంచిదేన‌ని రైల్వే బోర్డు అధికారి ఒక‌రు తెలిపారు. మొద‌టి ద‌శలో ప‌ట్ట‌ణ ప్రాంత కౌంట‌ర్ల‌లో పీవోఎస్‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. అదే విధంగా రైల్వే మంత్రిత్వ శాఖ సైతం వెండార్ల‌, కాంట్రాక్ట‌ర్ల చెల్లింపుల కోసం న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తుంద‌ని స‌మాచారం. త‌మ అధికారుల‌కు రైల్వే మంత్రి సురేష్ ప్ర‌భు ఆ విధంగా ఆదేశాలిచ్చారు.

Read more about: railways train
English summary

న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌కు సిద్ద‌మ‌వుతున్న భార‌తీయ రైల్వే | Indian Railways to go cashless at ticket counters

Indian Railways has asked the State Bank of India and ICICI Bank, among others to provide around 15,000 point of sale (PoS) machines at reservation counters, with about a thousand of these machines to be made available by Dec 31, to make railway travel bookings digital. Currently, the Railways does not provide POS service for debit and credit card payments at its ticket counters.
Story first published: Friday, December 2, 2016, 14:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X