For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ ఖాతా తెరిచే విధానం, ఉప‌యోగించే ప‌ద్ద‌తులు

పేటీఎమ్ వ్యాలెట్‌ను ఉప‌యోగించ‌డం ఎలా? నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ్యాలెట్లు, మొబైల్ యాప్‌ల గురించిన చ‌ర్చ ప్ర‌జ‌ల్లో ఎక్కువైంది. రేడియో, టీవీ ప్ర‌క‌ట‌నల్లో సైతం పేటీఎమ్

|

పేటీఎమ్ వ్యాలెట్‌ను ఉప‌యోగించ‌డం ఎలా?
నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ్యాలెట్లు, మొబైల్ యాప్‌ల గురించిన చ‌ర్చ ప్ర‌జ‌ల్లో ఎక్కువైంది. రేడియో, టీవీ ప్ర‌క‌ట‌నల్లో సైతం పేటీఎమ్ వ్యాలెట్ గురించి వినిపిస్తోంది. అయితే పేటీఎమ్ వ్యాలెట్ అంటే ఏమిటి? దానిని ఏయే అవ‌స‌రాల కోసం వాడుకోవ‌చ్చో ఇక్క‌డ తెలుసుకుందాం.
పేటీఎమ్ ద్వారా చెల్లింపులు జ‌రిపితే సినిమా టిక్కెట్లు, బిల్లు చెల్లింపులపై ఉండే ఆఫ‌ర్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

పేటీఎమ్ వ్యాలెట్లో ఉండే రెండు ర‌కాలు:

పేటీఎమ్ వ్యాలెట్లో ఉండే రెండు ర‌కాలు:

క‌నీస కేవైసీ వ్యాలెట్: మొబైల్ నంబ‌రు, మెయిల్ ఐడీ ద్వారా వెరిఫికేష‌న్ పూర్త‌యిన ఏ పేటీఎమ్ వ్యాలెట్ అయినా ఈ కేట‌గిరీ కింద‌కు వ‌స్తుంది. ఈ త‌ర‌హా వ్యాలెట్‌కు నెల‌కు ఖాతా ప‌రిమితి రూ. 10వేలుగా ఉంటుంది. ఇత‌రుల‌కు పంప‌గ‌ల డ‌బ్బు ప‌రిమితిని రూ. 25 వేలుగా ఉంచారు. ఖాతా ప‌రిమితిని డిసెంబ‌రు 30 వ‌రకూ అన్ని వ్యాలెట్లకు ఇటీవ‌లే రూ. 20 వేల‌కు పెంచారు. అంటే ఏ స‌మ‌యంలోనైనా మీరు వ్యాలెట్ల‌లో రూ. 20 వేల వ‌ర‌కూ క‌లిగి ఉండొచ్చు. మ‌ర్చంట్లు అయితే ఈ ప‌రిమితి రూ. 50 వేలు.

పేటీఎమ్ కేవైసీ వెరిఫికేష‌న్ పూర్తి చేయ‌డం ఎలా?

సంపూర్ణ కేవైసీ వ్యాలెట్: ఆర్‌బీఐ సూచించిన కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం ద్వారా కేవైసీ సంపూర్ణ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. ఈ త‌ర‌హా వ్యాలెట్ల‌లో క‌స్ట‌మ‌ర్లు రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ డ‌బ్బును పెట్టుకోవ‌చ్చు. ఇత‌రుల‌కు బ‌దిలీ చేయ‌గ‌ల డ‌బ్బు ప‌రిమితి ఈ ఖాతాల‌కు రూ. 25 వేలుగా ఉంటుంది.

పేటీఎమ్ వ్యాలెట్లోకి డ‌బ్బులు ఎలా వేసుకోవాలి?

పేటీఎమ్ వ్యాలెట్లోకి డ‌బ్బులు ఎలా వేసుకోవాలి?

* మీ పేటీఎమ్ ఖాతాకు లాగిన్ అవండి. ఎంత జ‌మ చేసుకోవాల‌నుకుంటున్నారో

న‌మోదు చేసి, యాడ్ మ‌నీ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి

* ఇప్పుడు డ‌బ్బును ఎలా జ‌మ‌చేయాల‌నుకుంటున్నారో ఆప్ష‌న్ ఎంచుకోవండి. అంటే ఉదాహ‌ర‌ణ‌కు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌ను ఎంచుకోవ‌డం.

* ఇప్పుడు నెట్‌బ్యాంకింగ్‌కు రీడైరెక్ట్ అవుతుంది. సీవీవీ, మొబైల్ ఓటీపీని ఎంట‌ర్

చేయ‌డం ద్వారా డ‌బ్బు జ‌మ పూర్త‌వుతుంది.

* ఒక‌సారి పేటీఎమ్ వ్యాలెట్‌లో డ‌బ్బు ఉన్న త‌ర్వాత దాన్ని షాపింగ్‌, బిల్లు

చెల్లింపుల‌కు వాడుకోవ‌చ్చు. ఇత‌ర ఖాతాల‌కు బ‌దిలీ సైతం చేసుకోవ‌చ్చు.

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

పేటీఎమ్ నుంచి బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేసే విధానం

పేటీఎమ్ నుంచి బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేసే విధానం

  1. ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం యాప్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. వెబ్‌సైట్లో లేదు.

  2. పేటీఎమ్ యాప్ తెరిచిన త‌ర్వాత పే ఆర్ సెండ్‌(Pay or Send) పైన క్లిక్ చేయండి.

  3. ల‌బ్దిదారు ఖాతా సంఖ్య‌, ఐఎఫ్ఎస్‌కోడ్ వివ‌రాల‌ను యాడ్ చేయండి.

    అవ‌స‌రాన్ని బ‌ట్టి దేనికి డ‌బ్బు పంపిస్తున్నారో(కార‌ణాన్ని) సైతం రాసుకోవ‌చ్చు.

  4. సెండ్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే ల‌బ్దిదారు ఖాతాకు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది.

పేటీఎమ్ వ్యాలెట్ నుంచి మొబైల్ నంబ‌రుకు డ‌బ్బు పంపండిలా...

పేటీఎమ్ వ్యాలెట్ నుంచి మొబైల్ నంబ‌రుకు డ‌బ్బు పంపండిలా...

* పేటీఎమ్ యాప్ తెరిచిన త‌ర్వాత పే ఆర్ సెండ్‌(Pay or Send) ఐకాన్‌పై క్లిక్ చేయండి. త‌ర్వాత మొబైల్ నంబ‌రు ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

* మీరు డ‌బ్బు పంపాల‌నుకుంటున్న మొబైల్ నంబ‌రు, ఎంత డ‌బ్బు అనే వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి.

* సెండ్(Send) ఆప్ష‌న్‌పై క్లిక్ చేయండి.

* డ‌బ్బు బ‌దిలీ పూర్తి అయిన త‌ర్వాత మీరు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ నోటిఫికేష‌న్ పొందుతారు.

Read more about: paytm పేటీఎమ్
English summary

పేటీఎమ్ ఖాతా తెరిచే విధానం, ఉప‌యోగించే ప‌ద్ద‌తులు | What is paytm and how to use it?

Paytm Wallet is the most trending term that we hear these days over the radio, in the TVC ads and others forms of social media, But what is Paytm wallet? How can one use it for there daily requirements to get over this cash crunch lets find out
Story first published: Wednesday, November 30, 2016, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X